S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/02/2016 - 08:08

న్యూఢిల్లీ, నవంబర్ 1: దేశంలో విచ్ఛిన్నకర కార్యకలాపాలకు పాల్పడుతున్న సిమి కార్యకర్తలు ఎన్‌కౌంటర్‌లో చనిపోతే దాన్నీ కొందరు రాజకీయం చేస్తున్నారని కేంద్ర సమాచార ప్రసార, పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు దుయ్యబట్టారు. ఈ ఘటనకు మతంరంగు పూయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని మంగళవారం ఇక్కడ విమర్శించారు. ‘సిమి కార్యకర్తల మరణాలపై పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

11/02/2016 - 08:07

అమృత్‌సర్, నవంబర్ 1: గాంధీ పరివారం నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నంత కాలం దేశ సరిహద్దుల భద్రత అంశాన్ని పట్టించుకోలేదని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. మంగళవారం పంజాబీ సుబా స్వర్ణోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘ఇవాళ భారత సరిహద్దు ప్రాంతాలను ఎవరూ కనె్నత్తి కూడా చూడలేరు. దేశ రక్షణలో భాగంగా శత్రువుకు గట్టి జవాబును మన సైన్యం ఇస్తోంది’’ అని అన్నారు.

11/02/2016 - 08:03

న్యూఢిల్లీ, నవంబర్ 1: జడ్జీల ఖాళీల భర్తీపై ప్రభుత్వం అలసత్వం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో హైకోర్టుల్లో జడ్జీల ఖాళీల భర్తీకి ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ఢిల్లీ, గౌహతి హైకోర్టుల కోసం పది మంది జడ్జీల పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మరో ఎనిమిది మందిని జడ్జీలుగా నియమించడానికి వారి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియంకు పంపించే ప్రక్రియను సైతం వేగవంతం చేసింది.

11/02/2016 - 06:38

న్యూఢిల్లీ, నవంబరు 1: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి సంబంధించిన అన్ని వివరాలను తమకు తెలియజేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటి) మంగళవారం ఆదేశించింది. అమరావతి నిర్మాణంపై గ్రీన్ ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్లపై ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం నాడు విచారణ జరిపింది.

11/02/2016 - 05:31

న్యూఢిల్లీ, నవంబరు 1: తెలుగు రాష్ట్రాలలో ఐఏఎస్,ఐపీఎస్ క్యాడర్ బాలోపెతం చేయ్యాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తత్రేయ, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాడు కేంద్ర హోంశాఖ కార్యాలయంలో రాజ్‌నాథ్‌తో దత్తాత్రేయ కలిశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అధికారుల కొరతతో ఇరు రాష్ట్రాలలో పాలనపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని రాజ్‌నాథ్ దృష్టికి దత్తాత్రేయ తీసుకెళ్లారు.

11/02/2016 - 05:30

ఇస్లామాబాద్, నవంబర్ 1: ఢిల్లీ హైకమిషన్‌లో పనిచేస్తున్న నలుగురు అధికారులను స్వదేశానికి రప్పించాలని పాక్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. హైకమిషన్ ఉద్యోగి ఒకరు గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు ఇటీవల బయటపడ్డ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ‘ఈ అంశం పరిశీలనలో ఉంది. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాం’ అని పాక్ విదేశాంగ కార్యాలయ వర్గాల ఉటంకిస్తూ డాన్ పత్రిక వెల్లడించింది.

11/02/2016 - 03:28

న్యూఢిల్లీ, నవంబర్ 1:ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విద్యార్హతల గురించి తెలుసుకునే ప్రాథమిక హక్కు ఓటరుకు ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో సదరు అభ్యర్థి తప్పుడు సమాచారం ఇచ్చినట్టు రుజువైతే సదరు అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించవచ్చునని తెలిపింది.

11/02/2016 - 03:26

జమ్ము, నవంబర్ 1: కవ్వింపు కాల్పులతో పేట్రేగుతున్న పాకిస్తాన్ రేంజర్లకు భారత్ దళాలు గట్టిగా బుద్ధి చెప్పాయి. మంగళవారం ఉదయం పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది కాశ్మీర్ పౌరులు మరణించడంతో ప్రతీకార దాడులు జరిపిన భారత దళాలు 14పాకిస్తాన్ సైనిక పోస్టులను ధ్వంసం చేశాయి. ఆ దాడిలో ఇద్దరు పాకిస్తాన్ రేంజర్లు మరణించారు.

11/01/2016 - 07:50

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 32వ వర్ధంతి సందర్భంగా జాతియావత్తు నివాళులర్పించింది. సఫ్దర్‌జంగ్‌లోని ఇందిర స్మారకచిహ్నం వద్ద రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పుష్పగుచ్చాలుంచి శ్రద్దాంజలి ఘటించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ట్విట్టర్‌లో నివాళులర్పించారు.

11/01/2016 - 07:47

సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా సోమవారం ఢిల్లీలో జరిగిన ఏక్‌తా దివస్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, కేంద్ర మంత్రులు విజయ్ గోయెల్, రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘రన్ ఫర్ యూనిటీ’లో పాల్గొనేందుకు హాజరైన జనం

Pages