S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/30/2016 - 02:34

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: సైనికుల సంక్షేమానికి చర్యలు తీసుకోవడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ చిత్తశుద్ధిని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ముందు సైనికులకు ‘ఒకే ర్యాంక్-ఒకే పింఛను’ (ఒఆర్‌ఒపి) పథకాన్ని అర్థవంతమైన రీతిలో అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. సైనికుల వేతన వ్యత్యాసాలను, వారు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని ఆయన ప్రధానమంత్రి మోదీకి రాసిన లేఖలో డిమాండ్ చేశారు.

10/30/2016 - 02:32

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: వచ్చే ఎన్నికల్లో పరిశుభ్రత అనేది ఎన్నికల ప్రచారాంశం అవుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. నగరాలు, పట్టణాలలో నివసించే ప్రజలు పరిశుభ్రత కోసం పాటుపడే పార్టీలకే ఓటు వేస్తారని ఆయన పేర్కొన్నారు.

10/30/2016 - 02:32

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: గూఢచర్యం కేసులో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు మున్వర్ సలీం వ్యక్తిగత కార్యదర్శి (పిఏ) ఫర్హత్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ గూఢచర్యం రాకెట్‌ను నడుపుతున్న ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌కు చెందిన ఉద్యోగి మహమూద్ అఖ్తర్‌ను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టు అయిన నాలుగో వ్యక్తి ఫర్హత్.

10/30/2016 - 01:53

శ్రీనగర్, అక్టోబర్ 29: పాకిస్తాన్‌పై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. వాస్తవాధీన రేఖ వద్ద వరుసగా పాల్పడుతున్న కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాకిస్తాన్ భారీ మూల్యానే్న చెల్లించాల్సి వచ్చింది. కేరన్ సెక్టార్‌లో భారత సైన్యం పెద్ద ఎత్తున జరిపిన ఎదురుకాల్పులకు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన నాలుగు ఆర్మీ పోస్టులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

10/29/2016 - 07:16

నోయిడా, అక్టోబర్ 28: పాకిస్తాన్ ఉగ్రవాదం సాయం తీసుకుని పరోక్ష యుద్ధానికి పాల్పడుతోందని, అయితే పిరికి పందలే ఇలాంటి దాడుకు పాల్పడుతారని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘మన పొరుగుదేశం (పాకిస్తాన్) పరోక్ష యుద్ధాన్ని కొనసాగిస్తోంది. అయితే ఉగ్రవాదం సాహసవంతుల ఆయుధం కాదు, పిరికిపందల ఆయుధం.

10/29/2016 - 07:11

జమ్మూ, అక్టోబర్ 28: కాల్పుల విరమణ ఒప్పందానికి పదేపదే తూట్లు పొడుస్తున్న పాకిస్తాన్ సైనిక బలగాలు జమ్మూ-కాశ్మీరులోని సరిహద్దు ప్రాంతాల వెంబడి మరోసారి కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత పౌరులు మృతిచెందడంతో తాము దీటుగా జవాబిచ్చామని, గత వారం రోజులుగా జరిగిన ఎదురు కాల్పుల్లో 15 మంది పాక్ రేంజర్లు హతమయ్యారని సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) శుక్రవారం వెల్లడించింది.

10/29/2016 - 07:10

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: గూఢచర్యం చేస్తూ పట్టుబడిన పాకిస్తాన్ హైకమిషన్ అధికారి మెహమూద్ అక్తర్ పశ్చిమ తీరంలో భారత భద్రతా బలగాల మోహరింపునకు సంబంధించిన రహస్య సమాచారంతో పాటు ముంబయి దాడుల మాదిరిగా భారత్‌లో మరోసారి ఉగ్రవాద దాడి నిర్వహించేందుకు గల అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించాడని, ప్రత్యేకించి పశ్చిమ తీరంతో పాటు సర్‌క్రీక్, కచ్ ప్రాంతాల్లో భద్రతా బలగాల మోహరింపునకు సంబంధించ

10/29/2016 - 07:10

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: సాయుధ బలగాలు ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండవలసి ఉంటుందని, లేకుం టే దేశంలో సైనిక శాసనం (మార్షల్ లా) అమలవుతుందని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది.

10/29/2016 - 07:09

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: అంతర్ రాష్ట్ర మండలి (ఇంటర్ స్టేట్ కౌన్సిల్), అంతర్‌రాష్ట్ర మండలి స్టాండింగ్ కమిటీని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పునర్‌వ్యవస్థీకరించారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన పనిచేసే అంతర్ రాష్ట్ర మండలి స్టాండింగ్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభ్యుడుగా నియమితులయ్యారు.

10/29/2016 - 07:09

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు పూర్తి స్వేచ్ఛను ఇచ్చివుంటే కాశ్మీర్ సమస్య ఏనాడో పరిష్కారమై ఉండేదని, ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితి తలెత్తి ఉండేది కాదని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ శుక్రవారం నాడిక్కడ వ్యాఖ్యానించారు. రాజరికాల అమలులో వున్న రాష్ట్రాల విషయంలో పటేల్‌కు స్వేచ్ఛ ఇవ్వకపోవడం వల్లే కాశ్మీర్ కొరకరాని కొయ్యగా మారిందని ఆయన అన్నారు.

Pages