S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/22/2018 - 12:42

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి గురుదాస్ కామత్ కన్నుమూశారు. అనారోగ్యంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం ఉదయం కన్నుమూశారు. ముంబయి నార్త్ వెస్ట్ నుంచి దాదాపు ఐదుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. సమాచార, ఐటీ శాఖలకు మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఈరోజు ఉదయం ఆసుపత్రికి వెళ్లి సంతాపం తెలిపారు.

08/22/2018 - 13:01

ముంబయి: ముంబయి నగరంలోని పరేల్ ప్రాంతంలోని క్రిస్టల్ టవర్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.బుధవారం ఉదయం చెలరేగిన ఈ మంటలను ఆర్పేందుకు దాదాపు 20 అగ్నిమాపక దళాలు ప్రయత్నిస్తున్నాయి. మంటల్లో చిక్కుకుపోయిన వారిని క్రేన్ల సాయంతో రక్షించే ఏర్పాట్లు చేశారు. పై అంతస్తులో చిక్కుకుపోయిన వారిని రక్షించి ఆసుపత్రికి తరలిస్తున్నారు.

08/22/2018 - 01:55

మంగళవారం భారత పర్యటనకు వచ్చిన చైనా రక్షణ శాఖ మంత్రి జనరల్ వీ ఫెంగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయినప్పటి చిత్రం

08/22/2018 - 01:53

న్యూఢిల్లీ, ఆగస్టు 21: వచ్చే ఎన్నికలను, జమ్ముకాశ్మీర్‌లో మిలిటెన్సీ కార్యకలాపాలను నియంత్రించేందుకు కేంద్రం రాజకీయ నిర్ణయాలు తీసుకుంది. మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. కాగా జమ్ముకాశ్మీర్‌కు బీహార్ గవర్నర్‌ను బదిలీ చేశారు. బీహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను జమ్ముకాశ్మీర్ గవర్నర్‌గా నియమించారు.

08/22/2018 - 01:52

చిత్రం..పాకిస్తాన్ వెళ్లివచ్చిన సిద్ధు, కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలకు నిరసనగా
మంగళవారం జమ్ములో ధర్నా నిర్వహిస్తున్న శివసేన కార్యకర్తలు

08/22/2018 - 01:49

చంఢీగఢ్, ఆగస్టు 21: సొంత కాంగ్రెస్ పార్టీ నుంచే కాక, దేశవ్యాప్తంగా తన చర్యపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ మరోసారి వివరణ ఇచ్చుకున్నారు. తన మిత్రుడు ఇమ్రాన్‌ఖాన్ ప్రధానిగా ప్రమాణస్వీకార ఉత్సవానికి రమ్మని చేసిన ఆహ్వానం మేరకే తాను ఇస్లామాబాద్ వెళ్లానని, తన పర్యటనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

08/22/2018 - 01:47

న్యూఢిల్లీ, ఆగస్టు 21: వాట్సాప్‌లో అసత్య సందేశాలు, అశ్లీల సమాచారం వంటి వాటిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రయత్నాలు ప్రారంభించింది. తప్పుడు సమాచారంతో దేశంలోని పలు ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం ఇక్కడ వాట్సాప్ చీఫ్ క్రిస్ డేనియల్స్‌లో సమావేశమయ్యారు.

08/22/2018 - 01:38

అర్రాహ్ (బిహార్), ఆగస్టు 21: బిహార్‌లో ఒక మహిళపై దౌర్జన్యం చేసి నగ్నంగా ఊరేగించిన ఘటన వివాదస్పదమవుతోంది. ఈ కేసులో స్థానిక ఆర్‌జీడీ పార్టీ కార్యకర్తతో పాటు 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు 8 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

08/22/2018 - 01:36

న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఈ ఏడాది జూన్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై రూపొందించిన ఫిట్నెస్ వీడియోపై అధికారికంగా ఎలాంటి ఖర్చు చేయలేదని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ వీడియో రూపొందించేందుకు దాదాపు 35 లక్షల రూపాయలు వెచ్చించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు శశిధరూర్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

08/22/2018 - 01:35

న్యూఢిల్లీ, ఆగస్టు 21: సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్‌లో అశ్లీల సైట్లను అప్‌లోడ్ చేయడంపై ఉక్కుపాదం మోపాలని, అశ్లీల సాహిత్యాన్ని వాట్సప్‌ల ద్వారా ప్రచారం చేయడంపై వేటు వేయాలని కేంద్రమంత్రుల బృందం నిర్ణయించింది. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్‌లను వినియోగిస్తూ అశ్లీల సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి కళ్లెం వేయాలని కేంద్రం నిర్ణయించింది.

Pages