S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/05/2016 - 04:15

న్యూఢిల్లీ: లోక్‌సభ మాజీ స్పీకర్ పిఎ సంగ్మా హఠాన్మరణం చెందారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవి నిర్వహించిన 68 ఏళ్ల సంగ్మా శుక్రవారం ఉదయం ఇక్కడ గుండెపోటుతో మృతి చెందారు. మేఘాలయలోని తుర నియోజకవర్గం నుంచి ఆయన తొమ్మిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుత 16వ లోక్‌సభలో సభ్యుడైన సంగ్మా ఆకస్మిక మృతి వార్తను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ శుక్రవారం సభకు తెలియజేశారు.

03/05/2016 - 04:13

న్యూఢిల్లీ: సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్‌కు చెందిన హెస్టియా హోల్డింగ్స్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మారిషస్ బ్యాంకునుంచి సుజనా గ్రూప్ హామీదారుగా ఉన్న హెస్టియా సంస్థకు తీసుకున్న రూ.106 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించాల్సిందేనని, లేదంటే ఆస్తులు జప్తు చేసుకునే అధికారం ఉందని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

03/04/2016 - 16:08

దిల్లీ: తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అయిదు రాష్ట్రాల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో సుమారు 17 కోట్ల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

03/04/2016 - 13:01

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని సుకుమా అటవీ ప్రాంతంలో శుక్రవారం వేకువజామున కూంబింగ్ నిర్వహిస్తున్న సిఆర్‌పిఎఫ్ జవాన్లపై మావోలు ఆకస్మికంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మరణించగా, 14 మంది గాయపడ్డారని తెలిసింది. జవాన్లు, మావోల మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.

03/04/2016 - 13:01

దిల్లీ: మారిషన్ బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకున్న వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కేంద్రమంత్రి సుజనా చౌదరి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. రుణాలు ఎగవేసిన కంపెనీల వ్యవహారాల్లో తన ప్రమేయం లేదని ఆయన కొంతకాలంగా చెబుతున్నారు.

03/04/2016 - 12:15

దిల్లీ: లోక్‌సభ మాజీ స్పీకర్, ప్రస్తుత ఎంపీ పి.ఎ సంగ్మా (68) శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మేఘాలయలోని తురా లోక్‌సభ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన 1988-90 కాలంలో ముఖ్యమంత్రిగా, 1996-98లో లోక్‌సభ స్పీకర్‌గా సేవలందించారు. ఆయన మృతి పట్ల లోక్‌సభలో సభ్యులు సంతాపం ప్రకటించారు. సంగ్మా మృతికి సంతాప సూచకంగా సభ వాయిదా పడింది.

03/04/2016 - 12:15

నెల్లూరు: శ్రీహరికోట వద్ద సతీషా ధావన్ అంతరిక్ష ప్రయోగశాల (షార్)లో విద్యుత్ వైర్లు, రాగి ముక్కలు చోరీకి గురైనట్లు శుక్రవారం ఉదయం అక్కడి భద్రతా సిబ్బంది గమనించారు. షార్‌లో అత్యంత కీలకమైన ‘మ్యాగజైన్ భవనం’లో ఈ చోరీ జరగడం గమనార్హం. అత్యంత ప్రమాదకరమైన పేలుడు సామగ్రిని ఈ ‘మ్యాగజైన్ భవనం’లో నిల్వ చేస్తారు. అంతరిక్ష నౌకలను ప్రయోగించే సమయంలో పేలుడు పదార్థాలను వినియోగిస్తారు.

03/04/2016 - 08:44

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టం అమలు కోరుతూ మార్చి 12న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వెల్లడించారు.

03/04/2016 - 08:34

న్యూఢిల్లీ: ఎంపీలంటే అధికార యంత్రాంగానికి భయం పోతోందని, ఇది మంచి పరిణామం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో జరిగిన చర్చకు గురువారం ఆయన సమాధానమిస్తూ, పార్లమెంటు ఉభయ సభలు సక్రమంగా పని చేయకపోవటం వలన అధికార పక్షానికి పెద్దగా నష్టం ఉండదు కానీ ప్రతిపక్షానికి ఎక్కువ నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించగానే అధికార పక్షం సభ్యులు ఆశ్చర్యపోయారు.

03/04/2016 - 08:33

న్యూఢిల్లీ: ఉపదేశాలు వద్దు, మనసులోని మాట ప్రసంగం చేయవద్దంటూ ప్రతిపక్షం సభ్యులు రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగానికి అడ్డుపడ్డారు. మోదీ గురువారం లోక్‌సభలో రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపినంత సేపూ ప్రతిపక్ష సభ్యులు అడ్డుపడుతూ రకరకాల వ్యాఖ్యానాలు చేశారు.

Pages