S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/02/2018 - 01:06

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఇది ప్రగతిశీల బడ్జెట్ అని హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసం, దూరాన్ని తగ్గించేందుకు బడ్జెట్ ఓ వారధిగా ఉపయోగపడుతుందని రాజ్‌నాథ్ చెప్పారు. ఆర్థికవృద్ధిని, పెట్టుబడులు పెరగడానికి బడ్జెట్ దోహదం చేస్తుందని హోమ్‌మంత్రి పేర్కొన్నారు. వౌలిక రంగాలకు కేటాయింపులు సంతృప్తినచ్చినట్టు ఆయన తెలిపారు.

02/01/2018 - 00:28

రోదశిలో ఇదొక అరుదైన అద్భుతం. పండు వెనె్నలను కురిపించే చంద్రుడు మూడు రూపాల్లో కనువిందైన రీతిలో దర్శనమిచ్చాడు. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ఏడాది తొలి సంపూర్ణ చంద్ర గ్రహణం చిరస్మరణీయ అనుభూతినే కలిగించింది. భారత్‌లో కొన్నిచోట్ల మాత్రమే ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపించింది.

02/01/2018 - 00:25

మేడిన్ ఇండియా రక్షణ శాఖకు మరింత దన్నును అందించింది. భారత్‌లో నిర్మితమైన స్కార్పియన్ శ్రేణి జలాంతర్గామి ఐఎన్‌ఎస్ కరంజ్ జల ప్రవేశం చేసింది. మూడో స్వదేశీ జలాంతర్గామి ముంబయలోని మజ్‌గావ్ డాక్‌యార్డ్‌లో తయారైంది. ఈ జలాంతర్గామికి అత్యాధునికమైన సాంకేతిక పాటవం ఉంది.
ఏడాదిపాటు అనేకరకాలుగా పరీక్షించిన మీదట ఈ జలాంతర్గామిని నౌకాదళంలోకి చేర్చనున్నారు.

02/01/2018 - 00:14

న్యూఢిల్లీ, జనవరి 31: ప్రధాని నరేంద్ర మోదీ జమిలి ఎన్నికల గురించి ఆలోచిస్తున్న తరుణంలో ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గురువారం లోక్‌సభలో అందరి మన్ననలు పొందే మంచి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అరుణ్ జైట్లీ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో 2018-19 వార్షిక ప్రణాళికను ప్రతిపాదిస్తారు.

01/31/2018 - 22:18

న్యూఢిల్లీ, జనవరి 31: విభజన చట్టంలో ఇచ్చిన హామీమేరకు తెలంగాణ, ఆంధ్ర అసెంబ్లీ సీట్ల పెంపు, తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు, పార్టీ పరిస్థితిపై చర్చించేందుకు జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం రెండు రాష్ట్రాల బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. చర్చల అనంతరం అసెంబ్లీ సీట్ల పెంపుపై ఒక నిర్ణయం రావొచ్చన్న వాదనా వినిపిస్తోంది.

01/31/2018 - 22:17

షిల్లాంగ్, జనవరి 31: నరేంద్ర మోదీ ఇప్పటికీ ‘సూటు-బూటు ప్రధాని’ అని, పేదలకు దూరంగా ఉండేలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. తాను ఖరీదైన నలుపు జాకెట్‌ను ధరించడం పట్ల మేఘాలయ బీజేపీ విభాగం చేసిన వ్యాఖ్యలకు రాహుల్ తీవ్రంగా స్పందించారు.

01/31/2018 - 22:13

న్యూఢిల్లీ, జనవరి 31: జాతీయ మహిళా కమిషన్ ఏర్పడి పాతికేళ్లు పూరె్తైన సందర్భంగా ఇప్పటివరకూ మహిళల హక్కుల పరిరక్షణలో అది నిర్వహించిన పాత్ర, రాజకీయంగా లభిస్తున్న ఆదరణపై కేంద్ర మంత్రి మేనకాగాంధీ బుధవారం ఇక్కడ అనేక కీలక ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

01/31/2018 - 22:12

న్యూఢిల్లీ, జనవరి 31: దేశంలోని వెనుకబడిన కులాల రిజర్వేషన్లను 52 శాతానికి పెంచి వర్గీకరించాలని జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సంగం సూర్యారావు, ఇతర నాయకులు వంశరాజ్, అంతయ్య, రవిశంకర్, నరసింహసాగర్, సతీష్ డిమాండ్ చేశారు. జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం నాయకులు బుధవారం ఓబీసీ రిజర్వేషన్ల వర్గీకరణ కమిటీ అధ్యక్షురాలు, న్యాయమూర్తి రోహిణిని కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు.

01/31/2018 - 03:31

చిత్రాలు.. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీ రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, యుపిఏ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ

01/31/2018 - 02:10

న్యూఢిల్లీ, జనవరి 30: మంచి రోజులు వస్తున్నాయన్న 2018 ఆర్థిక సర్వేపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యోక్తులు విసిరారు. 2018-19లలో 7.5 శాతం అభివృద్ధితో మంచి రోజులు వస్తున్నాయని ప్రధాన మంత్రి నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రతిపాదించిన ఆర్థిక సర్వే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ మంగళవారం ట్వీట్ చేశారు.

Pages