S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/28/2016 - 14:15

తిరువనంతపురం : సోలార్ కుంభకోణంలో సీఎం ఉమెన్‌చాంద్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ హెడ్‌క్వార్ట్‌ర్స్ వద్ద ఆందోళన చేస్తున్న ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ కుంభకోణంలో తనపై వస్తున్న ఆరోపణల వెనుక బార్ యజమానుల కుట్రదాగివుందని సీఎం పేర్కొన్నారు. కాగా త్రిస్సూర్ విజిలెన్స్ కోర్టు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.

01/28/2016 - 07:46

న్యూఢిల్లీ, జనవరి 27: ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాలకు బుధవారం స్వల్ప వ్యవధిలో నాలుగు బాంబు బెదిరింపు ఫోన్‌లు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు అంతర్జాతీయ విమానాలు సహా మొత్తం మూడు విమానాలను నిలిపివేశారు. ఢిల్లీ నుంచి ఖాట్మండు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్ విమానాలను ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బయలు దేరడానికి కొద్ది వ్యవధి ముందే నిలిపివేశారు.

01/28/2016 - 07:32

తిరువనంతపురం, జనవరి 27: సోషల్ మీడియాను ఉపయోగించేటప్పుడు సంయమనం, క్రమశిక్షణ పాటించాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భద్రతా జవాన్లకు పిలుపునిస్తూ పోలీసు దళాలు ఈ మాధ్యమాన్ని తమకు అనుకూలంగాను, ప్రజలతో సంబంధాలను పెంచుకోవడానికి ఓ సాధనంగాను ఉపయోగించుకోవాలని అన్నారు. అంతేకాదు, పోలీసులు స్థానికులతో ఉన్న విశ్వాస లోపాన్ని తగ్గించుకోవడం ఎంతయినా ముఖ్యమని కూడా ఆయన స్పష్టం చేశారు.

01/28/2016 - 07:30

న్యూఢిల్లీ / జైపూర్, జనవరి 27: గణతంత్ర దినోత్సవం రోజు భారత గగనతలంపైకి వచ్చిన అనుమానాస్పద బెలూన్ గుట్టు బయటపడింది. అది అమెరికాలో తయారైన బెలూన్ అనీ, పాకిస్తాన్ మీదుగా భారత్ గగనతలంలోకి వచ్చిందని ఉన్నతస్థాయి అధికార వర్గాలు బుధవారం స్పష్టం చేశాయి. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని రక్షణ శాఖ వర్గాలు విదేశాంగ శాఖకు సమాచారాన్ని అందించాయి.

01/28/2016 - 07:29

ఇస్లామాబాద్, జనవరి 27: ముంబయిపై ఉగ్రవాదుల దాడి కేసు దర్యాప్తుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. 26/11 దాడికి పథకం రూపొందించటంతోపాటు దానిని అమలు చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితుల స్వర నమూనాలను సేకరించడానికి అనుమతించాలని కోరుతూ పాకిస్తాన్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది.

01/28/2016 - 07:29

ఇటానగర్, జనవరి 27: అరుణాచల్‌ప్రదేశ్‌లో కేంద్రం రాష్టప్రతి పాలన విధించిన తర్వాత రాష్ట్ర గవర్నర్ జ్యోతి ప్రసాద్ రాజ్‌ఖోవా పరిపాలనా పగ్గాలు తన చేతుల్లోకి తీసుకోవడమే కాకుండా శాసనసభ్యులకు వారికి దక్కాల్సిన భద్రతను కల్పించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం గవర్నర్ ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య లేకుండా చూడాలని వారికి సలహా ఇచ్చారు.

01/28/2016 - 07:18

న్యూఢిల్లీ, జనవరి 27: అయోధ్యలో బాబ్రీ మసీదు ఉండిన స్థలంలో 1976-77 మధ్య కాలంలో అప్పటి భారత పురాతత్వ శాఖ (ఎఎస్‌ఐ) డైరెక్టర్ ప్రొఫెసర్ బిబి లాల్ నేతృత్వంలోని ఓ బృందం జరిపిన తవ్వకాల్లో ఒక హిందూ ఆలయానికి సంబంధించిన అవశేషాలు బైటపడ్డాయని అప్పుడు ఎఎస్‌ఐ ఉత్తరాది ప్రాంతీయ డైరెక్టర్‌గా పని చేసిన కెకె ముహమ్మద్ ఆరోపించారు.

01/28/2016 - 06:28

న్యూఢిల్లీ, జనవరి 27: అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలన విధించడాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్‌కు నోటీసులు జారీ చేసింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభంపై జారీ చేసిన తన నోటీసులో ఈ నెల 29వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని, గవర్నర్ ఆదేశించింది.

01/28/2016 - 06:25

న్యూఢిల్లీ, జనవరి 27: ప్రైవేట్ సంస్థల ద్వారా రైల్వే ప్రాజెక్టులు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటవుతున్న జెవిసిల సారథ్యంలో స్పెషల్ పర్పస్ వెహికిల్స్ ద్వారా ప్రాజెక్టులు పూర్తి చేయాలని కేంద్రం యోచిస్తోంది.

01/28/2016 - 06:12

రాంచి/ భద్రాచలం, జనవరి 27: జార్ఖండ్‌లోని పాలము జిల్లాలో బుధవారం సాయంత్రం నక్సలైట్లు పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేల్చడంతో కనీసం ఆరుగురు పోలీసులు చనిపోగా, పలువురు గాయపడ్డారు. జిల్లాలోని చత్తర్‌పూర్ ఏరియాలో పోలీసు వాహనాన్ని టార్గెట్ చేసుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చినట్టు తెలుస్తోంది. దాడిలో పోలీసు వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ సైతం మృతిచెందాడు.

Pages