S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/20/2018 - 13:13

బీజాపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్‌ జిల్లా మిర్తూర్‌ అటవీప్రాంతంలో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలిలో మూడు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

10/20/2018 - 12:44

హోళగొందు: దేవరగట్టులో జరిగిన కర్రల సమరంలో 35 మంది గాయపడ్డారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. దేవరగట్టు సమీపంలోని మాళమ్మ, మల్లేశ్వర స్వామికి రాత్రి 12 గంటల తరువాత కల్యాణం జరిగిన అనంతరం ఈ ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఈ విగ్రహాలను దక్కించుకోవటం కోసం కర్రల సమరం నిర్వహిస్తారు.

10/20/2018 - 12:41

పాట్నా: బీహార్‌లోని బీజేపీ సీనియర్ నేత, బెగుసరయ్ ఎంపీ బోలాసింగ్ (80) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో రామ్ మనోహరిలోహియా ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.ఎనిమిదిసార్లు శాసనసభ్యుడిగా, రెండుసార్లు లోకసభ సభ్యుడిగా తన సేవలు అందించారు. బీహార్ శాసనసభ్యునిగానూ పనిచేశారు

10/20/2018 - 12:39

న్యూఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి పరిపూర్ణానంద శనివారం ఉదయం బీజేపీలో చేరారు. బిజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌లతో సమావేశమైన అనంతరం ఆయన రాజకీయ తీర్థం పుచ్చుకున్నారు. అమిత్‌షా తన నివాసంలో ఆయనకు పార్టీ కండువా కప్పి సభ్యత్వ రసీదు ఇచ్చారు. అనంతరం పరిపూర్ణానంద విలేకరులతో మాట్లాడుతూ తొమ్మిది రోజులు పూర్తి నిరాహారంగా ఉండి ఆత్మ పరిశీలన చేసుకున్నానని అన్నారు.

10/20/2018 - 12:35

భువనేశ్వర్:ఒడిసాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భువనేశ్వర్ సమీపంలోని ఉత్తరాచౌక్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు చనిపోయారు. కారు-ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఈ ప్రమాదంలో కారు సమీపంలోని కాల్వలోకి దూసుకుపోయింది. కారులోని నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు కూడా చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

10/20/2018 - 12:34

చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన రెండు అల్పపీడనాల వల్ల రాగాల 48 గంటల్లో వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. ఈ మేరకు చెన్నై వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతీ రుతుపవనాలు నిష్క్రమణ కూడా దీనికి కారణం. ఈశాన్య రుతు పవనాలు ప్రవేశించనున్న నేపథ్యంలో ఈ అల్పపీడనాల వల్ల చెన్నై పట్టణంలో రాగాల 48 గంటల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

10/20/2018 - 12:33

అమృతసర్: పంజాబ్‌లోని జోడా పాఠక్ వద్ద నిన్న సాయంత్రం జరిగిన రైలు ప్రమాదంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విచారణకు ఆదేశించారు. ముగ్గురు సభ్యులతో కూడిన సంక్షోభ నివారణ కమిటీని ఆయన ఏర్పాటుచేశారు. జోడా పాఠక్ వద్ద రైలు పట్టాలపై నిలబడి రావణ దహనం చేస్తుండగా రైలు కూత వేయకుండా దూసుకురావటంతో 61మంది చనిపోగా, 70మందికి పైగా గాయపడిన విషయం విదితమే.

10/20/2018 - 06:23

* పనుల్లో వేగం, పారదర్శకతకే ప్రాధాన్యం * ప్రధాని మోదీ ఉద్ఘాటన
* షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రార్థనలు
షిరిడి, అక్టోబర్ 19:దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అత్యధిక కాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పేదరిక నిర్మూలనపై ఎప్పుడూ పెద్దగా దృష్టి పెట్టలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

10/22/2018 - 05:01

బికనేర్, అక్టోబర్ 19: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని దేశ సరిహద్దులను శత్రుదుర్భేద్యంగా మార్చేస్తున్నట్టు కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. కాంప్రహెన్సీవ్ ఇంటిగ్రేటెడ్ బోర్డర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(సీఐబీఎంఎస్)కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన వెల్లడించారు. సరిహద్దుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్టు ఆయన తెలిపారు.

10/20/2018 - 06:14

వారణాశి, అక్టోబర్ 19: మహా పుణ్యక్షేత్రం వారణాశిలోని శ్రీరామ తారకాంధ్ర ఆశ్రమంలో విజయ దశమి సందర్భంగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీరామతారకాంధ్ర ఆశ్రమానికి తెలుగు రాష్ట్రాలనుంచి పెద్ద ఎత్తున తెలుగు యాత్రికులు వస్తుంటారు.

Pages