S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/26/2016 - 14:06

చండీగఢ్: ఇటీవల ఉగ్రవాదుల దాడులతో వార్తల్లోకెక్కిన పటాన్‌కోట్ (పంజాబ్)లో మంగళవారం ఉదయం మళ్లీ కలకలం రేగింది. రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా ఓ బ్యాగ్ కనిపించడంతో బాంబు ఉందేమోనన్న ఆందోళన జనంలో చెలరేగింది. ఈ సమాచారం తెలియడంతో పోలీసులు, బాంబు స్క్వాడ్ నిపుణులు రైల్వే స్టేషన్‌కు చేరుకుని బ్యాగ్‌ను తెరిచి చూశారు. ఎలాంటి బాంబు లేదని తేలడంతో అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు.

01/26/2016 - 11:37

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ ప్రాంతంలో మంగళవారం ఉదయం సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మరణించాడు. మృతదేహం వద్ద సైనికులు ఆయుధాలను స్వాధీనం చేసుకొని, సమీప ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.

01/26/2016 - 11:35

దిల్లీ: 67వ రిపబ్లిక్ డే సందర్భంగా దిల్లీలోని అమర జవాన్ జ్యోతి వద్ద మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ అమర వీరులకు ఘనంగా నివాళులర్పించారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్, సైనిక దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

01/26/2016 - 11:34

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ రాజ్‌పథ్‌లో జాతీయ జెండాను ఎగురవేసి త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఏడాది వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండె ముఖ్య అతిథిగా హాజరవడంతో అనూహ్య రీతిలో భద్రతా చర్యలు తీసుకున్నారు. దివంగత లాన్స్ నాయక్ మోహన్‌దాస్ గోస్వామి భార్యకు ప్రణబ్ అశోకచక్ర పురస్కారం అందజేశారు.

01/26/2016 - 01:11

న్యూఢిల్లీ, జనవరి 25: ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అభియోగాలపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో అరెస్టయిన 12 మందిని ఫిబ్రవరి అయిదో తేదీ వరకు ఎన్‌ఐఎ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ 12 మందిని దేశంలోని వివిధచోట్ల ఎన్‌ఐఎ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

01/26/2016 - 01:10

జైపూర్, జనవరి 25: జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని రాజస్థాన్‌లోని దూదు జిల్లాలో కొందరు సంఘవిద్రోహ శక్తులు అపవిత్రం చేశారు. ఈ విగ్రహాలపై ముందూ వెనక ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థ ‘ఐసిస్’ సందేశాలను రాశారు. ఈ విషయం సోమవారం తెల్లవారుజామున బయటపడింది. ఇవన్నీ హెచ్చరిక సందేశాలుగానే ఉన్నాయని, ఇందుకు పాల్పడ్డవారి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని జైపూర్ ఐజి డి.సి.జైన్ తెలిపారు.

01/26/2016 - 01:09

న్యూఢిల్లీ, జనవరి 25: అరవై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా నిరుపమాన సాహసాలను కనబరిచిన 841 మంది పోలీసులకు ప్రతిష్టాత్మక రాష్టప్రతి పతకాలు దక్కాయి. ప్రతిష్టాత్మక అశోక్ చక్ర అవార్డును లాన్స్‌నాయక్ మోహన్‌నాథ్ గోస్వామికి మరణానంతరం ప్రకటించారు. ఈఅవార్డులో భాగంగా నాలుగు కీర్తిచక్ర, 11 శౌర్యచక్ర పురస్కారాలను ప్రకటించారు. 48 సేనా పతకాలను రాష్టప్రతి ఆమోదించారు.

01/26/2016 - 01:08

న్యూఢిల్లీ, జనవరి 25: అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ‘సుప్రీం కోర్టు రిజిస్ట్రీలో సోమవారం మేం పిటిషన్ దాఖలు చేశాం’ అని కాంగ్రెస్ నేత, సీనియర్ అడ్వొకేట్ వివేక్ టంఖా వెల్లడించారు. అరుణాచల్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ విప్ బమాంగ్ ఫెలిక్స్ పిటిషన్ వేశారన్నారు.

01/26/2016 - 01:08

న్యూఢిల్లీ, జనవరి 26: ‘రఫాలే’ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై భారత్, ఫ్రాన్స్ సంతకాలు చేశాయి. మొత్తం 36 రఫాలే యుద్ధ విమానాల కొనుగోలు నిమిత్తం ఇరు దేశాలు సోమవారం అంతర్ ప్రభుత్వ ఒప్పందాన్ని (ఐజిఎ) కుదుర్చుకున్నాయి. ధరకు సంబంధించిన సమస్యల వలన ఇందుకు సంబంధించిన తుది ఒప్పందం కుదరకపోయినప్పటికీ రెండు మూడు రోజుల్లో దీనిపై కూడా సంతకాలు జరుగుతాయని భావిస్తున్నారు.

01/26/2016 - 01:07

న్యూఢిల్లీ, జనవరి 25: షెడ్యూల్డు కులాలు (ఎస్సీ), షెడ్యూల్డు తెగలకు (ఎస్టీ) చెందిన వారిపై అత్యాచారాలకు పాల్పడే వారిపై మంగళవారం నుంచి కఠినమైన చర్యలు అమలులోకి వస్తున్నాయి. సామాజిక, ఆర్థిక బహిష్కరణసహా ఎస్సీ, ఎస్టీల గౌరవానికి ఎలాంటి భంగం కలిగించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

Pages