S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/13/2017 - 02:25

అహ్మదాబాద్, అక్టోబర్ 12: మహాత్మా గాంధీ హత్య వల్ల కాంగ్రెస్ పార్టీయే ప్రయోజనం పొందిందని, స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఆ పార్టీని రద్దు చేయాలని గాంధీజీ భావించారని కేంద్ర మంత్రి ఉమాభారతి వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో గురువారం జరిగిన ‘గుజరాత్ గౌరవ యాత్ర’లో మంత్రి పాల్గొన్నారు.

10/13/2017 - 02:22

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: పెరుగుతున్న అంతర్ రాష్ట్ర నేరాలు, ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి చట్టబద్ధమైన మద్దతునివ్వడానికి, పోలీస్, శాంతిభద్రతల అంశాలను రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలోకి బదిలీ చేయడానికి వ్యవస్థీకృత నేరాల చట్టాన్ని రూపొందించాలని నీతి ఆయోగ్ పత్రం ఒకటి సూచించింది.

10/13/2017 - 02:22

ముంబయి, అక్టోబర్ 12: తమ భావాలను వ్యతిరేకించేవారిని, ప్రత్యర్థులను మట్టుబెట్టడం అత్యంత ప్రమాదకరమని, ఇలాంటి సంఘటనలు దేశానికి చెడ్డపేరు తీసుకువస్తాయని బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల బెంగళూరులో జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, హేతువాదులను, ఉదాత్త భావాలను కలిగిన వారిని చంపడం అత్యంత బాధాకరమని పేర్కొంది.

10/13/2017 - 02:21

జమ్మూ, అక్టోబర్ 12: జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఎల్‌ఓసి వద్ద పాక్ జవాన్లు కాల్పులకు తెగబడ్డారు. గురువారం ఉదయం పదిన్నర గంటల సమయంలో పాక్ జవాన్లు జరిపిన కాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్, ఒక పౌరుడు మృతిచెందారు. ఆధునిక ఆయుధాలతో పాక్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని కృష్ణఘటి సెక్టార్‌లో ఈ ఘటన జరిగిందని రక్షణశాఖ ప్రతినిధి తెలిపారు.

10/13/2017 - 02:21

శ్రీనగర్, అక్టోబర్ 12: ‘బేటీ బచావో.. బేటీ పడావో’ పోస్టర్‌పై వేర్పాటువాద నాయకురాలు అసియా అంద్రాబీ ఫొటో ముద్రించిన కేసులో సిడిపిఓ అధికారిణిపై వేటుపడింది. జరిగిన తప్పిదాన్ని తీవ్రంగా పరిగణించిన జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం అనంతనాగ్ జిల్లా బ్రెంగ్ బ్లాక్ మహిళా శిశు సంక్షేమ అధికారిణిని సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఫొటోతోపాటు అంద్రానీది ముద్రించారు.

10/13/2017 - 01:28

అలహాబాద్, అక్టోబర్ 12: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అరుషి తల్వార్, పనివాడు హేమ్‌రాజ్ జంట హత్యల కేసులో నిందితులైన ఆమె తల్లిదండ్రులు నుపుర్, రాజేష్ తల్వార్‌లను ఎట్టకేలకు నిర్దోషులుగా విడుదలయ్యారు. 2008నాటి ఈ సంచలన పరువు హత్య కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది.

10/13/2017 - 01:25

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగించిన కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను డిసెంబర్ 18 తేదీలోపే నిర్వహిస్తామని ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు నవంబర్ తొమ్మిదో తేదీన ఒకే దశలో జరుగుతాయి. ఈ ఎన్నికల్లో మొదటిసారిగా కేవలం మహిళలు మాత్రమే నిర్వహించే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయటం గమనార్హం.

10/13/2017 - 01:22

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: నవ భారత నిర్మాణానికి తమ వంతు కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గవర్నర్లకు పిలుపిచ్చారు. విశ్వవిద్యాలయాలు సరికొత్త ఆవిష్కరణలకు నిలయాలుగా మారాలని ఆయన ఆకాంక్షించారు. రాష్టప్రతి భవన్‌లో గురువారం జరిగిన గవర్నర్ల సమావేశంలో నరేంద్ర మోదీ ప్రారంభోత్సవ ప్రసంగం చేశారు.

10/13/2017 - 01:17

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్ల భర్తీకి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియను పది రోజుల్లోగా పూర్తి చేయాలని, ఈ ఆదేశాలు కేవలం ఈ ఏడాదికి మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది.

10/12/2017 - 01:47

న్యూఢిల్లీ, అక్టోబర్ 11:వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు లౌకిక, భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఏకం కావాలని ప్రతిపక్ష నేతలు పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని, అప్పట్లో ప్రజాస్వామ్యానికి ఎంతటి ముప్పువాటిల్లిందో ఇప్పుడూ అదే పరిస్థితి ఉందని హెచ్చరించారు.

Pages