S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/28/2016 - 05:07

న్యూఢిల్లీ, జనవరి 27: జమ్ముకాశ్మీర్ సహా నక్సల్ సమస్య తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో కొత్తగా 17 ప్రత్యేక పోలీసు బెటాలియన్లు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశాలోని నక్సల్ పీడిత ప్రాంతాల్లో ప్రత్యేక బెటాలియన్లను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల అదనంగా 17వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలుంటాయి.

01/27/2016 - 11:42

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం 6.30 ని.లకు కేంద్ర మంత్రిమండలి భేటీ అవుతోంది. అభివృద్ధి పథకాల పురోగతి, మంత్రుల పనితీరు, తాజా రాజకీయ పరిణామాలు వంటి అంశాలపై మోదీ మంత్రివర్గ సహచరులతో చర్చించే అవకాశం ఉంది.

01/27/2016 - 11:41

దిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అరుణాచలంలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో రాష్టప్రతి పాలన విధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ రాష్టప్రతి పాలన విధించడంలో మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని ఆరోపిస్తున్నారు.

01/27/2016 - 03:03

న్యూఢిల్లీ, జనవరి 26: గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా ‘డేర్ డెవిల్స్’ మోటార్ సైకిల్ బృందం తమ అద్భుత ప్రదర్శనలతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

01/27/2016 - 02:59

న్యూఢిల్లీ, జనవరి 26: దేశ వ్యాప్తంగా రిపబ్లిక్‌డే వేడుకలు అంబరాన్నంటాయి. అన్ని రాష్ట్రాల్లోనూ గణతంత్ర దినోత్సవ సంబరాలు వెల్లివిరిశాయి. ఆయా ప్రాంతాల సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 67వ రిపబ్లిక్‌డే సందర్భంగా అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రాల రాజధానుల్లో గవర్నర్లు మువ్వనె్నల జెండా ఎగరేశారు.

01/27/2016 - 02:52

న్యూఢిల్లీ, జనవరి 26: ఉగ్రవాద దాడులు జరగవచ్చన్న ఇంటెలిజన్స్ నివేదికల హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం గణతంత్ర దినోత్సవ వేడుకలకోసం దేశవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద రిపబ్లిక్ డే వేడుకలు ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

01/27/2016 - 02:27

భారత సర్వతోముఖ వికాసం కళ్లకు కట్టింది. సాంస్కృతిక వైభవం, సైనిక పాటవం, ఆర్థిక ప్రగతి విభ్ని కోణాల్లో ఆవిష్కతమయ్యాయి. 67వ గణతంత్ర వేడుకలు
అనేక రకాలుగా ప్రత్యేకం. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాన్ ముఖ్య అతిధి అయ్యారు. ఆ దేశ సైనికులూ కవాతులో తొలి సారిగా పాల్గొన్నారు. జాగిలాల సైన్యమూ అలరించింది.

01/27/2016 - 07:24

న్యూఢిల్లీ, జనవరి 26: అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన ఇవదించాలన్న కేంద్ర మంఅతివర్గం సిఫార్సుకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ఆమోదముద్ర వేయడంతో ఆ రాష్ట్రం రాష్టప్రతి పాలన కిందికి వచ్చింది.

01/26/2016 - 17:45

దిల్లీ: దట్టమైన పొగమంచు దిల్లీ పరిసరాలను కప్పేసింది. దీంతో మంగళవారం ఉదయం వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 45 రైళ్లను రద్దు చేయగా, 35 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో జనం చలితో వణుకుతున్నారు. అయితే, విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదు.

01/26/2016 - 17:44

షిల్లాంగ్: మేఘాలయలోని జైనిటా పర్వత ప్రాంతంలో మంగళవారం ఓ బస్సు లోయలో పడి పదిమంది మరణించారు. అస్సాం రాజధాని గౌహతి నుంచి బయలుదేరిన ఈ ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. గాయపడిన మరో 26 మందిని సమీప ఆస్పత్రికి తరలించారు.

Pages