S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/14/2017 - 01:44

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: భారత్ నుంచి రోహింగ్యా ముస్లింలను తిప్పి పంపించే అంశానికి సంబంధించి సంబంధిత పక్షాలు తమ సమాధానాలను సమర్పించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం మరింత వ్యవధి ఇచ్చింది. ఈ కేసు విచారణను నవంబర్ 21వ తేదీకి వాయిదా వేసిన అత్యున్నత న్యాయస్థానం, అప్పటి వరకు రోహింగ్యా శరణార్థులను ఎవరినీ దేశం నుంచి పంపించివేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

10/14/2017 - 01:24

న్యూఢిల్లీ,అక్టోబరు 13:తెలుగు రాష్ట్రాలలో తీవ్ర దూమారం రేపిన సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు వివాదాస్పద పుస్తకాన్ని నిషేధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు-కోమటోళ్లు అనే పుస్తకాన్ని నిషేధించాలని కోరుతు దాఖలైన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

10/14/2017 - 01:03

న్యూఢిల్లీ, అక్టోబరు 13: కృష్ణా నది జలాల వివాదంపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తదుపరి విచారణ నవంబర్ 15, 16, 17 తేదీలకు వాయిదా పండిం ది.

10/14/2017 - 01:00

న్యూఢిల్లీ, అక్టోబర్ 13: జాతీయ సమగ్రత పరిరక్షణలో గురుతర బాధ్యత నిర్వర్తించాలని గవర్నర్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రెండు రోజుల పాటు ఇక్కడ జరిగిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సదస్సు ముగింపులో మాట్లాడిన మోదీ, దేశంలో కొత్త ఆలోచనలు, వనరులతో పాటు సామర్ధ్యానికి ఎలాంటి కొదవ లేదని స్పష్టం చేశారు.

10/13/2017 - 02:39

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య వారధిగా పని చేసే గవర్నర్లు అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు తోడ్పడాలని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపిచ్చారు. గురువారం రాష్టప్రతి భవన్‌లో గవర్నర్ల 48వ సదస్సును ఆయన ప్రారంభిస్తూ 2022లో జరుపుకునే 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పెట్టుకున్న లక్ష్యాల సాధనకు గవర్నర్లు నడుం బిగించాలన్నారు.

10/13/2017 - 02:35

బెంగళూరు, అక్టోబర్ 12: చెన్నై ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న భర్తను పరామర్శించేందకు ఐదు రోజుల పెరోల్‌పై వచ్చిన అన్నాడిఎంకె నాయకురాలు శశికళ గడువు ముగియడంతో తిరిగి గురువారం బెంగళూరు సెంట్రల్ జైలుకు వచ్చింది. ‘గురువారం సాయంత్రం 4.30 గంటలకు శశికళ జైలుకు వచ్చారు. ఆమెకు ఇచ్చిన గడువు లోపలే తిరిగి వచ్చారు’ అని జైళ్ల సూపరింటిండెంట్ జి సోమశేఖర్ తెలిపారు.

10/13/2017 - 02:32

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ఆరుషి తల్వార్ హత్య కేసులో తొమ్మిదేళ్ల పాటు సాగిన విచారణ ఫలితంగా తమ కుటుంబం నరకయాతనను అనుభవించిందని నుపుర్ తల్వార్ తండ్రి బిజి చిట్నిస్ గురువారం ఇక్కడ తెలిపారు. ఈ హత్య కేసులో తల్వార్ దంపతులను నిర్దోషులుగా ప్రకటించినందుకు ఆయన న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

10/13/2017 - 02:30

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ప్రముఖ రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కుటుంబ సమేయంగా గురువారంనాడు ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడును కలుసుకున్నారు. ఇటీవల వివాహం జరిగిన యార్లగడ్డ కుమార్తె సాహితి, అమెరికా పౌరుడైన బ్రెండ్ స్లెచర్‌లను ఉపరాష్టప్రతికి ఆయన పరిచయం చేశారు. ఈ విహహం సంతోషకరమని వెంకయ్య పేర్కొన్నారు. పిల్లాపాపలతో కలకాలం చల్లగా ఉండాలని నూతన దంపతులను ఆశీర్వదించారు.

10/13/2017 - 02:28

ఛోటా ఉదయ్‌పూర్, అక్టోబర్ 12: గుజరాత్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇక్కడకు వచ్చిన రాహుల్ ఛోటా ఉదయ్‌పూర్‌లో యువతతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతవరకూ బాగానే ఉంది. సమావేశం ముగించుకున్న రాహుల్ గాంధీ పొరపాటున లేడీస్ టాయిలెట్‌లోకి వెళ్లారు. ఏమయిందంటే..

10/13/2017 - 02:27

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జయ్ షాకు చెందిన కంపెనీలు జరిపిన ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి)లు దర్యాప్తు చేయాలని సిపిఎం గురువారం డిమాండ్ చేసింది.

Pages