S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటీమణుల కబడ్డీ

టాలీవుడ్‌లో నటీమణుల కబడ్డీ నిర్వహిస్తున్నామని విక్రం ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు కె.విక్రమాదిత్య తెలిపారు. దాదాపు 35మంది నటీమణులతో తొలిసారిగా కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ ఆలోచన కొత్తగా వుండడంతో టీవీ ఆర్టిస్టులు కూడా ఈ పోటీలో పాల్గొననున్నారని, జూలై నెలలో ఈ కార్యక్రమం జరుగుతుందని కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ పోటీలలో తానూ పాల్గొనడం ఆనందంగా వుందని, మంచి పేర్లతో టీమ్‌లను తయారుచేస్తున్నామని, ఝాన్సీ లక్ష్మీభాయి, రాణీ రుద్రమదేవి, మాంచాల, రజియా సుల్తానా వంటి పేర్లు పరిశీలిస్తున్నామని నటి కవిత తెలిపారు.

సిద్ధమైన 4జి

ఉదయ్, చంద్రకళ, సన్ని, సునంద ప్రధాన తారాగణంగా శ్రీ సాయి లక్ష్మీ మూవీస్ పతాకంపై శ్రీనివాస్ కరణం దర్శకత్వంలో కె.వి.వినోద్‌రెడ్డి రూపొందించిన చిత్రం ‘4జి’. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో వున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ కరణం మాట్లాడుతూ, బెంగుళూరులో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందిందని, ప్రేమలో పడిన నలుగురు యువతులు ఆ ప్రేమతో ఎటువంటి సమస్యలు, కష్టాలు కొనితెచ్చుకున్నారు అనే కథనంతో ఈ చిత్రం సాగుతుందని తెలిపారు.

ఉత్కంఠ రేపే అంతం

రేష్మి గౌతమ్ ప్రధాన పాత్రలో జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ రూపొందించిన ‘అంతం’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. శ్రీ లక్ష్మీ పిక్చర్స్ పతాకంపై బాపిరాజు ఈ సినిమాకు సంబంధించిన హక్కులను తీసుకున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ‘ఎ’ సర్ట్ఫికెట్ పొందిన ఈ చిత్రం ఈనెలాఖరుకు విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత కళ్యాణ్ మాట్లాడుతూ ఇప్పటివరకూ రాని ఓ వెరైటీ కథనంతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో అప్పుడే పెళ్లిచేసుకున్న అందమైన జంట జీవితంలోకి అనుకోని సంఘటనలు ఎదురైతే వారు ఏం చేశారు అనేదే ఈ సినిమా కథనమని తెలిపారు.

దండుపాళ్యం-2 షూటింగ్ పూర్తి

దండుపాళ్యం తెలుగు, కన్నడ భాషల్లో విడుదలై సంచలనం సృష్టించింది. బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధి, మకరంద్ దేశ్‌పాండే, రవికాలె ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన తొలి భాగం దాదాపు 30 కోట్లు వసూలు చేసి చిన్న చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందని దర్శకుడు శ్రీనివాసరాజు తెలిపారు. వెంకట్ మూవీస్ పతాకంపై శ్రీనివాస్‌రాజు దర్శకత్వంలో రూపొందుతున్న ‘దండుపాళ్యం-2’ చిత్రం తొలి భాగానికి సీక్వెల్‌గా చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్యాచ్‌వర్క్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

అమెజాన్ యోధులు వస్తున్నారు!

హాలీవుడ్‌లో ఫ్రాంకీచాన్ దర్శకత్వంలో జాకీచాన్ ఇండో ఓవర్సీస్ పతాకంపై రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం ‘అమెజాన్ యోధులు’. 500 కోట్ల బడ్జెట్‌తో హైటెక్నికల్ విలువలతో రూపొందించిన ‘ది లెజండరీ అమెజాన్’ చిత్రాన్ని తెలుగులో సాయి శ్రీజ విఘ్నేష్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై జి.వంశీకృష్ణ వర్మ ‘అమెజాన్ యోధులు’ పేరుతో అనువదించారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, భారీ సెట్టింగ్స్, భారీ విజువల్స్‌తో గ్రాండియర్‌గా సాగే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశామని, మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు.

టిడిపి రాష్ట్ర కార్యాలయంలో లోకేష్ సందడి

గుంటూరు: నగరంలో కొత్తగా నిర్మించిన టిడిపి రాష్ట్ర కార్యాలయాన్ని ఆ పార్టీ యువనేత నారా లోకేష్ తొలిసారిగా గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యాలయంలోని పలు విభాగాలను సందర్శించి పార్టీ నేతలకు లోకేష్ కొన్ని సూచనలు చేశారు.

క్రమశిక్షణారాహిత్యాన్ని క్షమించరాదు: మల్లు రవి

హైదరాబాద్: పార్టీలో క్రమశిక్షణారాహిత్యానికి ఎవరు పాల్పడినా క్షమించరాదని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. సిఎల్‌పి నాయకుడు జానారెడ్డిని కోవర్టు అని ఎంపీ పాల్వాయి గోవర్ధనరెడ్డి అనడం క్రమశిక్షణా రాహిత్యమేనని అన్నారు. పాల్వాయికి షోకాజ్ నోటీసు ఇచ్చే విషయాన్ని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చూసుకుంటారని రవి చెప్పారు. నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగితే పార్టీ పట్ల ప్రజల్లో తప్పుడ సంకేతాలు వెళతాయన్నారు. కాగా, పాల్వాయికి షోకాజ్ నోటీసు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

విశాఖ బీచ్‌లో యువకుడు గల్లంతు

విశాఖ: ఇక్కడి కోస్టల్ బ్యాటరీ వద్ద స్నానం చేసేందుకు గురువారం మధ్యాహ్నం సముద్రంలో దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. అలల వేగానికి కొట్టుకునిపోయిన ఆ యువకుడి ఆచూకీ కోసం గజఈతగాళ్లు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు.

గ్లోబల్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోండి

హైదరాబాద్: నగరంలో నిఖిల్‌రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఎత్తు పెరగాలని అనవసర శస్తచ్రికిత్స చేసిన గ్లోబల్ ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని బిజెపి నేతలు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు ఫిర్యాదు చేశారు. ఎత్తుపెరగాలని ఆరాటపడతున్న నిఖిల్‌రెడ్డి కాళ్లకు కొద్దిరోజుల క్రితం గ్లోబల్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. ఈ వ్యవహారమై భారతీయ వైద్య మండలి కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు బిజెపి నేతలు తెలిపారు. అంతకుముందు వారు ఆస్పత్రిలో నిఖిల్‌రెడ్డిని పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు.

అరెస్టులు జరగవని హామీ ఇవ్వలేదు: తోట

విజయవాడ: కాపు విధ్వంసకాండకు సంబంధించి ఎలాంటి అరెస్టులు జరగవని ఎపి ప్రభుత్వం ఎపుడూ ఎవరికీ హామీ ఇవ్వలేదని టిడిపి ఎంపీ తోట త్రిమూర్తులు గురువారం మీడియాతో అన్నారు. అయితే, అలా హామీ ఇచ్చినట్టు కాపునాయకుడు ముద్రగడ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కాపుల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి ముద్రగడ సహకరించాలన్నారు. ఉద్యమాలు జరిగినపుడు అరెస్టులు, కేసులు షరామామూలేనని ఆయన వ్యాఖ్యానించారు.

Pages