S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/01/2016 - 07:45

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: భారత న్యాయస్థానాల్లో ప్రభుత్వమే అతిపెద్ద కక్షిదారుగా ఉందని, కోర్టులపై ఆ భారాన్ని తక్షణం తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యాయవ్యవస్థ విచారించే కేసుల్లో ప్రభుత్వమే ఒక పార్టీగా ఉన్నవే అధికంగా ఉన్నాయని మోదీ అన్నారు. ఢిల్లీ హైకోర్టు స్వర్ణోత్సవాలలో భాగంగా ఆయన సోమవారం మాట్లాడారు. ‘కోర్టులు ఎక్కువ సమయం మాపైనే వెచ్చిస్తున్నాయి. మేమంటే మోదీ కాదు..

11/01/2016 - 07:44

పూంచ్, అక్టోబర్ 31: జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్, రాజౌరీ జిల్లాలో ఎల్‌ఓసి వద్ద పాక్ దళాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. రాజౌరీ సెక్టార్‌లో పాక్ రేంజర్లు భారత శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారీఎత్తున కాల్పులకు తెగబడ్డారు. పాక్ రేంజర్ల కాల్పుల్లో ఓ జవాను మృతి చెందాడని ఉత్తర మండల సైనిక ప్రతినిధి వెల్లడించారు.

11/01/2016 - 07:44

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: దీపావళి పండుగ వచ్చింది. కానీ వాతావరణంలో విషపూరితమైన గాలిని మిగిల్చి వెళ్లింది. ఇది ప్రతి సంవత్సరం జరిగేదే కదా అని చాలామంది అనుకోవచ్చు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి దీపావళివల్ల దేశంలో, ప్రత్యేకించి రాజధాని ఢిల్లీలో కాలుష్యం సాధారణ స్థాయి కంటే 42 రెట్లు పెరగింది.

11/01/2016 - 07:41

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: గత దశాబ్ద కాలంలో అసలు స్కూలుకు వెళ్లనివారు, అలాగే మధ్యలో మానేసిన వారి సంఖ్య దాదాపు పదికోట్లకు పైనే ఉంది. 5-19 సంవత్సరాల మధ్య వయస్సుకలిగిన పిల్లల్లో 6.54 కోట్ల మంది అసలు బడి ముఖమే తెలియదని, అలాగే 4కోట్ల 49 లక్షల మంది మధ్యలోనే చదువులు మానేశారని 2011 జనగణన వివరాలను బట్టి స్పష్టమవుతోంది. 5-19 సంవత్సరాల వయస్సు కలిగిన వారు దేశంలో 38.01 కోట్ల మంది ఉన్నారు.

11/01/2016 - 07:41

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: కాశ్మీర్‌లో సంఘ వ్యతిరేక శక్తులు మన శత్రువుల ప్రోద్బలం మేరకే రాష్ట్రంలోని పాఠశాలలను తగులబెడుతున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు దుయ్యబట్టారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రీయ ఏక్‌తాదివస్ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, సంఘ వ్యతిరేక శక్తులు పాఠశాలలకు నిప్పుపెట్టటం పట్ల తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు.

11/01/2016 - 07:40

ఢాకా, అక్టోబర్ 31: బంగ్లాదేశ్‌లో 15 హిందూ ఆలయాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇస్లాం మతాన్ని కించపరిచేలా ఫేస్‌బుక్‌లో చేసిన కథనాలే ఆలయాలపై దాడులకు కారణమైంది. నసీర్‌నగర్ జిల్లాలోని బ్రహ్మణ బార్హియా ఆలయాలను ధ్వంసం చేశారు. హిందువులకు చెందిన వంద ఇళ్లను లూఠీ చేశారు. ఆదివారం ఈ సంఘటనలు చోటుచేసుకున్నాయి. దుండగులు రెచ్చిపోయి హబీగంజ్, మధాబ్‌పూర్ పక్కనే ఉన్న మరోరెండు ఆలయాలపై దాడులు చేశారు.

11/01/2016 - 06:30

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ఏపి కొత్త రాజధాని అమరావతి నిర్మాణం పై దాఖలైన పిటిషన్లపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్‌తో కూడిన బెంచ్ ముందుకు కొత్త న్యాయమూర్తులు రావడంతో మంగళవారం నాడు వాదనలు వినిపిస్తామని పిటిషనర్ తరపు న్యాయవాది సంజయ్ పారిక్ ట్రిబ్యునల్‌ను కోరారు. దీంతో అంగీకరించిన ధర్మాసనం నేటికి వాయిదా వేసింది.

11/01/2016 - 06:28

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: అవినీతి నిర్మూలనలో ప్రజలు ముందుకు రావాలని సెంట్రల్ విజిలెన్సు కమిషనర్ కె.వి.చౌదరి పిలుపునిచ్చారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏటా అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని విజిలెన్స్ అవగాహన వారోత్సవాన్ని నిర్వహించింది. అనతరం చౌదరి విలేఖరులతో మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో అవినితిని ఎలా నిర్మూలించవచ్చన్న ఆంశంపై అవగాహన పెంపొందిస్తామన్నారు.

11/01/2016 - 03:30

భోపాల్, అక్టోబర్ 31: సెక్యూరిటీ గార్డును అత్యంత హేయంగా హతమార్చి సోమవారం తెల్లవారు జామున భోపాల్ సెంట్రల్ జైలు నుంచి ఎనిమిది మంది నిషిద్ధ సిమి ఉగ్రవాదులు పరారయ్యారు. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే వీరందరినీ పోలీసులు హతమార్చారు. పరారైన సిమి ఉగ్రవాదులు నగర శివారులోనే ఉన్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు అత్యంత చాకచర్యంగా వారిని ముట్టడించి మట్టుబెట్టారు.

11/01/2016 - 03:24

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో తెలుగు రాష్ట్రాలు ఫస్ట్ ర్యాంక్ సాధించాయి. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2016వ సంవత్సరానికి సంబంధించి సులభతర వాణిజ్య విధానాలు అవలంబిస్తున్న రాష్ట్రాలకు ర్యాంకులను ప్రకటించారు.

Pages