S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నెక్స్ట్ బిగ్ ఐడియా’కు స్పాన్సర్లుగా గూగుల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టిసిఎస్

ముంబయి, జూలై 1: జోన్ స్టార్టప్స్ ఇండియా, కెనడాలోని ఒంటారియో ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘నెక్స్ట్ బిగ్ ఐడియా’ పోటీకి ఈ ఏడాదికిగాను గూగుల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టిసిఎస్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ పోటీ అధిక టెక్నాలజీ, అమిత సామర్థ్యం కలిగిన ఐదు అంకుర సంస్థల (స్టార్టప్)ను ఎంపిక చేయడానికి నిర్దేశించినది. పోటీలో ఎంపికైన స్టార్టప్‌లకు డిఎమ్‌జెడ్ అనే టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ ద్వారా ఉత్తర అమెరికాలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉంటుంది.

శ్రీసిటిని సందర్శించిన చైనా వాణిజ్య సంస్థల ప్రతినిధులు

తడ, జూలై 1: నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దులో అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొన్న శ్రీసిటి పారిశ్రామిక వాడను శుక్రవారం చైనా వాణిజ్య సంస్థల ప్రతినిధుల బృందం సందర్శించింది. చైనాలోని షెజియాంగ్ రాష్ట్రం నుండి విచ్చేసిన పది మంది సభ్యుల బృందానికి శ్రీసిటి వ్యవస్థాపకుడు రవీంద్ర సన్నారెడ్డి ఘనంగా స్వాగతం పలికి పారిశ్రామికంగా శ్రీసిటి సాధించిన ప్రగతిని గురించి వివరించారు. అనంతరం వారు వివిధ ప్రాంతాలను తిరిగి సెజ్‌లో వెలసిన పాల్స్‌ఫ్లస్ బొమ్మల కంపెనీని సందర్శించారు.

రూ. 150 కోట్ల విమానం.. కోటికే అడిగింది..

ముంబయ, జూలై 1: పక్కన ఫోటోలో కనిపిస్తున్నది పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయ, బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా ఎగవేసి విదేశాలకు పారిపోయన కింగ్‌ఫిషర్ ఎయర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం. బకాయల వసూళ్లలో భాగంగా దీన్ని సర్వీస్ ట్యాక్స్ శాఖ వేలం వేయగా, కేవలం ఒక్క బిడ్ మాత్రమే దాఖలైంది. అదికూడా విమానం విలువ 152 కోట్ల రూపాయలుగా నిర్ణయంచి వేలానికి తీసుకువస్తే.. యుఎఇకి చెందిన ఏవియేషన్ సంస్థ అల్నా ఏరో డిస్ట్రిబ్యూషనల్ ఫైనాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ కేవలం 1.09 కోట్ల రూపాయలతో బిడ్ వేసింది. నిబంధనల ప్రకారం కోటి రూపాయలను డిపాజిట్ కూడా చేసిందీ సంస్థ.

ఇక ఎస్‌బిఐ ఇఎమ్‌ఐలతో ఫ్లిప్‌కార్ట్ కొనుగోళ్లు!

ముంబయి, జూలై 1: ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ టై-అప్ అయ్యింది. దీంతో ఇక ఎస్‌బిఐ ఖాతాదారులు నెలసరి వాయిదాల్లో (ఇఎమ్‌ఐ) ఫ్లిప్‌కార్ట్ ద్వారా కన్జ్యూమర్ డ్యూరబుల్ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. అయితే వ్యక్తిగత రుణ వడ్డీరేటు (14 శాతం) వర్తిస్తుంది. ‘ఇలాంటి ఓ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. దీనివల్ల అటు ఫ్లిప్‌కార్ట్‌కు, ఇటు ఎస్‌బిఐకి ప్రయోజనమే.’ అని టై-అప్ సందర్భంగా శుక్రవారం ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య అన్నారు. ఎస్‌బిఐ డెబిట్ కార్డు ఉన్నవారూ ఈ సౌకర్యాన్ని పొందవచ్చు.

త్రైమాసిక ఫలితాల్లో సింగరేణి వెనుకంజ

కొత్తగూడెం, జూలై 1: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో సింగరేణి సంస్థ పది శాతం వృద్ధిరేటు సాధించాలనే సంకల్పంతో 66 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కానీ గడచిన మూడు మాసాల ఫలితాలను చూస్తే బొగ్గు ఉత్పత్తిలో సంస్థ వెనుకంజలో ఉంది. కోటి 56 లక్షల 13 వేల టన్నుల ఉత్పత్తిని సాధించాల్సి ఉండగా, కోటి 41 లక్షల 6 వేల 285 టన్నులు సాధించి 90 శాతం ఉత్పాదక రేటును నమోదు చేసుకుంది. మొన్నటివరకు మండుతున్న ఎండలు, తాజాగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రతికూల పరిస్థితులుగా మారి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తున్నాయి.

బిజెపి హయాంలోనే దళితుల సంక్షేమం

హైదరాబాద్, జూలై 1: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దళితుల సంక్షేమం పట్ల కట్టుబడి ఉన్నదని బిజెపి అనుబంధ విభాగమైన ఎస్‌సి మోర్చా జాతీయ అధ్యక్షుడు దుష్యంత్ సింగ్ గౌతమ్ అన్నారు. శుక్రవారం ఇక్కడి బిజెపి కార్యాలయంలో జరిగిన రాష్ట్ర ఎస్‌సి మోర్చా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ బిజెపి హయాంలోనే దళితుల సంక్షేమం జరుగుతుందని అన్నారు. పార్టీ ఎంపీల్లో ఎక్కువ సంఖ్యలో ఎస్‌సి, ఎస్‌టిలు ఉన్నారని ఆయన తెలిపారు. దళితులే పార్టీకి పునాది అని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ దళితుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని ఆయన వివరించారు.

ఎంపిక పరీక్ష విధానం ఖరారు

హైదరాబాద్, జూలై 1: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఉన్న ఖాళీల భర్తీకి ఎంపిక పరీక్ష ప్యాటర్న్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. గ్రూప్స్ తరహాలో ఎంపిక పరీక్ష విధానాన్ని మార్చేసింది. రెసిడెన్షియల్ స్కూళ్లలోని 2444 పో స్టులను పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో టీచర్లు, లెక్చరర్లు, ప్రిన్సిపాల్‌లు, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టులు కూడా ఉన్నాయి. టీచర్ పోస్టులకు రెండు దశల్లో పరీక్ష జరుగుతుంది. తొలి దశ పరీక్షలో జనరల్ స్టడీస్ పరీక్ష ఉంటుంది. అందులోనే జనరల్ ఎబిలిటీ, ఆంగ్లభాషా ప్రావీణ్యంపైనా ప్రశ్నలుంటాయి.

40వేల మంది గైర్హాజరు

హైదరాబాద్, జూలై 1: తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు జరుగుతున్న కౌనె్సలింగ్‌లో ఇంత వరకూ 1,04,500 మంది హాజరుకావల్సి ఉన్నా కేవలం 63777 మంది మాత్రమే హాజరయ్యారు. ఎమ్సెట్‌లో 1,04,500 మంది అర్హత సాధించారు. 80వేల ర్యాంకు వరకూ 50,563 మంది హాజరుకాగా, 80001 నుండి 92000 ర్యాంకు వరకూ కేవలం 6953 మంది హాజరయ్యారు. 92001 ర్యాంకు నుండి 1,04,500 ర్యాంకు వరకూ 6631 మంది హాజరయ్యారు. అంటే కేవలం సర్ట్ఫికేట్ల పరిశీలనకే 40723 మంది గైర్హాజరయ్యారు. వెబ్ ఆప్షన్లలో కూడా సర్ట్ఫికేట్ల పరిశీలనకు హాజరైన వారంతా దరఖాస్తు చేస్తారనే నమ్మకం కూడా లేదని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ జైళ్లలో 518 మంది భారతీయులు

ఇస్లామాబాద్/న్యూఢిల్లీ, జులై 1: మన దేశానికి చెందిన 463 మంది మత్స్యకారులు సహా మొత్తం 518 మంది ఖైదీలు పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్నారు. వీరి జాబితాను పాకిస్తాన్ శుక్రవారం భారత్‌కు అందజేయగా, మన జైళ్లలో ఉన్న పాక్ ఖైదీల జాబితాను భారత అధికారులు దాయాది దేశానికి అందజేశారు. దౌత్య వ్యవహారాలకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా ఇరు దేశాలు ఈ జాబితాలను ఇచ్చి పుచ్చుకున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఇఎ) ఒక ప్రకటనలో వెల్లడించింది.

షీనాపై కూర్చుని గొంతు నులిమింది

ముంబయి, జులై 1: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. 2012 ఏప్రిల్ 24వ తేదీన తాము కారులో వెళ్తున్నప్పుడు షీనా తల్లి ఇంద్రాణీ ముఖర్జియా తన కుమార్తెపై కూర్చుని ఆమె గొంతు నులిమిందని ఈ కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ శ్యామవర్ రాయ్ ఆరోపించాడు. ఆ సమయంలో తాను షీనా నోరు మూయగా, ఇంద్రాణీ మాజీ భర్త సంజీవ్ ఖన్నా ఆమెను గట్టిగా పట్టుకున్నాడని రాయ్ 12 పేజీల వాంగ్మూలంలో వెల్లడించాడు. ఇంద్రాణీ ఆదేశాల మేరకే తాము ఈ హత్యకు సహకరించామని రాయ్ చెప్పాడు.

Pages