S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/01/2018 - 05:06

బెంగళూరు, జూన్ 30: కావేరీ జలాల పంపిణీపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మేనెజ్‌మెంట్ బోర్డును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. తమిళనాడు, కర్నాటక, పుదుచ్ఛేరి, కేరళకు జలాల పంపిణీకి సంబంధించి ‘కావేరీ యాజమాన్య బోర్డు’ను ఇటీవల కేంద్రం ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే కేంద్రం బోర్డును ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి నోటీఫికేషన్ విడుదలయింది.

07/01/2018 - 05:08

సిమ్లా, జూన్ 30: మధ్యవర్తిత్వం, సంప్రదింపుల ద్వారా కేసులను సత్వరమే పరిష్కరించే విధానం మంచిదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ అన్నారు. శనివారం ఆయన ఇక్కడ హిమాచల్‌ప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీని ప్రారంభించారు.

07/01/2018 - 04:48

అమర్‌నాథ్ యాత్ర నిమిత్తం జమ్మూలోని బేస్ క్యాంప్ వద్ద
తమ వంతు కోసం నిరీక్షిస్తున్న సాధువులు

07/01/2018 - 04:47

ఉత్తరాదిని వానలు ముంచెత్తుతుండగా శ్రీనగర్‌లో జీలం నది పరవళ్ళు తొక్కుతోంది. నీళ్లల్లో మునిగే స్థితిలో ఉన్న హనుమాన్ మందిర్. అగర్తలలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా శనివారం మట్టి పెళ్లలు విరిగి పడటంతో భయంతో వీధుల్లోకి వచ్చిన ప్రజలు. కాగా, భువనేశ్వర్‌లో భారీ వర్షాలతో జలమయమైన లోతట్టు ప్రాంతాలు, నీటిలో మునిగిన వాహనాలు.

07/01/2018 - 04:44

న్యూఢిల్లీ, జూన్ 30: భారత్ పరిధిలోని దీవుల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివిధ ప్రభుత్వ శాఖలను, నీతి ఆయోగ్‌ను ఆదేశించారు. శనివారం ఇక్కడ 26 దీవుల సంపూర్ణ్భావృద్ధిపై చేపట్టనున్న ప్రణాళిక వివరాలను నీతి ఆయోగ్ అధికారులు వివరించారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది.

07/01/2018 - 04:42

న్యూఢిల్లీ చాందినీ చౌక్ ప్రాంతంలోని శిష్‌గంజ్ గురుద్వార వద్ద బూట్లు పాలిష్ చేస్తున్న రామ్‌చంద్ర. షూ పాలిష్, చెప్పులు కుట్టడంలో వింతేమీ లేకపోయినప్పటికీ, రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తున్న అతను ప్రతి రోజూ ఉదయం 7 నుంచి 8.30 గంటల వరకూ ఉచితంగా ఇలా సేవ చేయడం గొప్పతనమే. గత పదిహేనేళ్లుగా రామ్‌చంద్ర క్రమం తప్పకుండా గురుద్వారకు వస్తూ, సేవలు అందిస్తూనే ఉన్నాడు.

07/01/2018 - 04:40

న్యూఢిల్లీ/ముంబయి, జూన్ 30: భారతదేశంలో వారసత్వ కట్టడాలుగా ప్రసిద్ధిగాంచిన ముంబయిలోని విక్టోరియన్ గోతిక్, ఆర్ట్‌డీకో భవనాలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో స్థానం సంపాదించాయి. ఇది భారతదేశానికి నిజంగా సంతోషకరమైన వార్తేనని కేంద్రం వ్యాఖ్యానించింది. దేశానికి ఇలాంటి గుర్తింపు లభించడం ఇది మూడోసారి.

07/01/2018 - 00:46

న్యూఢిల్లీ, జూన్ 30: వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. సబ్సిడీపై పంపిణీ చేస్తున్న వంటగ్యాస్ సిలిండర్‌కు రూ.2.71 పైసలను పెంచినట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటన విడుదల చేసింది. పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయ.

06/30/2018 - 17:24

కర్ణాటక: కాంగ్రెస్‌, జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగుతుందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టంచేశారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ల సంకీర్ణం పట్ల సిద్ధరామయ్య సంతోషంగా లేరని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తాను సంతోషంగా లేనని ఎవరు చెప్పారని ప్రశ్నించారు.

06/30/2018 - 14:00

జమ్ముకాశ్మీర్‌: భారీ వర్షాలు, వరద హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అమర్‌నాథ్‌ యాత్రను నిలిపివేయగా శనివారం తిరిగి ప్రారంభమైంది. భక్తులు అమర్‌నాథ్‌ను దర్శించేందుకు ఆలయానికి బయలుదేరారు. అలాగే బల్తాల్‌ బేస్‌ క్యాంపు నుంచి అమర్‌నాథ్‌ గుహకు హెలికాప్టర్‌ సేవలు ప్రారంభమయ్యాయి. మరోవైపు జీలం నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు ప్రజలకు వరద హెచ్చరికలు జారీ చేశారు.

Pages