S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/06/2016 - 07:18

బృందావన్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీరుపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విమర్శలు గుప్పించారు. జెఎన్‌యులో జాతి వ్యతిరేక నినాదాలు చేసిన వారిని రాహుల్ పరామర్శించినందుకు ఆ పార్టీ సిగ్గుపడాలని ఆయన అన్నారు. భావస్వేచ్ఛ పేరుతో క్యాంపస్‌ను సందర్శించినందుకు కాంగ్రెస్ ప్రశ్నించాలని షా విజ్ఞప్తి చేశారు.

03/06/2016 - 07:15

న్యూఢిల్లీ: భారత్‌లో ఉగ్రవాద దాడులు జరపడానికి 1997లో పాకిస్తానీ, బంగ్లాదేశీ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడడానికి తోడ్పడ్డారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న లష్కరే తోయిబాకు చెందిన బాంబు తయారీ నిపుణుడు అబ్దుల్ కరీమ్ తుండాను, మరో ముగ్గురిని ఆ కేసులో ఢిల్లీ కోర్టు తగిన సాక్ష్యాధారాలు లేవంటూ నిర్దోషిగా విడుదల చేసింది.

03/06/2016 - 07:14

న్యూఢిల్లీ: దేశద్రోహ అభియోగాలను ఎదుర్కొంటున్న జెఎన్‌యు విద్యార్థి సంఘ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ను కాల్చి చంపిన వారికి 11 లక్షల రూపాయల రివార్డు అందజేస్తామని ప్రకటిస్తూ సెంట్రల్ ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. ఈ కేసులో కన్నయ్య కుమార్ బెయిలుపై జైలునుంచి విడుదలై రెండు రోజులు కూడా గడవకముందే ఈ పోస్టర్లు వెలవడం సంచలనం సృష్టిస్తోంది.

03/06/2016 - 07:13

బోర్ఘాట్: ఇపిఎఫ్ విత్‌డ్రాయల్స్‌పై పన్ను విధింపు ప్రతిపాదనను ఉపసంహరించుకునే దాకా తాను ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించిన ‘ఫెయిర్ అండ్ లలీ పథకం’ ద్వారా దేశాన్ని దోచుకున్న దొంగలు తమ నల్లధనాన్ని తెల్లగా మార్చుకోవడానికి ఈ ప్రధాని అనుమతిస్తున్నారు.

03/06/2016 - 04:55

న్యూఢిల్లీ: దేవాదుల ప్రాజెక్టును ఏఐబిపి ప్రాజెక్టుల జాబితాలో చేర్చినట్టు కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి ప్రకటించారు. తెలంగాణ చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి తమ శాఖ పూర్తిసాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు. శనివారం నీటిపారుదల శాఖ టాస్క్ ఫోర్సు సమావేశం అనంతరం ఉమాభారతి మీడియాతో మాట్లాడుతూ మిషన్ కాకతీయను పరిశీలించేందుకు తమ శాఖ అధికారుల బృందం త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తుందని అన్నారు.

03/06/2016 - 04:44

న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగకుండా మహిళల సాధికారికత ఎలా సాధ్యమని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ప్రశ్నించారు. స్వాతంత్య్రం సాధించి ఇనే్నళ్లయినా పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం 12 శాతానికి మించి లేదని, ఇది చాలా విచారకరమన్నారు. మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా వారి సాధికారికత ఎలా సాధ్యమన్నారు. ఈ వైఖరి మారాల్సిన అవసరం ఉందన్నారు.

03/06/2016 - 03:31

న్యూఢిల్లీ: 2016-17 బడ్జెట్‌లో ఇపిఎఫ్ నగదు ఉపసంహరణపై పన్ను విధిస్తూ చేసిన ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి సూచించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భవిష్య నిధి సొమ్ము ఉపసంహరించుకునే సమయంలో మొత్తంలో 60 శాతంపై పన్ను విధిస్తూ జైట్లీ బడ్జెట్‌లో ప్రతిపాదించటం తెలిసిందే.

03/06/2016 - 03:27

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యేలా విభిన్న ప్రతిభావంతులకు సార్వజనీక గుర్తింపు (యూనివర్సల్ ఐడి) ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

03/05/2016 - 17:39

దిల్లీ: దేశద్రోహం కేసులో నిందితుడిగా ఉంటూ ఇటీవల బెయిల్ పొందిన జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్‌ను కాల్చి చంపితే 11 లక్షల నగదు నజరానా ఇస్తామంటూ దిల్లీలో ‘పూర్వాంచల్ సేన’ పేరిట శనివారం వాల్‌పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. యుపి, బిహార్ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లుగా చెప్పుకునే ‘పూర్వాంచల్ సేన’ పేరిట పోస్టర్లు వెలియడం సంచలనం సృష్టించింది.

03/05/2016 - 16:09

దిల్లీ: దేశద్రోహం కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్ కార్యకలాపాలపై తమకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలంటూ దిల్లీ పోలీసులు జెఎన్‌యు అధికారులకు లేఖ రాశారు. బెయిల్‌పై విడుదలయ్యాక కన్నయ్య పలుచోట్ల విద్యార్థులు నిర్వహిస్తున్న ఆందోళనల్లో పాల్గొంటున్నందున అతనికి భద్రత కల్పించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.

Pages