S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/03/2016 - 06:58

భోపాల్/కోల్‌కతా, నవంబర్ 2: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భోపాల్‌లో సిమి కార్యకర్తల ఎన్‌కౌంటర్‌పై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్‌కౌంటర్ ఘటనపై కాంగ్రెస్ పెద్దఎత్తున విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

11/03/2016 - 06:55

న్యూఢిల్లీ, నవంబర్ 2: భారత్-పాక్ సరిహద్దుల్లో ఓ వైపు ఉద్రిక్తతలు పెరిగి పోతుండగా, మరోవైపు పాక్ మోర్టార్ దాడులను తిప్పి కొట్టడానికి, దేశ గౌరవాన్ని కాపాడడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

11/03/2016 - 06:54

ఇస్లామాబాద్, నవంబర్ 2: పధ్నాలుగేళ్ల క్రితం ఆమెను అమానుషంగా సామూహిక అత్యాచారం చేశారు. నగ్నంగా ఊళ్లో ఊరేగించారు. కానీ, అందరు ఆడపిల్లల్లా జీవితానికి, సమాజానికి భయపడి ఆమె ఆత్మహత్య చేసుకోలేదు. మొక్కవోని ధైర్యంతో నిలిచి పోరాడింది. ఇనే్నళ్ల తరువాత కరాచీలో జరిగిన ఫ్యాషన్ వీక్‌లో రాంప్‌వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరచింది. ఆమె నిబ్బరానికి పాకిస్తానీ మోడలింగ్ ప్రపంచం రెడ్‌కార్పెట్ పరచి స్వాగతం పలికింది.

11/03/2016 - 06:53

బెంగళూరు, నవంబర్ 2: టిప్పు సుల్తాన్ ఓ నియంత అనీ, ఆయన ఏమాత్రం స్వాతంత్య్ర సమరయోధుడు కాదంటూ కర్నాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ నియంత జయంత్యుత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం జరపడం వెనుక సహేతుకతను ప్రశ్నించింది. టిప్పు సుల్తాన్ తన ప్రయోజనాలను కాపాడుకోవడానికే పోరాడాడే తప్ప స్వాతంత్య్రం కోసం కాదని, దాని దృష్ట్యా ఆయన్ని స్వాతంత్య్ర సమరయోధుడుగా పరిగణించలేనని కోర్టు తెలిపింది.

11/03/2016 - 06:53

న్యూఢిల్లీ, నవంబర్ 2: న్యాయ వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడుకునేందుకు కోర్టు ధిక్కార అధికారాన్ని వినియోగించుకోవాలని, ఉద్దేశపూర్వకంగా ఇందుకు పాల్పడేవారి పట్ల కఠినంగానే వ్యవహరించాలని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కోర్టులకు స్పష్టం చేసింది. ‘్భవస్వేచ్ఛను ప్రాధమిక హక్కుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 చెబుతోంది. దానికి కోర్టు ధిక్కారణ రూపంలో కొన్ని పరిమితులు ఉన్నాయి.

11/03/2016 - 06:11

న్యూఢిల్లీ, నవంబర్ 2: నూతన రాజధాని అమరావతి కొండవీటి వాగు పరీవాహక ప్రాంతాలు, వరద ముంపుప్రాంతాలలో ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలు నిబంధనలను ఉల్లంఘించడమేనని గ్రీన్ ట్రిబ్యునల్ ముందు పిటిషనర్ తరఫున్యాయవాది వాదించారు.

11/03/2016 - 06:09

న్యూఢిల్లీ, నవంబర్ 2: ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల ఎన్‌కౌంటర్ నిరసనగా ప్రజాసంఘాలు దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించాయి. ఆంధ్రా, ఒడిశా ప్రభుత్వాలు చెబుతున్నట్లు మల్కన్‌గిరిలో జరిగింది ఎన్‌కౌంటర్ కాదని ప్రజా సంఘాలు ఆరోపించాయి. కోవర్టు ఆపరేషన్ ద్యారా ఆదివాసులు, మావోయిస్టులపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నరమేధానికి పాల్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

11/03/2016 - 06:05

న్యూఢిల్లి, నవంబర్ 2: దేశంలో ఎన్నడూలేని స్థాయిలో దాదాపు 5వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితుడైన బాలీవుడ్ నిర్మాత సుభాష్ దుధానీని అదుపులోకి తీసుకున్నారు.

11/03/2016 - 04:11

న్యూఢిల్లీ, నవంబర్ 2: ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ వ్యవహారంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా మాజీ సైనికుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం బుధవారం ఢిల్లీలో ఆనూహ్యమైన రీతిలో రాజకీయ హై డ్రామాకు తెరతీసింది. మాజీ సైనికుడి మరణానికి కేంద్రంలోని మోదీ సర్కారే కారణమంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు.

11/03/2016 - 04:09

న్యూఢిల్లీ, నవంబర్ 2: పాకిస్తాన్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇష్టానుసారం జరుపుతున్న మోర్టారు దాడుల మూలంగా సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధవాతావరణ పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. సమీక్షా సమావేశంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు.

Pages