S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతి భద్రతల పరిరక్షణకు రూ. 350కోట్లు

షాద్‌నగర్/కొందుర్గు, జూన్ 9: తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు సిఎం కెసిఆర్ 350కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. గురువారం కొందుర్గు మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి నర్సింహరెడ్డి మాట్లాడుతూ శాంతిభద్రతలను పరిరక్షించేందుకు సిఎం కెసిఆర్ పెద్దపీట వేయడం జఠిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 550పోలీస్ స్టేషన్లకు కొత్తవాహనాలను ఇవ్వడం జరిగిందని, అలాగే హైద్రాబాద్, వరంగల్ పట్టణాలకు సాంకేతిక పరిజ్ఞానంతో కలిగి వాహనాలను ఇచ్చినట్లు పేర్కొన్నారు.

నామినెటేడ్ పోస్టుల భర్తీ షురూ

మహబూబ్‌నగర్, జూన్ 9: ముఖ్యమంత్రి కెసి ఆర్ నామినెటేడ్ పదవులను ఒక్కోక్కటిగా భర్తికి శ్రీకారం చుట్టారు. నామినెటేడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కావడంతో జిల్లాలో ఆశవహుల ఆశలు ఫలించబోతున్నాయి. గత నెలరోజుల క్రితం దేవరకద్ర మార్కెట్ కమిటీకి కార్యవర్గాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఎట్టకేలకు జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ మార్కెట్ కమిటీ కార్యవర్గాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం సాయంత్రం మహబూబ్‌నగర్ మార్కెట్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పదవులు దక్కిన నేతలు ఆనందంతో ఉబ్బితబ్బిబైపోతున్నారు.

పలుచోట్ల మోస్తరు వర్షం

మహబూబ్‌నగర్, జూన్ 9: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు ఓ మోస్తారు వర్షం కురిసింది. అందులో భాగంగా కల్వకుర్తి మండలంలో దాదాపు మూడు గంటల పాటు ఎడతెరపిలేని భారీ వర్షం కురిసింది. దీంతో కల్వకుర్తి పట్టణంలో రోడ్లన్ని జలమయమైయ్యాయి. భారీ వర్షంతో మండలంలోని వివిధ గ్రామాల్లో చెరువుల్లోకి నీరు వచ్చి చేరింది. అదేవిధంగా వెల్దండ, ఆమనగల్లు, మిడ్జిల్ మండలాల్లో కూడా ఓ మోస్తారు వర్షం కురిసింది. జడ్చర్ల మండలంలోని కొన్ని గ్రామాల్లో జల్లులు కురిశాయి. దేవరకద్ర, దన్వాడ, మక్తల్ ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది.

ఆర్టీసీలో మోగిన ఎన్నికల నగారా

మహబూబ్‌నగర్, జూన్ 9: ఆరీసీలో కార్మిక సంఘాల ఎన్నికల నగారా మొగింది. దింతో కార్మికుల్లో సందడి నెలకొంది. ఎన్నికల నగరా మొగడంతో ఆర్టీసీ కార్మికులను ఎవరిని తట్టిన ఎన్నికలపైనే జోరుగా చర్చజరుగుతుంది. ఎప్పుడేప్పుడా అంటూ కార్మికులు ఎదురుచూస్తున్న గుర్తింపు సంఘం ఎన్నికలకు కార్మిక శాఖ ఈ నెల 6న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వచ్చే నెల జూలై 19న ఎన్నికలు నిర్వహించేందుకు కార్మిక శాఖ అధికారికంగా ప్రకటన వెలువరించడంతో జిల్లాలోని ఆర్టీసీ కార్మికుల్లో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. జిల్లాలోని ప్రధాన సంఘాల నాయకులు ఎన్నికలపై ప్రత్యేక దృష్టి కేంద్రికరించారు. ఆర్టీసీలో 2012 డిసెంబర్ 22న గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి.

ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న బాబు

కొడంగల్, జూన్ 9: గతంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు చంద్రబాబు అడ్డుతగిలారని ప్రాజెక్టు కోసం మళ్లీ అడ్డుతగులుతున్నారని చంద్రబాబు నాయుడుపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిప్పులు చెరిగారు. గురువారం కోస్గి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గతంలో పాలించిన ఆంధ్రా పాలకుల వల్ల తెలంగాణ రాష్ట్రం దగాపడిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధ్ది పర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే పొరుగున్న ఉన్న చంద్రబాబునాయుడు అడ్డుతగలడం సరైంది కాదన్నారు.

ప్రైవేటు పాఠశాలలపై అధికారుల దాడులు

అయిజ, జూన్ 9: పట్టణంలో ప్రైవేటు పాఠశాలలపై గురువారం అధికారులు, ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు నిబంధనలు వర్తింపచేసేందుకు జిఓ నెం.42ను జారీ చేయగా ఏరియా పాఠశాలలపై నిఘా ఉంచింది. ఉదయం పలు ప్రైవేటు పాఠశాలలో పాఠ్యా పుస్తకాలను విద్యార్థులకు విక్రయిస్తుండగా నిఘా పెట్టి పట్టుకోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

విత్తనాల ప్యాకెట్లలో తేడాలు!

గద్వాల, జూన్ 9: ఖరీఫ్ సీజన్ మొదలుకావడంతో ప్రైవేటు విత్తన విక్రయదారులు రైతన్నలను దగా చేసేందుకు నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నారు. గత ఖరీఫ్‌లో పత్తి, ఆముదం, మిరప నకిలి విత్తనాలతో పట్టుబడినప్పటికి అధికారుల పర్యవేక్షణ కొరవడింది.

ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.35వేల కోట్లు

కొందుర్గు, జూన్ 9: మహబూబ్‌నగర్ జిల్లాలోని భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 35వేల 200కోట్ల రూపాయలను సిఎం కెసిఆర్ కేటాయించడం జరిగిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం కొందుర్గు మండల కేంద్రంతో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మించేందుకు సిఎం కెసిఆర్ అడుగులు ముందుకు వేస్తుంటే ప్రతిపక్ష పార్టీల నాయకులు అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.

రైతు సమస్యలపై ప్రత్యేక శ్రద్ద్ధ

పెబ్బేరు, జూన్ 9: రైతుల సమస్యలుపరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద్ధ వహిస్తుందని భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ వనజా దేవి అన్నారు. గురువారం తిప్పాయిపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు భూసమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, గతంలో ఎన్నడూ లేని విధంగా సాదా బైనామాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలో భూములకు సంబంధించిన 26దరఖాస్తులను రైతులు ఆమెకు వినిపించారు. 13దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించి, 13 ఇంకా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలి

ఆమనగల్లు, జూన్ 9: జిల్లాల విభజన ప్రక్రియలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గంలో రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ఆమనగల్లు జడ్పిటిసి హరిప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఆమనగల్లు ఎంపిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రాష్ట్రంలో జిల్లాల విభజన ప్రక్రియ వేగవంతం చేయడంతో ప్రజలు హర్షిస్తున్న పరిపాలన సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు చేరువ అయ్యే రెవెన్యూ డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కల నిజమైయ్యే పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయని అఖిలపక్ష సమావేశంలో తమ అభిప్రాయాన్ని చెబుతామని అన్నారు.

Pages