S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చత్తీస్‌గఢ్‌లో మావోల మెరుపుదాడి

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని రణ్‌పాల్ అటవీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి దాటాక ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ శిబిరంపై సుమారు వందమంది మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. కాసేపటికి తేరుకున్న సాయుధ జవాన్లు కూడా మావోలపై కాల్పులు జరిపారు. ఇరుపక్షాల మధ్య చాలాసేపు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో కొందరు జవాన్లు, మావోలు గాయపడ్డారని సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

భారత్‌కు మోదీ తిరుగు ప్రయాణం

మెక్సికో: అయిదు దేశాల్లో పర్యటన ముగిసిన అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం మెక్సికో నుంచి భారత్‌కు బయలు దేరారు. ఈ నెల 4న ఆయన విదేశీ పర్యటనకు బయలుదేరి ఆఫ్ఘనిస్థాన్, ఖతార్, అమెరికా, స్విట్జర్లాండ్, మెక్సికోలో పర్యటించారు. ఆయా దేశాల అధినేతలతో దౌత్యపరమైన చర్చలు జరిపి పలు ఒప్పందాలను ఖరారు చేశారు. అమెరికాలో అత్యున్నత చట్టసభలో ఆయన మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు ఒబామాతో భేటీ అయ్యారు.

మోదీ కారు డ్రైవర్‌గా మెక్సికో అధ్యక్షుడు!

మెక్సికో : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బుధవారం రాత్రి మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత మెక్సికో సిటీలోని ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్ళారు. అప్పుడు కూడా ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి మెక్సికో అధ్యక్షుడే స్వయంగా కారు నడుపుతూ మోదీని రెస్టారెంట్‌కు తీసుకెళ్ళారు. ఆ రెస్టారెంట్‌లో ఇద్దరూ శాకాహార భోజనం చేశారు.

అలహాబాద్‌లో టైంబాంబ్ స్వాధీనం

అలహాబాద్‌ : ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో గురువారం ఉదయం టైంబాంబ్‌ను పోలీసులు సీజ్ చేశారు. రైల్వేస్టేషన్ వేబ్రిడ్జ్ సమీపంలో ఈ బాంబును గుర్తించారు.

ఎర్రచందనం వాహనాలు స్వాధీనం

నెల్లూరు : నెల్లూరు జిల్లా తడ పోలీసులు తమిళనాడుకు ఎర్రచందనం తరలిస్తున్న రెండు వాహనాలను గురువారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. 35 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాలను సీజ్‌ చేసి తడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వాహనంలోని వ్యక్తులు పరారయ్యారు.

జూలై 11 నుంచి రైల్వే కార్మికుల సమ్మె

సికింద్రాబాద్‌: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ భారతీయ రైల్వే సహా అనుబంధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జూలై 11 నుంచి సమ్మె బాట పట్టనున్నారు. ఉద్యోగ సంఘాలు గురువారం సమ్మె నోటీసు అందజేశాయి. దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్ల జనరల్‌ మేనేజర్లకు ఎక్కడికక్కడ సమ్మె నోటీసులు అందజేశారు. భారతీయ రైల్వేలో 42 ఏళ్ల తర్వాత సమ్మె సైరన్‌ మోగనుంది.

ప్రభుత్వానికి ముద్రగడ సహకరించాలి: బాబు

కడప: కాపు కులస్థుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సహకరించాలని సిఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఎవరో చెప్పిన మాటలు వినకుండా కాపుల ప్రగతి గురించి ముద్రగడ ఆలోచించాలన్నారు. కాపులకు రిజర్వేషన్ల కోసం కమిషన్‌ను నియమించామని, కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు. ‘కాపులకు ఏమీ చేయని వైఎస్ రాజశేఖరరెడ్డి దేవుడయ్యాడా? అన్నీ చేస్తున్న నేను విరోధినయ్యానా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ఉద్యమం ముసుగులో రైళ్లను, పోలీస్ స్టేషన్లను తగులబెడితే ప్రజలకు ఎవరు భద్రత కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు.

ముద్రగడ దీక్షకు జగన్ డైరెక్షన్!

ఒంగోలు: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష ప్రారంభించడం వెనుక వైకాపా అధినేత జగన్ ప్రమేయం ఉందని ఎపి కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. చీటికీ మాటికీ దీక్షలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకునేందుకు ముద్రగడ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ చెప్పినట్లు నడస్తూ ముద్రగడ కాపు కులస్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు.

పోలీసులు ఇంట్లోకొస్తే పురుగుమందు తాగుతా: ముద్రగడ

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి అరెస్టు చేసిన వారిని తక్షణం విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం గురువారం ఉదయం కిర్లంపూడిలోని తన ఇంట్లో సతీసమేతంగా ఆమరణ దీక్ష ప్రారంభించారు. తనను అరెస్టు చేయడానికి పోలీసులు బలవంతంగా ఇంట్లోకి ప్రవేశిస్తే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఆయన హెచ్చరించారు. చేతిలో పురుగుమందు డబ్బా చూపుతూ, కాపుల కోసం ఆత్మత్యాగానికి తాను సిద్ధమేనని అన్నారు. ఇంటి తలుపులు వేసుకుని గదిలో ఆయన ఆమరణ దీక్ష ప్రారంభించారు. కాపు ఉద్యమకారులపై కేసులు ఎత్తివేస్తామని గతంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా అరెస్టులు చేయడం అన్యాయమన్నారు.

కృష్ణాడెల్టాకు నీటి విడుదల

నాగార్జునసాగర్, జూన్ 8: నాగార్జునసాగర్ జలాశయం నుండి ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా కృష్ణాడెల్టాకు బుధవారం నాడు సాగర్ డ్యాం అధికారులు నీటిని విడుదల చేశారు. బుధవారం ఉదయం 8గంటలకు 3,500క్యూసెక్కులను ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా విడుదల చేశారు. ప్రస్తుతం 7వేల క్యూసెక్కులు కృష్ణాడెల్టాకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయంలో ప్రస్తుతం 506.50అడుగుల నీటిమట్టం ఉంది. కృష్ణా నది నీటి వినియోగంలో నీటిపంపకాలలో ఇప్పటికే ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.

Pages