S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/05/2016 - 13:28

దిల్లీ: జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ నాలుకను ఎవరైనా కోస్తే- తాను 5 లక్షల రూపాయలను నజరానాగా ఇస్తానని బిజెపి యువనేత కుల్‌దీప్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశద్రోహం నేరంలో అరెస్టయి రెండు రోజుల క్రితం బెయిల్‌పై విడుదలైన కన్నయ్య తాజాగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడడంతో కుల్‌దీప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

03/05/2016 - 13:28

దిల్లీ: పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు మూడోవంతు సీట్లు కేటాయించాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. శనివారం ఇక్కడి విజ్ఞాన్ భవన్‌లో మహిళా ప్రజాప్రతినిధుల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇనే్నళ్లయినా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 12 శాతానికి మించలేదని, పరిస్థితి ఇలా ఉంటే మహిళా సాధికారత ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

03/05/2016 - 11:54

దిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలో మహిళా ప్రజా ప్రతినిధుల సదస్సును రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ శనివారం ప్రారంభించారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షతన వహించిన సదస్సులో ఉపరాష్టప్రతి అన్సారీ, ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, మహిళా ఎం.పీలు పాల్గొన్నారు.

03/05/2016 - 07:03

న్యూఢిల్లీ: జెఎన్‌యులో చోటుచేసుకున్న జాతివ్యతిరేక కార్యక్రమాలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నందున ఆ విషయంలో జోక్యం చేసుకోకూడదని హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భావిస్తున్నారు. పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష పడ్డ అఫ్జల్‌గురు సంస్మరణ సభ తరువాత జెఎన్‌యులో అనేక పరిణామాలు జరిగాయి. ‘జెఎన్‌యు వివాదంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఆ అంశంపై నేనేమీ మాట్లాడదలచుకోలేదు’అని అన్నారు.

03/05/2016 - 07:01

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం తమకు తీరని అన్యాయం చేస్తోందని రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు జెడి శీలం ఆరో పించారు. శీలం శుక్రవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వవలసిన అవసరం గురించి వాదించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు రెండు తెలుగు రాష్ట్రాలను కేంద్ర ప్రభు త్వం ఆదుకోవటం లేదని ఆయన దుయ్యబట్టారు.

03/05/2016 - 07:01

గువహటి: ప్రధాని నరేంద్ర మోదీని ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. లోక్‌సభలో గురువారం ప్రధాని చేసిన ప్రసంగం ఆయన హో దాను దిగజార్చేదిగా ఉందని రాహుల్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో దేశ ప్రజలకు మోదీ శుష్కవాగ్దానాలు చేశారని గువహటి సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు విరుచుకుపడ్డారు.

03/05/2016 - 07:05

న్యూఢిల్లీ: మాజీ స్పీకర్, లోక్‌సభ సభ్యుడు పిఏ సంగ్మా(68) మృతికి సంతాపం ప్రకటించిన అనంతరం పార్లమెంటు ఉభయ సభలూ శుక్రవారం వాయిదా పడ్డాయి. ఎలాం టి కార్యక్రమం చేపట్టకుండానే వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. లోక్‌సభ మాజీ స్పీకర్ సంగ్మా శుక్రవారం ఉదయం ఢిల్లీలోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందా రు.

03/05/2016 - 06:59

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలనుంచి తొలిసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయిన పిఏ సంగ్మా రాజకీయ జీవన ప్రస్థనమంతా కూడా ఎగుడు దిగుడుల మయమే.

03/05/2016 - 04:20

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికల నగారా మోగింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పాండిచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నసీం జైది శుక్రవారం మీడియా సమావేశంలో షెడ్యూలు ప్రకటించారు. పోలింగ్ మొత్తం ఏప్రిల్ 6 నుంచి మే 16వరకు ఏడు దశల్లో నిర్వహిస్తారు. పశ్చిమ బెంగాల్, అసోం ఎన్నికలు మొదటి రెండు దశల్లో ఏప్రిల్ 4, 11 తేదీల్లో జరుగుతాయి.

03/05/2016 - 04:17

న్యూఢిల్లీ: షహీద్, ఉప్‌కార్, పూరబ్ ఔర్ పశ్చిమ్, రోటీ కప్‌డా ఔర్ మకాన్, క్రాంతి వంటి దేశభక్తి ఇతివృత్తంతో కూడిన ఎన్నో చిత్రాలను నిర్మించి, నటించి మిస్టర్ భరత్‌గా ఖ్యాతిగాంచిన ఒకప్పటి బాలీవుడ్ అగ్రనటుడు మనోజ్ కుమార్‌కు ప్రతిష్టాత్మక దాదాఫాల్కే అవార్డు లభించింది. భారతీయ సినిమాకు చేసిన నిరుపమాన సేవలకు గుర్తింపుగా ఈ సమున్నత అవార్డుకు ఆయన్ని భారత ప్రభుత్వం ఎంపిక చేసింది.

Pages