S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/11/2017 - 22:41

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశ రాజధాని ఢిల్లీ ఓ కొత్త ఆవిష్కరణకు వేదిక కానుంది. ‘న్యూ ఇండియా-2022’ పేరుతో గురువారం ఇక్కడ జరగనున్న గవర్నర్ల సమావేశంలో మార్గనిర్దేశన చేయనున్నారు. రెండు రోజుల గవర్నర్ల భేటీ ఎన్నో ప్రాధాన్యతనలు సంతరించుకుంది. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అధ్యక్షత వహిస్తున్న అత్యంత కీలకమైన తొలి సమావేశమిది.

10/11/2017 - 22:40

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ముంబయి ఎల్ఫిన్‌స్టోన్ బ్రిడ్జిమీద 23మంది ప్రయాణికుల ఊపిరి ఆగిపోవడానికి కారణం వర్షమేనంటూ దర్యాప్తు బృందం తేల్చేసింది. ‘వర్షమే 23మంది ఊపిరి తీసింది. భారీ వర్షంతో అయోమయానికి గురైన ప్రయాణికులు, తలదాచుకోవడానికి ఆకస్మికంగా బ్రిడ్జి మీదకు చేరడంతో తొక్కిసలాట తలెత్తింది’ అంటూ దర్యాప్తు బృందం తన నివేదికలో స్పష్టం చేసింది.

10/11/2017 - 02:42

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: భారత వైమానిక దళాన్ని సర్వసన్నద్ధం చేస్తామని, సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల తలెత్తిన లోపాలను తొలగిస్తామని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఐఏఎఫ్ కమాండర్ల ద్వైవార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మంగళవారం నాడిక్కడ మాట్లాడిన సీతారామన్ ‘వివిధ దళాలను పూర్తి సామర్థ్యంతో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

10/11/2017 - 02:40

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: అత్యంత నాణ్యత కలిగిన నకిలీ నోట్లు ఉగ్రవాదులకు ప్రాణవాయువులా పని చేస్తూ, సమాజానికి తీరని నష్టం కలిగిస్తున్నాయని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాగరికత కలిగిన ఏ దేశమూ తన గడ్డపై ఉగ్రవాదాన్ని ఉపేక్షించదన్నారు.

10/11/2017 - 02:38

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: అమిత్ షా కుమారుడు జయ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో విమర్శల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం ‘బేటీ బచావో’ కాస్తా ‘బేటా బచావో’గా రూపాంతరం చెందిందని, ఆ విధంగా అమిత్ షా కుమారుని వ్యాపారం ఎన్నో రెట్లు పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు. జయ్‌ను వెనకేసుకొస్తున్న కేంద్ర మంత్రులను ఆయన వదల లేదు.

10/11/2017 - 02:34

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: గోప్యత అన్నది ప్రాథమిక హక్కు కిందకే వస్తుందన్న చారిత్రాత్మక తీర్పు వెలువడంలో కీలకపాత్ర పోషించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆర్‌ఎఫ్ నారిమన్‌కు అరుదైన గౌరవం లభించింది. గోప్యతపై తీర్పునిచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో నారిమన్ సభ్యుడిగా ఉన్నారు. ఆయన వెలిబుచ్చిన విలువైన సూచనలు, సలహాలను గుర్తించి గ్లోబల్ డిజిటల్ రైట్స్ అడ్వొకెసీ గ్రూపు ‘హీరో’ అవార్డుకు ఎంపిక చేసింది.

10/11/2017 - 02:33

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: యోగ ఒక సాధక ప్రక్రియ మాత్రమే. పురాతన శాస్త్రాలను ఆపాదిస్తూ మతసంబంధ అర్థాలను ప్రచారం చేయడం వల్ల మానవాళికి తీరని నష్టం వాటిల్లుతుంది అని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు సూచించారు. యోగ ప్రక్రియపై మరిన్ని పరిశోధనలు జరగాలని ఆయనచెప్పారు. అనేక వైద్య విధానాల మాదిరిగానే యోగ కూడా ఒకతరహా ప్రాచీన వైద్య విధాన సాధక ప్రక్రియే.

10/11/2017 - 02:32

అమేథీ, అక్టోబర్ 10: కుటుంబ కంచుకోటగా మారిన అమేథీ లోక్‌సభ నియోజక వర్గం అభివృద్ధికి నెహ్రూ-గాంధీ కుటుంబీకులు చేసిన కృషి ఏమిటని బిజెపి అధినేత అమిత్ షా ప్రశ్నించారు. మూడు తరాలుగా నెహ్రూ కుటుంబం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోందని పేర్కొన్న ఆయన గుజరాత్ అభివృద్ధి నమూనాను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించడాన్ని తప్పుబట్టారు.

10/11/2017 - 02:44

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: దేశ రాజధాని ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్)లో దీపావళి బాణసంచా నిషేధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే కాలుష్యం బారినపడ్డ ఢిల్లీ పరిసరాలకు ఈ చర్య ఇప్పటికిప్పుడు ఊరట కలిగించకపోయినా భవిష్యత్‌లో మంచి ఫలితాలే ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

10/11/2017 - 02:29

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: రోడ్డు ప్రమాదాల్లో నష్టపరిహారాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రమాదంలో మరణించిన వ్యక్తి ‘్భవిష్యత్తు’ ఎదుగుదల అవకాశాలను కూడా దృష్టిలో పెట్టుకుని నష్టపరిహారానికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందిస్తామని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ మంగళవారం ప్రకటించింది.

Pages