S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/15/2017 - 03:34

హైదరాబాద్, అక్టోబర్ 14: భూగర్భ జలాలను ఎడాపెడా వాడకునే విధానానికి కేంద్రం చెక్ పెట్టనుంది. త్వరలో భూగర్భ జలాల సంరక్షణ పరిరక్షణ క్రమబద్ధీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ముసాయిదా పత్రులను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపారు. కేంద్రం చేయనున్న చట్టాన్ని ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అసెంబ్లీలో చట్టాలు చేసి అమలు చేయాలని కేంద్రం సూచించింది.

10/15/2017 - 03:32

పాట్నా, అక్టోబర్ 14: బిహార్ రాష్ట్ర అభివృద్ధికి నిబద్ధుడయిన నేత నితీశ్ కుమార్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) తిరిగి ఎన్‌డిఎ కూటమిలో చేరిన తరువాత ఈ ఇద్దరు నేతలు తొలిసారి శనివారం ఇక్కడ ఒకే వేదికను పంచుకున్నారు. ప్రతిష్ఠాత్మక పాట్నా విశ్వవిద్యాలయ శత జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ ఇద్దరు నేతలు పాల్గొన్నారు.

10/15/2017 - 03:31

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే ఒక తీర్మానాన్ని ఆమోదించి పార్టీ అధినాయకత్వానికి పంపించింది. ఇతర రాష్ట్రాల పిసిసి కమిటీలు కూడా ఇదే మర్గాన్ని అనుసరిస్తున్నాయి.

10/15/2017 - 03:29

బెంగళూరు, అక్టోబర్ 14: జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య కేసులో ఇద్దరు అనుమానితుల ఊహాచిత్రాలను స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీమ్ (సిట్) శనివారం విడుదల చేసింది. వీటితో పాటు సిసి కెమెరాల ఫుటేజీని కూడా బయటపెట్టింది. హంతకులను ఎవరు గుర్తించినా సిట్‌కు సమాచారం ఇవ్వాలని కోరింది. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం మేరకు ఇద్దరు అనుమానితులకు చెందిన మూడు ఊహాచిత్రాలను విడుదల చేసినట్లు పేర్కొంది.

10/15/2017 - 03:27

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: రెండు రోజుల క్రితం దొంగతనానికి గురైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారు ఘజియాబాద్‌లో దర్శనమిచ్చింది. ‘బ్లూ కలర్ మారుతి వేగన్‌ఆర్ కారు ఘజియాబాద్‌లో కనిపించింది. అది ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌దేనని భావిస్తున్నాం. కారు ఛాసెస్ నెంబరు తదితర వివరాలు పరిశీలించాక పూర్తి నిర్ణయానికి వస్తాం’ అని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు శనివారం తెలిపారు.

10/15/2017 - 03:26

బర్దోలి (గుజరాత్), అక్టోబర్ 14: కాశ్మీర్ సమస్యను పరిష్కరించకుండా తమ ప్రభుత్వాన్ని ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోజాలదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా అధర్మశీలమైన విద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతోందంటూ ఆయన పాకిస్తాన్‌పై విరుచుకుపడ్డారు.

10/15/2017 - 03:23

జజ్జార్ (హర్యానా), అక్టోబర్ 14: పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినందుకు మందలించిన ఓ ఉపాధ్యాయుడిపై విద్యార్థి కత్తితో దాడి చేసి గాయపరచిన సంఘటన జజ్జార్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకుంది. 12వ తరగతి చదువుతున్న పదిహేడేళ్ల విద్యార్థిని తక్కువ మార్కులు వచ్చినందుకు మందలించచాడు. శుక్రవారం జరగనున్న పేరెంట్-టీచర్ మీటింగ్‌లో తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు టీచర్.

10/15/2017 - 03:22

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: జాతీయ సమైక్యతకు పాటుపడిన వారికి అందజేసే ఇందిరాగాంధీ పురస్కారం ఈసారి (2015-16 సంవత్సరాలకు) కర్ణాటకకు చెందిన ప్రముఖ గాయకుడు టిఎం కృష్ణను వరించింది. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్థంతి రోజయిన ఈ నెల 31న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ అవార్డును కృష్ణకు బహూకరించనున్నారు.

10/15/2017 - 03:21

చిత్రం..మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా శనివారం మహారాష్టల్రోని కరద్‌లో హెచ్‌కెడి
ఆంగ్లో ఉర్దూ హైస్కూలులో కలాంకు నివాళులర్పిస్తున్న విద్యార్థినులు

10/15/2017 - 01:41

శ్రీనగర్, అక్టోబర్ 14: జమ్మూకాశ్మీర్‌లో శనివారం భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో లష్కర్ ఎ తోయిబా (ఎల్‌ఇటి)కి చెందిన కరడుగట్టిన ఉగ్రవాది వసీం షా అలియాస్ అబూ ఒసామా భాయ్ (23) హతమయ్యాడు. దక్షిణ కాశ్మీర్‌లో నిరుడు జరిగిన అల్లర్లకు సూత్రధారిగా భావిస్తున్న వసీ పుల్వామా జిల్లాలో శనివారం తెల్లవారు జామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు.

Pages