S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/21/2018 - 05:54

అమృత్‌సర్, అక్టోబర్ 20: పంజాబ్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సందర్శించారు. బాధిత కుటుంబాలను ఆయన ఓదార్చారు. ఇశ్రాయెల్ పర్యనటను వాయిదా వేసుకున్న సీఎం రైలు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అమరీందర్ మెజిస్టీరియల్ దర్యాప్తును ఆదేశించినట్టు ప్రకటించారు.

10/21/2018 - 05:53

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే మధ్య శనివారం జరిగిన చర్చల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అనేక అంశాలు చర్చకు వచ్చాయి. శ్రీలంకలో భారత్ ఆర్థిక సాయంతో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపైనా ఈ ఇద్దరు నేతలు చర్చించారు.

10/21/2018 - 05:45

అమృత్‌సర్, అక్టోబర్ 20: దసరా పండుగ ఉత్సాహం ఆవిరైపోయింది. ఎవర్ని కదిపినా గుండెలను పిండేసే గాథలే. అమృత్‌సర్-మానావాల స్టేషన్ల మధ్య జరిగిన రైలు ప్రమాదం 61 మందిని పొట్టనబెట్టుకుంది. మరోవైపు కుటుంబ సభ్యుల సమాచా రం కోసం బంధువుల బాధలు వర్ణనాతీతం. విజయ్‌కుమార్‌కు అశీష్, మనీష్ అనే ఇద్దరు కుమారులు, అశీష్ జోడాపాఠక్‌కు వెళ్లి క్షేమంగానే తిరిగి వచ్చాడు. మనీష్ ఆచూకీ కోసం విజయ్‌కుమార్ తల్లడిల్లిపోతున్నారు.

10/21/2018 - 05:44

కొచ్చి, అక్టోబర్ 20: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శబరిమలలోని అయ్యప్ప స్వామి దేవాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమా ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం దాడి చేశారని, ఇంటిలోని సామగ్రిని ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. రెహానా ఫాతిమా శుక్రవారం పోలీసు రక్షణ మధ్య అయ్యప్ప స్వామి ఆలయంలోకి వెళ్లడానికి విఫలయత్నం చేశారు.

10/21/2018 - 05:43

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: అమృత్‌సర్ ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి డ్రైవర్‌ను బాధ్యుణ్ని చేయలేమని, అతనిపై ఎలాంటి చర్యలూ ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా శనివారం మీడియాతోమాట్లాడుతూ ‘అమృత్‌సర్-మానావాల స్టేషన్ల మధ్య జరిగిన ప్రమాదం వెనక రైల్వే శాఖ నిర్లక్ష్యం ఎంతమాత్రం లేదు’అని స్పష్టం చేశారు.

10/21/2018 - 05:41

బెంగళూరు, అక్టోబర్ 20: భారతీయ జనతా పార్టీ తమకు ‘ఉమ్మడి శత్రువు’ అని కర్ణాటకలోని అధికార కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) పార్టీలు శనివారం స్పష్టం చేశాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో లౌకిక పార్టీలు ఐక్యంగా పోరాడి ‘మతతత్వ శక్తుల’ను ఓడించాలనే సందేశాన్ని రాష్ట్రంలోని తమ కూటమి ఇస్తోందని కాంగ్రెస్, జేడీ(ఎస్) పార్టీలు పేర్కొన్నాయి.

10/20/2018 - 16:58

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పతిలోని తిక్రి గ్రామంలో కోతులు జరిపిన రాళ్ల దాడిలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. ధార్మసింగ్ అనే డెబ్బయ్ సంవత్సరాల వృద్ధుడు చెట్టు కింద పుల్లలు ఏరుకుంటే అక్కడే పాడుబడిన ఇంట్లో నుంచి వచ్చిన కోతులు ఇటుకలతో చెట్టు ఎక్కుతున్నాయి. ఆ కోతులు వృద్ధుడిపై ఇరవై ఇటుకలు విసిరేశాయి. తీవ్రంగా గాయపడిన వృద్ధుడు చికిత్స పొందుతూ చనిపోయాడు.

10/20/2018 - 16:53

జమ్మూకాశ్మీర్: ఇక్కడ జరిగిన స్థానిక ఎన్నికల పలితాలు శనివారం వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ ఆరు జిల్లాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 75 వార్డులు గెలుచుకోగా, కాంగ్రెస్ 52 వార్డులు గెలుచుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు 45 వార్డుల్లో గెలుపొందారు. బారాముల్లా జిల్లాలో కాంగ్రెస్ ఒక్క వార్డు గెలుచుకోలేదు. బీజేపీ 17 వార్డుల్లో గెలుచుకుంది.

10/20/2018 - 13:20

అమృత్‌సర్: పట్టాల పక్కన దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు రైల్వే అధికారులకు ఎలాంటి సమాచారం లేదని రైల్వే బోర్డు ఛైర్మన్‌ అశ్విని లొహాని ఓ ప్రకటనలో వెల్లడించారు. రైల్వే సిబ్బందిని ఎందుకు అప్రమత్తంగా ఉంచలేదని అడిగిన ప్రశ్నకు లొహాని పై విధంగా స్పందించారు. జలంధర్‌-అమృత్‌సర్‌ రైలు నిర్ణీత వేగంతోనే ప్రయాణిస్తోందని, రైలును ఆపేందుకు డ్రైవర్‌ అత్యవసర బ్రేక్స్‌ కూడా వేసినట్లు తెలిసిందని ఆయన వెల్లడించారు.

10/20/2018 - 13:14

తిరువనంతరపురం: ‘50ఏళ్ల తర్వాతే మళ్లీ శబరిమలను దర్శించుకుంటాను’ అంటూ ఓ తొమ్మిదేళ్ల చిన్నారి ప్లకార్డు పట్టుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. అయ్యప్పమాల వేసుకొని తల మీద ఇరుముడి పెట్టుకున్న తొమ్మిదేళ్ల చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించింది. ‘నాకు 50 ఏళ్లు పూర్తయిన తర్వాతే మళ్లీ శబరిమలను దర్శించుకుంటాను. అప్పటి వరకు రాను’ అని అర్థం వచ్చేలా రాసి ఉన్న ప్లకార్డును పట్టుకొని ఆలయంలోకి ప్రవేశించింది.

Pages