S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెస్సీ హ్యాట్రిక్

చికాగో, జూన్ 11: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ చెలరేగి హ్యాట్రిక్ సాధించగా, పనామాపై 5-0 ఆధిక్యంతో విజయభేరి మోగించిన అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిపత్యాన్ని కొనసాగించిన అర్జెంటీనా చివరి వరకూ ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్ ఏడో నిమిషంలోనే నికోలస్ అటామెండీ చేసిన గోల్‌తో అర్జెంటీనా ఖాతా తెరిచింది. ఆతర్వాత అర్జెంటీనా డిఫెన్స్‌కు పరిమితం కావడంతో ప్రథమార్ధం ముగిసే సమయానికి మరో గోల్ నమోదు కాలేదు. ద్వితీయార్ధం ప్రారంభంలోనూ రక్షణాత్మక విధానాన్ని అనుసరించిన అర్జెంటీనా తర్వాత వ్యూహాన్ని మార్చింది.

జ్ఞాపకాల్లో మనిషి

కాలం క్రమంగా
గమిస్తోంది
రోడ్డు రోలరులా
దొర్లుతోంది
తనకేం మిగుల్చుకోదు
అయినా
తాను పొరలిన గుర్తుల్ని
సైతం వదిలేస్తోంది
చదును చేస్తోంది
సమం చేస్తోంది
భూమి గాయాల్ని
మాన్పివేస్తోంది

-వాసాల నరసయ్య

రాహుల్ ‘రికార్డు’ సెంచరీ

హరారే, జూన్ 11: కెరీర్‌లో తొలి వనే్డ ఆడిన లోకేష్ రాహుల్ ‘రికార్డు’ సెంచరీతో రాణించగా, ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు సాధించడంతో, జింబాబ్వేతో శనివారం జరిగిన మొదటి వనే్డలో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. జింబాబ్వేను కేవలం 168 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా ఆతర్వాత లక్ష్యాన్ని మరో 45 బంతులు మిగిలి ఉండగానే, కేవలం ఒక వికెట్ నష్టపోయి ఛేదించింది. యజువేంద్ర చాహల్, కరుణ్ నాయర్, లోకేష్ రాహుల్ అరంగేట్రం చేసిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

మన్ కీ బాత్

వేదిక మీద స్వంత గోడు అగ్నిపర్వతం బద్దలయ్యింది
లావా హాలంతా వ్యాపిస్తోంది!
వృద్ధులు, పురుషులు, స్ర్తిలు, చిన్నపిల్లలతో సహా
హాల్లో అందరికీ చెవుల గొంతులు ఎండిపోతున్నాయి
ఒక్కటంటే ఒక్క చుక్క మంచి మాటల నీరు లేదు
ఒక్కటంటే ఒక్క చుక్క అర్థమయ్యే మాట, అర్థవంతమైన మాట లేదు
చెవుల నోళ్లు పిడచ గట్టుకుపోతుంటే
ఆ పై వాడు పట్టించుకోడు
గుండెలు తపతప కొట్టుకుంటున్నాయి
ఆవేదన పడుతున్నాయి అలసిపోతున్నాయి
జనం కోసం, సమాజం కోసం
ఒక్కటంటే ఒక్క చల్లటి మాట
జనం దాహం తీర్చే ఊట, ఏదీ? ఎక్కడ?

-దేవరాజు మహారాజు 9908633949

మానసిక ప్రాంగణంలో దివ్యాగ్ని రాజిల్లాలి!

పరమాత్మ అంటే దివ్యత్వ లోగిలి... అద్వితీయ స్థితి... అదృశ్య ప్రాంగణం... అమృత చైతన్య వాహిని.. మాయాతీతం.. పరంజ్యోతి... జ్ఞాన స్వరూపం.. జ్ఞాన గమ్యం.. జ్ఞేయం.. ఖగోళ స్థితులకు, భౌగోళిక స్థితులకు మూలం.. సకల జీవరాశికి, ఆత్మజీవులకు పుట్టిల్లు... చరాచర హృదయ స్థితం.. అందుకే ఈ పారలౌకిక అవిభక్త స్థితిని ‘బీయింగ్’ అంటుంటాం.

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946

సైనా ఫైనల్‌కు.. శ్రీకాంత్ ఇంటికి..

సిడ్నీ, జూన్ 11: ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ఫైనల్ చేరగా, పురుషుల సింగిల్స్ సెమీస్‌లో కిడాంబి శ్రీకాంత్ ఓటమిపాలై నిష్క్రమించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ ఇహాన్ వాంగ్ (చైనా)తో సెమీ ఫైనల్‌లో తలపడిన సైనా 21-18, 21-12 తేడాతో విజయం సాధించి, ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ను అందుకునే దిశగా మరో అడుగు ముందుకేసింది. రియో ఒలింపిక్స్ సమీపిస్తున్న సమయంలో సైనా మళ్లీ ఫామ్‌లోకి రావడం విశేషం. ఇటీవల కాలంలో కాలి గాయంతో బాధపడుతూ పలు టోర్నీలకు దూరమైంది. మళ్లీ ఫిట్నెస్‌ను సంపాదించిన ఆమె ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ టోర్నీలో ఫైనల్ చేరింది. టైటిల్ కోసం ఆమె సన్ యూను ఢీ కొంటుంది.

పేస్‌కే ఎఐటిఎ ఓటు..

న్యూఢిల్లీ, జూన్ 11: తెలుగు వీరుడు సాకేత్ మైనేనీకి రియో ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం చేతికి అందినట్టే అంది జారిపోయింది. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) సాకేత్‌ను పక్కకుపెట్టి, వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్‌వైపే మొగ్గుచూపింది. రియోలో తనకు భాగస్వామిగా సాకేత్ ఉండాలని కోరుతూ ఎఐటిఎకు రోహన్ బొపన్న లేఖ రాసిన విషయం తెలిసిందే. సహజంగా మేజర్ టోర్నీల్లో భాగస్వామి ఎవరు ఉండాలనేది ఆటగాళ్లకే విడిచిపెడతారు. ఈ కారణంగానే పేస్ కంటే సాకేత్ మెరుగైన అభ్యర్థిగా బొపన్న అభిప్రాయపడ్డాడు. అతనిని ఒలింపిక్స్‌లో తన డబుల్స్ భాగస్వామిగా ఎంపిక చేయాలని ఎఐటిఎను కోరాడు. కానీ, అతని అభ్యర్థనను టెన్నిస్ సంఘం పట్టించుకోలేదు.

స్విస్‌ను గెలిపించిన షార్ గోల్

పారిస్, జూన్ 11: యూరో 2016 ఫుట్‌బాల్‌లో భాగంగా అల్బేనియాతో జరిగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ 1-0 తేడాతో గెలిచింది. ఫాబియాన్ షార్ ఈ కీలక గోల్‌ను సాధించి, స్విస్‌ను విజయ బాటలో నడిపించాడు. మ్యాచ్ ఆరంభమైన మరుక్షణమే దూకుడుగా ఆడిన స్విస్‌కు ఐదో నిమిషంలోనే షార్ గోల్ సాధించిపెట్టాడు. ఆధిక్యాన్ని సంపాదించిన మరుక్షణం స్విస్ జట్టు పూర్తి డిఫెన్స్‌తో ముందుకు సాగాలని నిర్ణయంచింది. పకడ్బందీ వ్యూహంతో ఆడి, అల్బేనియాను నియంత్రీకరించి, విజయం సాధించింది.

పాయెట్ సూపర్ గోల్

పారిస్, జూన్ 11: యూరో 2016 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఫ్రాన్స్ శుభారంభం చేసింది. దిమిత్రీ పాయెట్ కీలక సమయంలో అద్భుతమైన గోల్ సాధించి రుమేనియాపై ఫ్రాన్స్‌కు విజయాన్ని సాధించిపెట్టాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ ప్రథమార్ధంలో ఫ్రాన్స్ విజృంభణకు రుమేనియా సమర్థంగా అడ్డుకట్ట వేసింది. ఇరు జట్ల ఆటగాళ్లు గోల్స్ కోసం తీవ్ర స్థాయిలో పోటీపడ్డారు. ఒకరి ప్రయత్నాలను మరొకరు అడ్డుకోవడంతో ఫస్ట్ఫా ముగిసే సమయానికి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ద్వితీయార్ధంలో ఫ్రాన్స్ గోల్‌ను సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డింది. 57వ నిమిషంలో ఆలివర్ గిరాండ్ ద్వారా గోల్ లభించడంతో ఊరిపి పీల్చుకుంది. అయితే, ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు.

‘చాంపియన్స్’లో భారత్ బోణీ

లండన్, జూన్ 11: చాంపియన్స్ ట్రోఫీ హాకీ టో ర్నీలో భాగంగా జర్మనీతో జరిగిన తొలి మ్యాచ్‌ని డ్రా చేసుకున్న భారత జట్టు శనివారం నాటి రెండో మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్‌ను 2-1 తేడాతో ఓడించింది. మ్యాచ్ 17వ నిమిషంలో మన్‌దీప్ సింగ్ చేసిన గో ల్‌తో 1-0 ఆధిక్యాన్ని సంపాదించిన భారత్‌కు 34వ నిమిషంలో హర్‌మన్‌ప్రీత్ సింగ్ రెండో గోల్ సా ధించిపెట్టాడు. దీనితో ఎదురుదాడికి దిగిన బ్రిటన్ 35వ నిమిషంలో ఆష్లే జాక్సన్ ద్వారా గోల్‌ను సం పాదించింది. ఆతర్వాత వ్యూహత్మకంగా ఆడిన భా రత్ ప్రత్యర్థిని నిలువరించి గెలిచింది. కాగా, బ్రిటన్ తన మొదటి మ్యాచ్‌ని ఆస్ట్రేలియాతో డ్రా చేసుకుం ది.

Pages