S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/07/2018 - 01:44

ఆజ్మీర్, అక్టోబర్ 6: ప్రతిపక్షాలకు అధికార దాహం తప్ప మరో ధ్యాస లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో సమాజాన్ని చీల్చుతున్నారని ఆయన అన్నారు. మతం, కులం పేరుతో ఓటర్లను చీల్చి రాజకీయ పబ్బం గడుపుకోవడం విపక్షాలకు అలవాటైందన్నారు. శనివారం ఇక్కడ జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలన్నారు.

10/07/2018 - 00:33

మడకశిర, అక్టోబర్ 6: ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల్లో పలువురు రాజకీయ నాయకుల ఇళ్లు, వ్యాపార సంస్థలపై ఐటీశాఖ ద్వారా బీజేపీ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా దాడులు చేయిస్తోందని కర్నాటక కార్మిక శాఖ మంత్రి వెంకట రమణప్ప ఆరోపించారు.

10/07/2018 - 01:46

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను శనివారం మధ్యాహ్నం 12:30 నిమిషాలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించాల్సివున్నా, దీన్ని వాయిదా వేసి 3 గంటలకు షెడ్యూల్‌ను వెల్లడించడం వివాదానికి దారితీసింది. మీడియా సమావేశం ఆలస్యం కావడంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని తప్పుబట్టింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండీ ఆయా రాష్ట్రాల్లో కోడ్ అమల్లోకి వస్తుంది.

10/07/2018 - 00:21

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం శాసనసభ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ శాసన సభకు ముందస్తు ఎన్నికలు డిసెంబర్ 7న జరుగుతాయి. నోటిఫికేషన్ నవంబర్ 12న జారీ అవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ నవంబర్ 19. మరుసటి రోజు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు నవంబర్ 22.

10/07/2018 - 00:37

బనిహాల్/జమ్ము: కిక్కిరిసిన ప్రయాణికులతో వెళుతున్న మినీ బస్సు అదుపు తప్పి జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి నుంచి కిందికి పడిపోవడంతో 21 మంది దుర్మరణం చెందగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.

10/06/2018 - 17:14

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించిన సీఈసీ ఓపీ రావత్ ఆంధ్రప్రదేశ్‌ లో ఉప ఎన్నికలు లేవని తేల్చిచెప్పారు. ఐదుగురు వైఎస్ఆర్‌సీపీ ఎంపీల రాజీనామాలపై ఆయన మాట్లాడుతూ జూన్ 3వ తేదీతో లోక్‌సభ గడువు ముగుస్తుందని, ఎన్నికల నిర్వహణకు ఏడాది కంటే తక్కువగానే గడువు ఉన్నందున ఉప ఎన్నికలు ఉండవని రావత్ ప్రకటించారు.

10/06/2018 - 17:13

అజ్మీర్: కాంగ్రెస్ విభజించి పాలించాలనే విధానాన్ని అనుసరిస్తోందని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ప్రధాని మోదీ అన్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శనివారంనాడు మోదీ శ్రీకారం చుడుతూ అజ్మీర్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. అందరితో కలిసి, అందరి వికాసం కోసం బీజేపీ పాటుపడుతోందన్నారు.

10/06/2018 - 16:23

న్యూఢిల్లీ : దేశంలో న్యాయమూర్తుల సంఖ్య పెరగటంతో పాటు వారి పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు చీప్ జస్టిస్ రంజన్ గోగొయ్ అభిప్రాయపడ్డారు. న్యాయవాదుల సంఖ్య పెరిగితే అండర్ ట్రయల్ ఖైదీల సంఖ్య తగ్గుతుందని చెప్పారు. దేశంలో అండర్ ట్రయల్ ఖైదీలు 67శాతం మంది ఉన్నారని తెలిపారు.

10/06/2018 - 16:22

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో బస్సు లోయలో పడి ఇరవై మంది చనిపోయారు. మరో 13 మంది గాయపడ్డారు. కేలామోత్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుప త్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

10/06/2018 - 16:05

న్యూఢిల్లీ: తెలంగాణ ఎన్నికలు డిసెంబర్ 7న జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఓపి రావత్ వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం మీడియా సమావేశంలో మాట్లాడుతూ 119 నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. నవంబర్ 12న నోటిపికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. నామినేషన్ల స్వీకరణ నవంబర్ 19న, ఉపసంహరణ 22తేదీగా నిర్ణయించామని తెలిపారు. ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 11న విడుదల చేస్తామని చెప్పారు.

Pages