S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/07/2016 - 06:40

కోల్‌కతా: పార్లమెంటుపై దాడి కేసులో మరణశిక్ష పడిన అఫ్జల్ గురును 2013లో ఉరితీసిన తీరుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్ గంగూలీ ఆదివారం అనుమానాలు వ్యక్తం చేస్తూ, మెడకు ఉరితాడు బిగుసుకునే చివరిక్షణం వరకు కూడా మానవ హక్కులదే పైచేయి కావాలన్నారు. ‘ఉరి అమలు తీరు తప్పని ఒక మాజీ న్యాయమూర్తిగా నేను చెప్పగలను. అతని క్షమాభిక్ష పిటిషన్‌ను ఫిబ్రవరి 3న తిరస్కరించారు. ఫిబ్రవరి 9న ఉరిని అమలు చేశారు.

03/07/2016 - 06:37

బృందావన్: దేశంలో చెలరేగుతున్న విచ్ఛిన్నకర శక్తులపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సానుభూతి చూపించడాన్ని బిజెపి సీనియర్ నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తూర్పారబట్టారు. భారతీయ జనతా యువమోర్చా (బిజెవైఎం) రెండు రోజుల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన కార్యకర్తలనుద్దేశించి అరుణ్ జైట్లీ ప్రసంగించారు.

03/07/2016 - 06:33

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంపై దేశద్రోహ కేసు నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులతో ప్రస్తుతం ఆ యూనివర్శిటీ విద్యార్థి సంఘ (జెఎన్‌యుఎస్‌యు) పూర్వ అధ్యక్షులు కూడా గొంతు కలిపారు.

03/07/2016 - 06:31

మథుర: ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించిన 2018 గడువుకు ఏడాది ముందే దేశంలోని అన్ని గ్రామాలను విద్యుదీకరించడానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇక్కడ చెప్పారు. దేశంలో విద్యుత్‌కు, బొగ్గుకు కొరత లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ‘బొగ్గు కొరత కారణంగా దేశంలోని ఏ విద్యుత్ కేంద్రాన్ని కూడా తాత్కాలికంగా మూసివేయాల్సిన అవసరం రాలేదు. అంటే బొగ్గు కొరత లేదనే అర్థం.

03/07/2016 - 06:30

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అగ్ని పరీక్షతో సమానమే.

03/07/2016 - 01:25

న్యూఢిల్లీ/ అహ్మదాబాద్: పాకిస్తాన్‌నుంచి గుజరాత్ గుండా పది మంది లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ మిలిటెంట్లు దేశంలోకి ప్రవేశించారని, దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాద దాడి జరపడానికి నగరంలోకి చొరబడవచ్చన్న సమాచారం పోలీసులకు అందడంతో ఢిల్లీతో పాటుగా గుజరాత్, జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రాల్లో ఆదివారం హై అలర్ట్ ప్రకటించారు.

03/07/2016 - 01:22

న్యూఢిల్లీ: వ్యవస్థలో మార్పులొస్తే చాలదని, మహిళలు సాంకేతికంగా సాధికారికత సాధించాలని, ప్రజా ప్రతినిధులుగా సమర్థవంతులుగా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పిలుపునిచ్చారు. ప్రతిరంగంలో మహిళలు శక్తివంతులుగా ఎదగడం దేశానికి గర్వకారణమన్నారు. అయితే తొలి రోజన రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ప్రధానంగా ప్రస్తావించిన మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఆయన ఎలాంటి ప్రస్తావనా చేయకపోవడం గమనార్హం.

03/06/2016 - 18:07

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గడ్‌లోని అమ్‌దాయ్‌ ఘాటి ప్రాంతం వద్ద ఆదివారం నక్సలైట్లు ల్యాండ్‌మైన్‌ పేల్చారు. దీంతో ఇద్దరు కార్మికులు మృతిచెందారు. నక్సలైట్లు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టులను పట్టుకోవడానికి పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

03/06/2016 - 18:03

మీరట్‌ : ఉత్తరప్రదేశ్‌ మీరట్‌లో ఈవ్‌టీజర్‌ను ఓ మహిళ చితక్కొట్టింది. రోజూ ఆమె ఆఫీసుకు వెళుతుంటే కొంతకాలంగా వేధిస్తున్నాడు. నడిరోడ్డుమీద కొడితే గానీ అతనికి బుద్ధి రాదని నిర్ణయించుకుని అతని చెంప పగలగొట్టింది.

03/06/2016 - 07:19

చెన్నై: తమిళనాడులో అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో జాతీయగీతం కచ్చితంగా ఆలపించాలని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఉదయం అసెంబ్లీ సందర్భంగా జనగణమన గీతం విద్యార్థులతో పాడించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ప్రైవేటు పాఠశాలల్లోనూ జాతీయ గీతాన్ని ఆలపించేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను బెంచ్ విచారించింది.

Pages