S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/04/2016 - 02:24

భివాని/న్యూఢిల్లీ, నవంబర్ 3: ఒకే ర్యాంక్, ఒకే పన్ను విధానం అమలుపై కేంద్రం తీరుకు నిరసనగా ఢిల్లీలో ఆత్మహత్యకు పాల్పడిన హర్యానాకు చెందిన మాజీ సైనికుడు రామ్ కిషన్ గ్రేవాల్ అంత్యక్రియలు భివానీ సమీపంలోని ఆయన స్వగ్రామంలో జరిగాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సహా రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు అంత్యక్రియలకు హాజరయ్యారు.

11/04/2016 - 02:17

న్యూఢిల్లీ, నవంబర్ 3: నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి నదులు,జలాశయాలు,్భగర్భ జలాలపై సమగ్ర ఆధ్యయనం చేయకుండానే పర్యావరణ అనుమతులిచ్చారని పిటిషనర్ల తరఫున్యాయవాది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి)ముందు వాదించారు. నూతన రాజధాని నిర్మాణంపై ఎన్జీటిలో దాఖలైన పిటిషన్లపై జస్టిస్ స్వతంత్రకుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం నాడు విచారణ జరిపింది.

11/04/2016 - 01:53

న్యూఢిల్లీ, నవంబర్ 3: ఎట్టకేలకు నాలుగు అంచెల వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) విధానం ఖరారైంది. నిత్యావసర వస్తువులకు తక్కువ శాతం పన్ను, విలాసవంతమైన వస్తువులకు అత్యధిక శాతం పన్నుగా నిర్ధారించారు. అత్యధిక విలాస వస్తువులకు జిఎస్‌టితోపాటు సెస్ కూడా విధిస్తారు. విలాసవంతమైన కార్లు, పొగాకు, ఏరియేటెడ్ డ్రింక్‌లకు కూడా సెస్సు విధిస్తారు.

11/04/2016 - 01:33

న్యూఢిల్లీ, నవంబర్ 3: ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు పది పాయింట్ల ప్రణాళికను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. విపత్తుల నష్టాన్ని తగ్గించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఆసియా దేశాల మంత్రుల మూడు రోజుల సదస్సును ఆయన గురువారం ఢిల్లీలో ప్రారంభించారు.

11/04/2016 - 01:31

బుద్గామ్ (జమ్మూ, కాశ్మీర్), నవంబర్ 3: ఒకే ర్యాంక్, ఒకే పెన్షన్ (ఓఆర్‌ఓపి) పథకం కింద పింఛను పొందడంలో కేవలం లక్ష మంది మాజీ సైనికులు సమస్యలను ఎదుర్కొంటురన్నారని, రెండు నెలల్లోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని రక్షణ మంత్రి మనోహర్ పారిర్ చెప్పారు.

11/04/2016 - 01:27

లక్నో, నవంబర్ 3: సమాజ్‌వాదీ పార్టీలో సాగుతున్న అంతఃకలహాల నేపథ్యంలో ఆ పార్టీ నిర్వహించతలపెట్టిన రథయాత్రపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ములాయం సింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ నిర్వహించ తలపెట్టిన ఈ రథయాత్రను అధినేత ములాయం స్వయంగా ప్రారంభించడమే కాకుండా, ఆయన బాబాయి శివపాల్ యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా పార్టీ ఐక్యంగా ఉందనే సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు.

11/04/2016 - 00:57

బుద్గామ్, నవంబర్ 3: జమ్మూ, కాశ్మీర్‌లో పాకిస్తాన్ పరోక్ష యుద్ధం సాగిస్తోందని, అయితే పొరుగు దేశానికి గట్టిగా బుద్ధిచెప్పడం జరుగుతుందని రక్షణ మణత్రి మనోహర్ పారికర్ అన్నారు. ‘జమ్మూ, కాశ్మీర్‌ను ఆక్రమించుకోవాలని పాకిస్తాన్ ఎప్పుడూ అనుకుంటూనే ఉంది. అయితే కాశ్మీర్, ఇక్కడి ప్రజలు భారతదేశంలో అంతర్భాగంగా మేము భావిస్తున్నాం.

11/04/2016 - 00:56

లే/న్యూఢిల్లీ, నవంబర్ 3: వాస్తవాధీన రేఖ ప్రాంతంలోని డెమ్‌చోక్ వద్ద గత 36 గంటల నుంచి భారత్-చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దురుసుగా ప్రవర్తించిన చైనా సైనికుల్ని భారత జవాన్లు అంగుళం కూడా ముందుకు రాకుండా నిరోధించగలిగారు. ఎమ్‌ఎన్‌ఆర్‌జిఎ పథకం కింద భారత సైనిక ఇంజనీర్లు ఈ ప్రాంతంలో చేపడుతున్న పనులకు చైనా సైనికులు అభ్యంతరం చెప్పడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

11/03/2016 - 06:59

న్యూఢిల్లీ, నవంబర్ 2: అతివేగంగా విస్తరిస్తున్న నేటి సాంకేతిక యుగంలో విశ్వసనీయతే మీడియాకు ఎదురవుతున్న పెద్ద సవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విశ్వసనీయతే గీటురాయిగా మీడియా రాణించాలని, ఈ లక్షణాన్ని నిరంతరం కాపాడుకునేందుకు ప్రయత్నించాలని ఉద్బోధించారు.

11/03/2016 - 06:58

జమ్మూ, నవంబర్ 2: అంతర్జాతీయ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ రేంజర్లు జమ్మూలోని జనావాసాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారని సరిహద్దు భద్రతా దళం ఆరోపించింది. గత కొన్ని వారాలుగా పాక్ రేంజర్లు జరుపుతున్న ఈ కాల్పుల వెనుక పాకిస్తాన్ సైనిక హస్తం ఉందని బిఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ డి.కె.ఉపాధ్యాయ బుధవారం నాడిక్కడ తెలిపారు.

Pages