S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/31/2018 - 02:09

న్యూఢిల్లీ, జనవరి 30: దేశవ్యాప్తంగా మంగళవారం నాడు జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని నిర్వహించగా, ఆయన హత్య కేసుకు సంబంధించి కొత్త వాదన తెరపైకి వచ్చింది. గాంధీ హత్యకేసు పూర్తిస్థాయిలో కొలిక్కిరాకముందే ‘కుట్రదారులు’గా ఆరోపణలు ఎదుర్కొన్న నాథూరామ్ గాడ్సే, నారాయణ్ దత్తాత్రేయ ఆప్టేలను ఉరి తీశారని ముంబయికి చెందిన డాక్టర్ పంకజ్ ఫడ్నీస్ సుప్రీంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో తెలిపారు.

01/31/2018 - 02:09

మరణానికి ముందు మహాత్మాగాంధీ గడిపిన ఢిల్లీలోని ‘గాంధీ స్మృతి భవన్’. తన చివరి 144 రోజులు ఆయన ఇక్కడే గడిపారు. సిమెంటుతో తయారు చేసిన గాంధీ పాదముద్రలను స్మృతి భవన్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన దృశ్యం.

01/31/2018 - 02:06

న్యూఢిల్లీ, జనవరి 30: కాశ్‌గంజ్ హింసకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. కాశ్‌గంజ్ ఘటనపై బీజేపీ నాయకులే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దీన్లో రాజకీయపార్టీల జోక్యం చేసుకోవడంతపై ముఖ్యమంత్రి తీవ్రంగానే స్పందించారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మీడియాపైనే విమర్శలు చేయగా, బీజేపీ సీనియర్ నేత వినయ్ కతియార్ వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి.

01/31/2018 - 02:05

న్యూఢిల్లీ, జనవరి 30: పెద్దనోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఎంతమేరకు నల్లధనం సేకరించారో తెలియజేయాలని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆర్థిక మంత్రిత్వ శాఖను ఆదేశించింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఏడాది క్రితం దాఖలైన దరఖాస్తుపై స్పందిస్తూ ఈ ఉత్తర్వులను సీఐసీ జారీచేసింది.

01/31/2018 - 02:05

న్యూఢిల్లీ, జనవరి 30: మహిళల సాధికారిత, అభివృద్ధి, సంక్షేమంకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలుచేస్తున్న పథకాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నన్నపునేని రాజకుమారి చెప్పారు. మంగళవారం ఏపీ భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్, గర్భవతి మహిళల కిట్స్ పథకం, రుణాల మంజూరు మహిళలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు.

01/31/2018 - 02:02

న్యూఢిల్లీ, జనవరి 30: దళిత, గిరిజనుల రక్షణ కొరకు తీసుకుంటున్న చర్యల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి అన్నారు.

01/31/2018 - 02:01

న్యూఢిల్లీ, జనవరి 30: షెడ్యూల్డు కులాల రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు నంది ఎల్లయ్య మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. న్యాయమూర్తి ఉషా మెహ్రా నివేదికను ఆమోదించి వర్గీకరణ సవరణ బిల్లు పార్లమెంటులో ప్రతిపాదించాలని ఆయన కోరారు. ఉషా మెహ్రా నివేదిక గత తొమ్మిది సంవత్సరాల నుంచి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని ఆయన చెప్పారు.

01/31/2018 - 02:01

న్యూఢిల్లీ, జనవరి 30: దేశంలోని వృద్ధుల స్థితిగతుల పట్ల సరైన ఆదరణ లేదని, వారి విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తగిన శ్రద్ధ వహించడం లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో వృద్ధాశ్రమాలకు సంబంధించిన వివరాలతో అఫిడ్‌విట్ దాఖలు చేయాలని తాము కోరినప్పటికీ ఇంతవరకు పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్పందించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేసింది.

01/31/2018 - 02:00

న్యూఢిల్లీ, జనవరి 30: నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలను తూర్పారపట్టడమే లక్ష్యంగా చేసుకున్న కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ‘రాష్ట్ర మంచ్’ పేరిట ఓ కొత్త రాజకీయ వేదికను మంగళవారం ఇక్కడ ప్రారంభించారు. బీజేపీలో అసంతృప్తి నేతగా ముద్ర పడిన ఎంపీ శత్రుఘ్న సిన్హాతో ఆయన చేతులు కలపడం ఇపుడు చర్చనీయాంశమైంది.

01/31/2018 - 01:24

న్యూఢిల్లీ, జనవరి 30: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో స్పిల్‌వే కాంక్రీటు, స్పిల్ చానల్ పనులను నవయుగ సంస్థకు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించింది.

Pages