S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/22/2018 - 01:33

ముంబయి, ఆగస్టు 21: దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి పేరిట 13 యూనివర్సిటీల్లో అధ్యయన పీఠాలు ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంతివార్ మంగళవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. పదకొండు ప్రభుత్వ, రెండు ప్రైవేటు యూనివర్సిటీల్లో ఈ అధ్యయన పీఠాల ఏర్పాటుకు తమ ప్రభుత్వం 20 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

08/22/2018 - 01:32

తిరువనంతపురం, ఆగస్టు 21: వరదలు, భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళలో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తక్షణమే రూ.2600 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. గత పది రోజుల్లో వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 223 చేరుకుంది. దాదాపు పది లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

08/22/2018 - 01:29

తిరువనంతపురం, ఆగస్టు 21: ఆపదలెదురైనపుడు తరతమ భేదాలకు తావులేకుండా ఆపన్నహస్తం అందించాలన్న మహదాశయంతో కేరళ వరదల్లో నిరుపమాన తెగువ, సేవాతత్పరతలను ప్రదర్శించి మత్స్యకారులు అందరి మన్ననలను అందుకుంటున్నారు. ఎర్నాకుళం జిల్లాలో జలవిలయంలో చిక్కి విలవిలలాడుతున్న యాభై నాలుగు వేల మందికి పైగా వరద బాధితులను రక్షించిన వీరిని ప్రసార, సామాజిక మాధ్యమాలు సూపర్ హీరోలుగా కీర్తిస్తున్నాయి.

08/22/2018 - 01:26

న్యూఢిల్లీ, ఆగస్టు 21: వరదలతో అతలాకుతలమైన కేరళలో అంటువ్యాధులు వ్యాపించినట్టు సమాచారం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. వరద తగ్గిన తరువాత వ్యాధులు ప్రబలకుండా ఉండేలా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ)ని అప్రమత్తం చేసినట్టు మంగళవారం ఇక్కడ వెల్లడించారు. గాలి, నీటి ద్వారా అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉన్నందున రాష్ట్రానికి పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు.

08/22/2018 - 01:22

న్యూఢిల్లీ, ఆగస్టు 21: కేరళలో వరద బీభత్సం అంత తీవ్రంగా ఉండడానికి బంగాళాఖాతంలో ఏర్పడిన రెండు అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనానికి తోడు ఆగ్నేయ రుతుపవనాలే కారణమని నిపుణులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కుండపోత వర్షానికి ఇవే కారణమని వారు తేల్చారు. కోస్తా తీరంలోని పశ్చిమ కనుమల్లో ఉన్న కేరళలో వందేళ్ల తరువాత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.

08/22/2018 - 01:02

కోల్‌కతా, ఆగస్టు 21: కేరళలోని తన ఇంట్లో దశాబ్దాల కాలం నుంచి భద్రపరుచుకుంటూ వస్తున్న పురాతన రికార్డులు, న్యూస్ పేపర్ క్లిప్పింగ్‌లు భారీ వర్షాలు, వరదల తాకిడికి ఏమయ్యాయోనని ప్రముఖ చరిత్రకారుడు, రచయిత పీటీ నాయర్ వాపోయారు.

08/22/2018 - 01:02

న్యూఢిల్లీ, ఆగస్టు 21: భారీ వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందుకొచ్చింది. 700 కోట్ల రూపాయల మేరకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా ఒక వార్తా సంస్థకు వెల్లడించారు.

08/21/2018 - 23:44

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గల అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, దంత కళాశాలల్లో ప్రవేశానికి ఇకముందు ప్రతి సంవత్సరం రెండుసార్లు ‘నీట్’ ప్రవేశ పరీక్షను నిర్వహించాలనే యోచనను కేంద్రం ఉపసంహరించుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

08/22/2018 - 04:07

న్యూఢిల్లీ: మరికొన్ని నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో సంస్థాగత మార్పులకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ పార్టీ కోశాధికారిగా నియమితులయ్యారు.

08/21/2018 - 14:00

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించిన హర్యానా క్రీడాకారిణి వినేశ్ ఫొగాట్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు నజరానాను అందజేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు హర్యానా క్రీడల శాఖ మంత్రి అనిల్ విజ్ సోమవారం ట్విట్టర్ ద్వారా వినేజ్‌ను అభినందిస్తూ నజరానా ప్రకటించారు. అంతేకాదు సివిల్ సర్వీసెస్ లేదా పోలీస్ సర్వీస్‌లో ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.

Pages