S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలోచనొచ్చింది.. ఆకారం మారింది

న్యూఢిల్లీ/టోక్యో, జూన్ 11: మారుతున్న వ్యాపార ఆలోచనలు.. సాగుబడి విధానాలను కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. రవాణాకు అనువైనట్లుగా పంట రూపురేఖలను మార్చేస్తున్నారు మరి. విదేశాల్లో ముఖ్యంగా జపాన్‌లో వివిధ రకాల పండ్లు, కూరగాయలను అనేక ఆకృతుల్లో పండించి ఔరా అనిపిస్తున్నారు అక్కడి వ్యవసాయ శాస్తవ్రేత్తలు, రైతులు. ఏదైనా పండు, కూరగాయల పేరు చేబితే టక్కున దాని రూపం మన మదిలో మెదులుతుంది. కానీ ఆ రోజులు పోయాయిప్పుడు. గుండ్రంగా కాకుండా చతురస్రాకారంలో పండిస్తున్నారు. పుచ్చకాయ, యాపిల్, కర్బూజ పండ్ల ఆకారాలు డబ్బాల మాదిరిగా ఉంటున్నాయి. నారింజతోపాటు మరికొన్ని పండ్ల రూపాలనూ మార్చేశారు. దీనికి కారణం మెరుగైన రవాణానే.

కరపత్రాలు (స్ఫూర్తి)

సచ్ఛీంద్ర పక్కింటి ఆయనకి ఓ ఫర్నిచర్ దుకాణం ఉంది. ఆయన ఓ రోజు సచ్ఛీంద్రని అడిగాడు.
‘నీకు వేసవి సెలవులు కదా? ఉద్యోగస్థులకి బదిలీ అయే సమయం ఇది. నాకో పని చేసి పెడతావా? నీకు కొంత డబ్బిస్తాను’
‘ఏమిటది?’
‘రోజూ సాయంత్రం ఐదున్నర నించి ఆరున్నర దాకా సెంటర్‌లో నిలబడి నేను ఇచ్చే కరపత్రాలని ఆ దారిలో వెళ్లే పెద్దవాళ్లకి ఇవ్వాలి. వారానికి రెండు వందల ఏభై రూపాయలు ఇస్తాను’
సచ్ఛీంద్ర అందుకు ఒప్పుకున్నాడు.
‘నేను మీ నాన్న అనుమతి కూడా తీసుకున్నాక పనిలోకి వెళ్దువుగాని’ ఆయన చెప్పాడు.
సచ్ఛీంద్ర తల్లితో ఎక్సయిటింగ్‌గా పక్కింటి ఆయన చెప్పింది చెప్పాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి

మెర్రీగో రౌండ్ విధానంతో బొగ్గు రవాణా

హైదరాబాద్, జూన్ 11: కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్‌టిపిసికి మెర్రీగో రౌండ్ రైలు మార్గం ద్వారా మరో 35 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసేందుకుగానూ ఒప్పందం జరిగింది. సికిందరాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్త సమక్షంలో ఎన్‌టిపిసి, సింగరేణి, రైల్వేశాఖ ఉన్నతాధికారులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. మెర్రీగో రౌండ్ విధానంలో బొగ్గు రవాణాపై జరిగిన ఈ ఒప్పందం దేశంలోనే ప్రప్రథమమని అధికారులు పేర్కొన్నారు. రామగుండం ఏరియాలోగల ఎన్‌టిపిసి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సింగరేణి బొగ్గు సరఫరా చేస్తోంది.

ప్రయాణం మరింత సౌకర్యం

న్యూఢిల్లీ, జూన్ 11: విమాన ప్రయాణ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక మార్పులను ప్రతిపాదించింది. ప్రయాణీకులకు ఊరటనిస్తూ తీసుకున్న ఈ నిర్ణయాలను శనివారం ఇక్కడ పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఓ విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. భారత్‌కు చెందిన విమానయాన సంస్థలు నడిపే దేశ, విదేశీ విమాన సర్వీసులకు మార్పులు వర్తిస్తాయని ప్రకటించారు. నిరుడు 63,400 విమానాలు ఆలస్యంగా నడవడం, 4 వేలకుపైగా విమానాలు రద్దవడంతో ప్రయాణీకుల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఇలా జరిగితే ఇకపై ప్రయాణీకులకు విమానయాన సంస్థలు 20,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని రాజు స్పష్టం చేశారు.

ఎడ్వర్డ్ జెన్నర్ (ప్రముఖ శాస్తవ్రేత్తలు)

మశూచికి మందు కనిపెట్టిన జెన్నర్ బాలబాలికల పాలిట దేవుడని చెప్పవచ్చు. కుక్కకాటు, క్షయ, కలరా, కామెర్లు, మలేరియా, కేన్సర్ల వంటి వ్యాధులకు పూర్వం సరైన మందులు లేవు. మశూచి వ్యాధి ప్రపంచమంతా భయంకరంగా వ్యాపించి ఉండేది. ఇంగ్లండ్‌కు చెందిన ఎడ్వర్డ్ జెన్నర్ అనే మహనీయుడు ఈ స్మాల్‌ఫాక్స్ వ్యాధి సోకకుండా ఉండటానికి వ్యాధి నిరోధక ‘వాక్సినేషన్’ మందు కనిపెట్టి మానవాళికి ఎంతో మేలు చేశాడు.

-పి.వి.రమణకుమార్

ఆయుర్వేదము

ఆయుర్వేదానికి, ధన్వంతరి ఆదిదేవుడు. ఆయన ఒక చేతిలో ఆయుర్వేద ప్రతులను, మరో చేత్తో ఔషధ మొక్కలను పట్టుకొని ఉంటాడు. ధన్వంతరీ భక్తుడైన చరకుడు ‘చరకసంహిత’ అనే వైద్యశాస్త్ర గ్రంథాన్ని రచించి ప్రపంచ ప్రఖ్యాతిని పొందాడు. ఆయుర్వేదం అన్నది దీర్ఘకాలం జీవించటం కోసం పొందుపరచిన జ్ఞానం. ఇది భారతదేశానికి చెందిన సంప్రదాయక వైద్యశాస్త్రం. ఇది ప్రత్యామ్నాయ వైద్యానికి ఒక రూపం. ఆయుర్వేదానికి సంబంధించి రాసిన తొలి సాహిత్యం వేదకాలం నాటిది. అంటే క్రీ.పూ.2వ సహస్రాబ్ద మధ్యకాలం అన్నమాట.

-బి.మాన్‌సింగ్ నాయక్

ఐడిబిఐ బ్యాంక్ రుణాల ఎగవేత కేసు

ముంబయి, జూన్ 11: ‘కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్’గా వెలుగొందిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు బ్యాడ్ టైమ్స్ మొదలయ్యాయి. దేశీయ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మాల్యాకు.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నుంచి దెబ్బ పడింది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐ బ్యాంక్ రుణ ఎగవేత కేసులో శనివారం 1,411 కోట్ల రూపాయల విలువైన (మార్కెట్ విలువ ప్రకారం) మాల్యా, యుబి లిమిటెడ్ ఆస్తులను ఇడి జప్తు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం క్రింద ఈ ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు.

వరుస లాభాలకు బ్రేక్

ముంబయి, జూన్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం నష్టాలపాలయ్యాయి. వరుసగా రెండు వారాలపాటు లాభాల్లో కొనసాగిన సూచీలు గడచిన వారం మాత్రం నిరాశపరిచాయి. అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య మదుపరుల ఊగిసలాటతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 207.28 పాయింట్లు క్షీణించి 26,635.75 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 8,200 స్థాయికి దిగువన 50.75 పాయింట్లు పడిపోయి 8,170.05 వద్ద నిలిచింది.

నేను సైతం (కథ)

డాక్టర్ విశాల్ తన ఛాంబర్‌లో కూర్చున్నాడు. ఆ రోజు పెద్ద గాలివాన ఉన్నందువల్ల ఛాంబర్ రూమ్‌లకు ముందున్న వెయిటింగ్ హాల్ పూర్తిగా ఖాళీగా ఉంది.
డ్రాయర్ తాళాలు తీసి అందులోంచి రెండు బంగారు గాజులు తీశాడు. వాటినే తదేకంగా చూస్తున్నాడు.
సన్నగా ఉన్నా ఒక్కో గాజు కనీసం ఇరవై ఐదు వేలైనా ఉంటుంది.
రెండు గాజులూ యాభై వేలు.
అతని కళ్లల్లో ఒక్క వెలుగు.
సరిగ్గా ఆరునెలల క్రితం...
మాధవి ఛేంబర్‌లోకి వచ్చింది. ఆమె ముఖంలో ఆతృత. ‘డాక్టర్‌గారు స్కాన్ చేయాల’ని అంది.
‘ఏంటమ్మా?’
‘ఇప్పుడు నాకు మూడో నెల’
‘అయితే’
‘రొటీన్ చెకప్ డాక్టర్’
‘ఇది ఎన్నో కాన్పు?’

-ఎస్.ఎస్.శాస్ర్తీ

...నేటి మనిషి!

రుణభారం ఎక్కువై
దానిని తీర్చలేనప్పుడు
రుణదాతల కంటపడకుండా
తప్పించుకుని తిరుగుతూండటం
మనిషి నైజం!
వేరు జన్మలు ఉన్నాయో, లేవో
తెలియకుండానే
ఎన్నో జన్మలకు సరిపడేంతగా
తమ సంతానానికి ఎంతో సేవ చేస్తూ,
కాపాడుతూ, పెంచి పోషిస్తూ
ఎంతెంతగానో ప్రేమను
పంచిపెడుతూ కూడా
ప్రతిఫలాపేక్ష లేని
కరుణామృతమయ మహాదాతలు
కన్న తల్లిదండ్రులు!
పండుటాకు వయస్సులో
తమ సంతానం నుండి
తమకు కొంత మమత, సానుభూతీ,
పిడికెడన్నమూ తప్ప
మరేమీ కోరుకోరు వీరు!
సంతానం తమనెంత కష్టపెట్టినా
భరిస్తూ కూడా

-రఘువర్మ 9290093933

Pages