S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒలింపిక్స్‌కు వికాస్!

పారిస్, జూన్ 11: భారత బాక్సర్ వికాస్ క్రిషన్ రియో ఒలింపిక్స్ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసు కున్నాడు. అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య ఆధ్వ ర్యంలో జరిగిన ప్రో బాక్సింగ్ ఫైట్‌లో అతను కె న్యాకు చెందిన నిక్సన్ అబాబాను 3-0 తేడాతో ఓ డించాడు. ఈ ఫైట్‌లో పాల్గొనడం ద్వారా అతను వచ్చేనెల వెనెజులాతో జరిగిన ఒలింపిక్స్ చివరి క్వాలిఫయర్‌లో పోటీ పడేందుకు అర్హత సంపా దించాడు. కాగా, ఈనెల 16 నుంచి అజర్‌బైజా న్‌లో జరిగే క్వాలిఫయర్‌కు ఆదివారం రాత్రి బయ లుదేరనున్న వికాస్ శనివారం కీలక విజయాన్ని సాధించడం విశేషం. ఈ విజయంతో అతను ఒ లిపిక్స్‌లో పాల్గొనే అర్హతను దాదాపుగా సంపాదిం చుకున్నాడు.

తెలుగు చంద్రుల తప్పటడుగులు

ఎంత తెలివిగలవారైనా ఒక్కోసారి తప్పులు చేస్తుంటారు. అపరచాణక్యులుగా పేరున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులయిన చంద్రబాబు, చంద్రశేఖర్‌రావు ఇటీవలి కాలంలో వేసిన అడుగులు చూసిన వారికి, వెంటనే ఇలాంటి అభిప్రాయమే ఏర్పడుతుంది. తెలంగాణలో కోదండరామ్, ఏపిలో ముద్రగడ రోడ్డెక్కిన వైనానికి తెలుగు చంద్రుల తొందరపాటుతనమే కారణమనిపిస్తుంది.

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144

ఘటనల సుడిగుండంలో మేధావులు

చిన్నపిల్లవాడు మారాం చేస్తాడు. ఇవ్వలేని దానిని తెచ్చి ఇవ్వమని అడుగుతాడు. ఇన్నాళ్లు తనది అనుకున్న వస్తువు పరులపాలైపోతుంటే గింజుకుంటాడు. 3‘గీ’2 పెడతాడు. కేకలేస్తాడు. అప్పుడు పెద్దలు తెలివిగా వాడి దృష్టిని మరలుస్తారు. అలా మరల్చడానికి అబద్ధాలు చెబుతారు. ఐనా ఏడుస్తాడు. ఏడ్చి ఏడ్చి వాడు అలసిపోతాడు. పెద్దలు వాడిని పక్కదారి పట్టించే ప్రయత్నాలు అనేకం చేస్తారు. తల్లిదండ్రులే కాదు. అమ్మమ్మలూ తాతయ్యలు ఈ విషయంలో అందరూ ఒకటవుతారు. పాపం వాడికి ఇతర బాధిత పిల్లలు ఎవరూ సహాయానికి రారు. రాలేరు. వాడు ఒంటరి అవుతాడు. ఎదిగే చిన్న దేశం సామ్రాజ్యవాద దేశాల కూటమి వలలో విలవిలలాడినట్టు.

మేధావికి కోపమొచ్చింది!

‘‘పినాకిని వాళ్ల అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది. హైదరాబాద్‌లో మూడు వందల గజాల ప్లాట్, పాతిక లక్షల కట్నం ఇస్తున్నారట!’’
‘‘అమ్మాయి అందవికారంగా ఉంటుందా? కాలం మారి చాలా కాలం అయింది. అమ్మాయిలే అబ్బాయిలను రిజెక్ట్ చేస్తున్నారు. మన కాలంలో అబ్బాయి కట్నం వద్దంటే ఏదో లోపం అనుకునే వాళ్లు. ఇప్పుడు అమ్మాయికి భారీ కట్నం ఇస్తే ఏదో లోపం అనుకుంటున్నారు.’’
‘‘మళ్లీ కన్యాశుల్కం వస్తుందేమో’’
‘‘మేధావుల చర్చ విసుగేసి సినిమా చానల్స్‌లో కన్యాశుల్కం మళ్లీ వస్తే చూశా’’
‘‘చిన్నపిల్లలు మేధావులు ఒక్కటే వారికి ఎప్పుడూ తృప్తి ఉండదు. స్థిరంగా ఉండరు. వారికేం కావాలో వారికే తెలియదు’’

ప్రాణ హాని ఎవరికి?

రాష్ట్ర ప్రభుత్వం నుంచి తనకు ముప్పుందని ఒకరు.. తెలంగాణ ఉద్యమ నేతకు రక్షణ కల్పించాలంటూ మరొకరు.. కాగా హైకోర్టును ఆశ్రయించడం, ప్రభుత్వానికి విన్నవించే సంఘటనలు విస్మయాన్ని కల్గిస్తున్నాయి. టిఆర్‌ఎస్ ప్రభుత్వం నుంచి తనకు ముప్పు ఉందంటూ కేంద్ర భద్రత కల్పించాలని ప్రతిపక్ష టిడిపి నేత రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధనకు ముందున్న రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌కు రక్షణ కల్పించాలని నిరుద్యోగ జెఎసి డిమాండ్ చేసింది. ఒకరిది భద్రత, మరొకరికి ప్రాణహాని..ఏదైతే నేం, వీరిద్దరిది ఒకే దారి. ప్రొఫెసర్ కోదండరాంపై అధికార టిఆర్‌ఎస్ ముప్పేట దాడికి దిగింది.

ఎలిఫెంట్ బోయ్

1930లలో హాలీవుడ్ బాల తారలకు పెద్ద పీట వేస్తున్న దశలో ‘సాబు దస్తగిర్’ అనే భారతీయ బాలుడు వెండితెరకు పరిచయమయ్యాడు. రాబర్ట్ ఫ్లాహెర్టి తన ‘ఎలిఫెంట్ బోయ్’ సినిమా కోసం అనే్వషిస్తున్న సమయంలో మైసూర్ మహారాజు ఏనుగుశాలలో పని చేసే ‘సాబు’ కనిపించాడు. అతన్ని యు.కె. ఇమ్మిగ్రేషన్‌లో ‘సాబు దస్తగిర్’గా నమోదు చేయడం జరిగింది. ‘ఎలిఫెంట్ బోయ్’ సంచలనం సృష్టించింది. 1963లో అంటే అతను తన 39వ ఏట మరణించేదాకా ‘ఎలిఫెంట్ బోయ్’గానే గుర్తుండిపోయాడు. సాబు తక్కువ చిత్రాలలో నటించినా జంగిల్ హాలీవుడ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు.

-పి.వి.

ఒంటరి సాక్షి

టిమోథీ వాట్‌కిన్స్ తన మిత్రుడి ఇంటి తలుపు తట్టాడు. లోపలికి వచ్చిన టిమోథీని చూసి తలుపు తీసిన మార్కో అడిగాడు.
‘ఏమిటంత నీరసంగా ఉన్నావు? ఏమైంది?’
ఐతే తన మిత్రుడు టిమోథీ విచారంగా కనిపించడం మార్కోకి ఆనందానే్న కలిగించింది.
‘ఇంత అర్ధరాత్రి అకస్మాత్తుగా వచ్చావేమిటి?’ మార్కో మళ్లీ ప్రశ్నించాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి

క్రూర సంస్కృతి

జపాన్‌లో కొన్ని వందల ఏళ్ల క్రితం సమురాయ్‌లు, అంటే యుద్ధ వీరులు ఉండేవారు. వారి ప్రవర్తన ఎంతో క్రూరంగా ఉండేది. వారి క్రూరత్వంలోని కొన్ని పార్శ్వాలు ఇవి.
తమిషిగిరి, అంటే ప్రయోగాత్మకంగా నరకడం అని అర్థం. తమ కొత్త కత్తి ఎంత పదునుగా ఉందో తెలుసుకోడానికి వారు కొనబోయే ముందు దాన్ని శిక్ష అనుభవించే ఖైదీల మీద ప్రయోగించేవారు. ఆ కత్తివేటుకి చేసిన నేరం స్థాయినిబట్టి ఖైదీ తన శరీరంలోని ఓ భాగాన్ని కోల్పోయేవాడు. ఒకోసారి ఖైదీని ఒకే వేటుతో అడ్డంగా నరికేవారు. ఒకోసారి సమురాయ్ తరఫున అతని మనిషి ఈ పని చేసేవాడు.

పద్మజ

వసంతంలో గ్రీష్మం ( మనోగీతికలు)

నోరూరించే
మామిడి పిందెలూ!
విరబూసే వేప పూలు!
శృతి పేయంగా
కోకిలల కుహుకుహూ రావాలు...
ఇవన్నీ! ఒకప్పటి వసంత సంకేతాలు!
ఇప్పుడో!
కుటిల కులమత రాజకీయాలు
భూకబ్జాలూ! కాల్ మనీలూ!
ఇసుక మట్టి మాఫీయాలూ!
లక్షల కోట్ల అవినీతి భాగోతాలూ!
బడాదొరల
బ్యాంకు రుణాలు ఎగవేతలూ!
యాసిడ్ దాడులూ, భ్రూణహత్యలూ!
యూనివర్శిటీ రాజకీయాలూ!
ఇలా ఒక్కటేమిటి! అన్నిటా
గ్రీష్మమే గాని వసంతం మచ్చుకైనా లేదు
అందుకే పైన కర్మ సాక్షి కూడా
వసంతంలో గ్రీష్మాన్ని కురిపిస్తున్నాడు!
నిప్పులు చెరుగుతున్నాడు

విరహాగ్ని (గజల్)

పుచ్చపువ్వు మోము యనుచు పూజిస్తానని సఖుడా!
దూరవౌచుడుర పిల్లుచు వేధిస్తావేమి సఖుడా!

అమ్మనాన్న మాట కొరకు అగ్నిలోన ముంచే వానను సఖుడా!
కమ్మనైన ప్రేమగ్రోల ఆనాడేమైంది సఖుడా!

నటన జేయుచున్నానని నాకూ కష్టమని సఖుడా!
నలుగు పిండితోన నీవు నలమహారాజు వయ్యావట

దిగులు గుబులు లేక పెండ్లి జరుపుకునే ఓ సఖుడా!
తన స్పర్శ, తన చూపులు, తన మాటలు విను సఖుడా!

మన వలపులు మన తలపులు మట్టిలోన కలుపు సఖుడా!
రమ గాయం మానదింక కాలానే్న వేడునింక
కన్నీళ్లను తుడుచుకుంటూ మట్టిద ఓ సఖుడా!

- బిహెచ్‌వి రమాదేవి
రాజమహేంద్రవరం, సెల్: 9441599321

- బిహెచ్‌వి రమాదేవి రాజమహేంద్రవరం, సెల్: 9441599321

Pages