S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/12/2019 - 05:56

గ్రేటర్ నోయిడా, ఫిబ్రవరి 11: అతివేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ దూసుకుపోతోందని, 2030 నాటికి మనం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నామని ప్రధాని నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు.

02/12/2019 - 05:46

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రత్యేక హోదా సాధన కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీలో జరిపిన ఒక రోజు ధర్మ పోరాట దీక్ష ఘన విజయం సాధించింది. దాదాపు 20 జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన అధ్యక్షులు, ముఖ్య నాయకులు ఏపీ భవన్‌లో జరిగిన ఈ దీక్షా శిబిరానికి హాజరై చంద్రబాబుకు, ప్రత్యేక హోదా కు మద్దతు ప్రకటించారు.

02/12/2019 - 01:12

న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులతో వివాహాలు సమస్యాత్మకంగా మారుతున్న నేపథ్యంలో కేంద్రం ఓ కీలక బిల్లును రూపొందించింది. పెళ్లయిన నెల రోజుల్లోనే తప్పనిసరిగా వివాహాలను రిజిస్టర్ చేసుకుని తీరాలన్న బిల్లును సోమవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం 30రోజుల వ్యవిధిలో వివాహాన్ని రిజిస్టర్ చేసుకోని ఎన్‌ఆర్‌ఐల పాస్‌పోర్టును రద్దు చేయడం లేదా జప్తు చేయడం గానీ జరుగుతుంది.

02/12/2019 - 01:11

లక్నో, ఫిబ్రవరి 11: లోక్‌సభ, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించడమే తమ ఆశయమని, ఆ లక్ష్యాన్ని సాధించే వరకూ విశ్రమించేది లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. తన సోదరి ప్రియాంక రాజకీయ అరంగేట్రానికి సోమవారం ఇక్కడ భారీ రోడ్‌షోతో నాంది పలికిన రాహుల్ తనదైన శైలిలో ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు.

02/11/2019 - 17:37

న్యూఢిల్లీ: విరాళాలు సేకరించే విషయంలో మిగతా పార్టీలకు మన పార్టీ పారదర్శకంగా ఉండాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. ఆయన దీనదయాళ్ వర్థంతి సందర్భంగా పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలోని ఒక్కో బూత్ నుంచి ఇద్దరు కార్యకర్తలు కనీసం రూ.1000లు నమో యాప్ ద్వారా అందజేయాలని పిలుపునిచ్చారు.

02/11/2019 - 16:09

షిల్లాంగ్: తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ కునాల్ ఘోష్, కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ సీబీఐ ఎదుట సోమవారంనాడు హాజరయ్యారు. ఈ ఉదయం మాజీ ఎంపీ కునాల్ ఘోష్ హాజరైన గంట తరువాత రాజీవ్ కుమార్ వచ్చారు. ఇరువురిని సీబీఐ అధికారులు విచారించారు. కాగా మాజీ ఎంపీ కునాల్ ఘోష్ శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో కేసులో 2013లో అరెస్టు అయ్యారు. మూడేళ్ల తరువాత ఆయన బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం విదితమే.

02/11/2019 - 16:08

న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీలో చేస్తున్న దీక్షాస్థలిలో ఏర్పాటుచేసిన ఓ పోస్టర్ తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తోంది. ఆ పోస్టర్‌లో ఇలా ఉన్నది.. ‘‘కడగాల్సిన టీ కప్పులు ఇవ్వాల్సిన వ్యక్తి చేతికి దేశాన్ని అప్పగించారు’’ అని ఉన్నది. చాయ్‌వాలా అయిన మోదీని ఉద్దేశిస్తు వేసిన ఈ పోస్టర్‌పై తీవ్ర దుమారం చెలరేగటంతో టీడీపీ కూడా దీనిపై స్పందించింది.

02/11/2019 - 16:11

న్యూఢిల్లీ: ఏపీ ప్రత్యేక హోదా సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షకు ఆమ్‌ఆద్మీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా దీక్షా వేదికపై మాట్లాడుతూ అబద్ధాలు చెప్పటంలో మోదీకి మించినవారు లేరని, ఆయన ఒక పార్టీకి కాదు దేశానికి ప్రధాని అనే విషయాన్ని మర్చిపోతున్నారని విమర్శించారు.

02/11/2019 - 16:03

లక్నో: ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగ ఇన్‌ఛార్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రియాంకగాందీ తొలిసారి సోమవారంనాడు లక్నోలో అడుగుపెట్టారు. సోదరుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ విభాగ ఇన్‌ఛార్జి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి ఆమె ఈరోజు లక్నోలో రోడ్‌షో నిర్వహించారు. దాదాపు 30 కిలోమీటర్ల మేర నిర్వహించనున్న ఈ రోడ్‌షో సందర్భంగా ప్రియాంకగాంధీ కటౌట్లు ఏర్పాటుచేశారు.

02/11/2019 - 13:10

న్యూఢిల్లీ: ఏపీ ప్రజలకు ఆండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన న్యూఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్ష సభలో మాట్లాడుతూ మోదీ చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజల సొమ్మును దోచి అంబానీకి పెడుతున్నారని విమర్శించారు.

Pages