S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/30/2015 - 04:52

జూనియర్ పోస్టుల భర్తీపై కేంద్ర శాఖలకు ఉత్తర్వులు
నైపుణ్య పరీక్ష కొనసాగింపు

12/30/2015 - 04:52

మోదీ, పార్లమెంట్,
అణు కేంద్రాలపై దాడికి లష్కరే కుట్ర
ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక
దేశంలోకి 20 మంది ఉగ్రవాదులు
హైదరాబాద్ సహా అన్ని నగరాలు మరింత అప్రమత్తం

12/29/2015 - 18:44

న్యూఢిల్లీ: ప్రముఖ గుజరాతీ రచయిత రఘువీర్ చౌదరికి జ్ఞానపీఠ్ అవార్డు వరించింది. 2015 సంవత్సరానికిగాను ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు. జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికైన వారిలో రఘువీర్ చౌదరి 51వ వారు. రఘువీర్ చౌదరి గతంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు.

12/29/2015 - 17:01

పాకిస్థాన్ : పాకిస్థాన్ మర్దాన్‌లోని నేషనల్ డాటాబేస్ రిజిస్ట్రేషన్ అథారిటీ కార్యాలయం లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఆత్మాహుతి దాడిలో 18 మంది మృతి చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.

12/29/2015 - 16:51

పాకిస్థాన్ : పాకిస్థాన్‌లో 2014లో పెషావర్‌లోని ఓ పాఠశాలపై ఉగ్రవాద దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల ముష్కరలకు పాకిస్థాన్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. ఈమేరకు అనేకమందికి ఉరిశిక్షగా వేయగా మంగళవారంనాడు మరో నలుగురికి ఉరిశిక్ష అమలుచేశారు. ఇప్పటికీ పాకిస్థాన్‌లో 637 మంది ఉగ్రవాదులను ఉరితీశారు.

12/29/2015 - 16:20

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో కాంఖేర్ జిల్లాలో మంగోతి కొర్రం అనే మహిళ నక్సలైట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా జరిపిన సోదాల్లో భాగంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు.నిందితురాలిని సీపీఐ మావోయిస్టు పార్టీ కిస్కోడో స్థానిక దళ సభ్యురాలిగా పేర్కొన్నారు.

12/29/2015 - 16:14

ఢిల్లీ : పాకిస్థాన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీకి గూఢచర్యం చేస్తున్న మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విధి నిర్వహణలో సస్పెండ్ అయిన మాజీ అధికారి రంజిత్‌సింగ్ ఐఎస్‌ఐకు రహస్య సమాచారం చేరవేస్తున్నాడనే అనుమానంతో రక్షణ మంత్రిత్వ శాఖకు సమాచారం అందించారు. అతడి చర్యలపై అనుమానంతో నేడు అరెస్టు చేశారు.

12/29/2015 - 16:14

న్యూఢిల్లీ : కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా దేశంలో లష్కరేతోయిబా ఉగ్రవాద సంస్థ దాడులకు తెగబడవచ్చని నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈమేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశాయి. పాక్ నుంచి లష్కరేతోయిబా ఉగ్రవాదులు చొరబడ్డారని, ముంబయి తరహా దాడులు జరగవచ్చని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

12/29/2015 - 13:40

పుణే: ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ క్యాంటీన్ లో క్యాషియర్ గా పనిచేస్తున్న మహిళపై ఇద్దరు వ్యక్తులు అదే క్యాంటీన్ లో అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

12/29/2015 - 13:29

పాట్నా :బిహార్‌లో మరో ఇంజినీర్‌ హత్యకు గురయ్యాడు. పాట్నాకు చెందిన అంకిత్‌ జా అనే వ్యక్తి ఓ టెలికాం సంస్థలో క్వాలిటీ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. పాట్నాకు 60కిలోమీటర్ల దూరంలో వైశాలి జిల్లాలో నిన్న ఆయన శవమై కనిపించాడు. ఆయనను కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు తెలుస్తోంది.

Pages