S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/29/2016 - 07:07

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ప్రధాని విదేశీ పర్యటనలకు సంబంధించిన ఫైళ్లను తనకు అందజేయాలని కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరింది. ధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల కారణంగా అయిన ఖర్చులను అంచనా వేయడం కోసం లోకేష్ బాత్రా అనే ఆర్‌టిఐ కార్యకర్త ఇంతకు ముందు ఆ డాక్యుమెంట్లను చూడడానికి అవకాశమివ్వాలని విదేశాంగ శాఖను కోరారు.

10/29/2016 - 07:06

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం న్యాయమూర్తులను నియమించకుండా ప్రజాస్వామ్యం మూల స్థంభాల్లో ఒకటైన న్యాయ వ్యవస్థను నాశనం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఆరోపించారు.

10/29/2016 - 06:38

పనాజీ, అక్టోబర్ 28: గోవా తొలి మహిళా ముఖ్యమంత్రి శశికళ కాకోద్కర్ (81) శుక్రవారం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అస్వస్థురాలిగా ఉన్న ఆమె అల్టిన్హోలోని నివాసంలో మృతి చెందారు. గోవా మాజీ ముఖ్యమంత్రి దయానంద్ బండోద్కర్ కుమార్తె శశికళ మధ్యాహ్నం 1.10 గంటలకు చనిపోయారని ఆమె కుమారుడు సమీర్ కాకోద్కర్ వెల్లడించారు. శశికళ మృతికి నివాళిగా రాష్ట్రంలో రెండు రోజలు సంతాప దినాలుగా ప్రకటించారు.

10/29/2016 - 04:12

న్యూఢిల్లీ, అక్టోబర్ 28:హైకోర్టుల్లో న్యాయమూర్తుల్ని నియమించాలంటూ కొలీజియం సిఫార్సు చేసి దీర్ఘకాలమైనా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ కేంద్ర ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం నిప్పులు చెరిగింది. న్యాయ వ్యవస్థకు తాళాలు వేయాలనే ప్రభుత్వం భావిస్తోందా అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. ‘కొర్టు గదులకు తాళాలు పడ్డాయి.

10/28/2016 - 02:45

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరుతుందని, ఈ విషయంలో సుప్రీం కోర్టు సానుకూలంగా తీర్పు చెప్తుందని ఆశిస్తున్నట్లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి భరత్ భూషణ్ గురువారం ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘రామ మందిరం అనేది మన విశ్వాస కేంద్రం. రామ జన్మభూమి స్థలంలో మందిర నిర్మాణం జరగాలి. అలహాబాద్ హైకోర్టు ఇప్పటికే తీర్పు చెప్పింది.

10/28/2016 - 02:20

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: అత్యుత్తమ వౌలిక సదుపాయాలు కల్పన, పెట్టుబడులను ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం దక్కించుకుంది. మార్కనమీ సంస్థ ఏటా ఆర్థిక, పర్యావరణ రంగాల్లో అవార్డులను ప్రకటిస్తుంది. గురువారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా ఢిల్లీ ఏపి భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ అర్జ శ్రీకాంత్ ప్లాటినం విన్నర్ అవార్డును అందుకున్నారు.

10/28/2016 - 01:22

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ‘ప్రభుత్వ విధానాలను రాజకీయాలు ఎప్పుడూ ప్రభావితం చేయరాదు’’ అని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. కొత్త ఐఏఎస్‌లుగా నియమితులైన అధికారుల బృందంతో గురువారం భేటీ అయిన సందర్భంగా ఆయన వారితో మాట్లాడారని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటన వెలువరించింది. అధికారులు టీమ్ స్పిరిట్‌తో పనిచేయాలని, అడ్డంకులను అధిగమించి, తమ శక్తిమేరకు ప్రజాసేవ చేయాలని మోదీ వారికి పిలుపునిచ్చారు.

10/28/2016 - 01:21

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: భారత్‌లో గూఢచర్య నెట్‌వర్క్ నడుపుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన పాకిస్తాన్ దౌత్త్ధారి మహమూద్ అఖ్తర్‌ను 48 గంటలలోగా దేశం విడిచి వెళ్లిపోవలసిందిగా భారత్ గురువారం ఆదేశించింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న అఖ్తర్‌ను గూఢచర్య రాకెట్ నడుపుతున్న ఆరోపణలపై గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

10/28/2016 - 01:19

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: కుటుంబ కలహాలతో నానా తంటాలు పడుతున్న సమాజ్‌వాదీ పార్టీ మార్చిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు మహాకూటమిని ఏర్పాటుచేసి పరువు నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.

10/28/2016 - 01:17

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ఉత్తరప్రదేశ్‌లో ‘మహా కూటమి’ ఏర్పాటయ్యే అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీ గురువారం స్పష్టం చేసింది. 27 ఏళ్లుగా కాంగ్రెసేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనుకుంటున్నారని కూడా ఆ పార్టీ స్పష్టం చేసింది. ‘రాహుల్ గాంధీ యాత్ర అధికార దాహంతోకాక..

Pages