S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/01/2016 - 03:22

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: భారత దేశం మరింత శక్తిమంతం కావాలంటే దేశమంతా సమైక్యంగా ఉండటం వల్లనే సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. భారత మొట్టమొదటి హోం మంత్రి ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా సోమవారం జరిగిన ఏక్‌తాదివస్ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. ‘మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రయాణిస్తున్నప్పుడు మనకు ఎలాంటి వీసాలు, పర్మిట్లు అవసరం లేదు.

10/30/2016 - 03:04

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే ఒకే రకమైన విధులను నిర్వర్తించే డెయిలీ వేజ్ ఉద్యోగులు, క్యాజువల్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ‘సమాన పనికి సమాన వేతనం’ సూత్రాన్ని వర్తింపజేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోవడాన్ని శ్రమ దోపిడీ, అణచివేతగా అభివర్ణించిన సుప్రీంకోర్టు సంక్షేమ రాజ్యంలో ఈ సూత్రాన్ని తాత్కాలిక ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలన్నారు.

10/30/2016 - 02:50

సరిహద్దుల్లో అమరులైన సైనికులకు నివాళిగా శనివారం వారణాసిలోని స్టేడియంలో దీపాలు వెలిగించిన క్రీడాకారులు

10/30/2016 - 02:48

దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగను సాంప్రదాయానుసారం అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మహారాష్టల్రోని థానెలో పెద్ద పెద్ద డప్పులతో సాంస్కృతిక ప్రదర్శన ఇస్తున్న మహిళా కళాకారులు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద మహేశ్ కాలే బృందం సంగీత విభావరి.

10/30/2016 - 02:43

శ్రీనగర్, అక్టోబర్ 29: భారత్-పాక్ సరిహద్దుల వద్ద పాక్ రేంజర్లు యథేచ్ఛగా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. శుక్రవారం రాత్రి పాకిస్తానీ రేంజర్లు కాల్పులు జరుపుతుండగా, ఆ కాల్పుల చాటున నియంత్రణ రేఖ దాటి వచ్చిన ఉగ్రవాదులు ఒక జవానును దారుణంగా చంపి, నరికి ముక్కలు చేసి, తలను ఛిద్రం చేసి తమ కిరాతకాన్ని చాటిచెప్పారు.

10/30/2016 - 02:42

కురుక్షేత్ర/జమ్మూ, అక్టోబర్ 29: ఎదురుకాల్పుల్లో మృతిచెందిన జవాను మన్‌దీప్ సింగ్ మృతదేహాన్ని ఉగ్రవాదులు ముక్కలుముక్కలుగా నరికేసిన సంఘటన పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా, హర్యానాలోని మన్‌దీప్ స్వగ్రామంలో మాత్రం దీపావళికి ముందు విషాదఛాయలు నెలకొన్నాయి.

10/30/2016 - 02:41

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆకాంక్షించారు. దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు రాష్టప్రతితోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశ ప్రజలందరూ సుఖఃసంతోషాలతో ఉండాలి. దీపావళి ప్రజల జీవితాల్లో చీకట్లను పారదోలాలి.

10/30/2016 - 03:51

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: దీపావళి సంబరాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర రాజధానులు, నగరాల్లోని చారిత్రాత్మక కట్టడాలలు, పర్యాటక ప్రాంతాలు విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయ. ముంబయిలో మహిళలు సంప్రదాయ వాయిద్యాల సంగీతంతో ప్రదర్శనలు నిర్వహించారు. తమిళనాడులోని అన్ని దేవాలయాల్లోనూ పండుగ వాతావరణం కనిపించింది.

10/30/2016 - 02:40

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: న్యాయ నియామకాల్లో జాప్యంపై సుప్రీం కోర్టు నుంచి విమర్శలు ఎదురవడంతో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. హైకోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను 906 నుంచి 1,079కి పెంచామని, హైకోర్టుల్లోని ఖాళీలు తమ హయాంలో అసాధారణంగా ఏమీ పెరగలేదని ఎన్‌డిఎ సర్కారు స్పష్టం చేసింది.

10/30/2016 - 02:37

మహారాష్టల్రోని ఔరంగాబాద్‌లో శనివారం టపాకాయల మార్కెట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో 150కి పైగా స్టాళ్లు, 40 వాహనాలు కాలిపోయాయి. దీపావళి పండుగను పురస్కరించుకొని ఔరంగాపుర ప్రాంతంలోని జిల్లా పరిషత్ మైదానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక టపాకాయల మార్కెట్‌లో ఉదయం 11.45 గంటలకు ఈ అగ్నిప్రమాదం సంభవించింది.

Pages