S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరభద్రసింగ్‌ను ప్రశ్నించిన సిబిఐ

దిల్లీ: అక్రమాస్తులకు సంబంధించి సిబిఐ అధికారులు గురువారం ఇక్కడ జరిపిన విచారణకు హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ హాజరయ్యారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాచారం అందజేశారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న అభియోగంపై వీరభద్రసింగ్, ఆయన భార్య ప్రభావతితో పాటు మరికొందరిపైనా కేసులు దాఖలయ్యాయి. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరుపుతోంది.

బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలి: కారెం

విజయనగరం: జూన్‌ నెలాఖరులోగా బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ ఆదేశించారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఢిల్లీ కార్పొరేషన్లో కొట్టుకున్న కౌన్సిలర్లు

ఢిల్లీ : ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ సమావేశంలో గురువారం గందరగోళం నెలకొంది. ఆప్‌, బీజేపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. పలువురు కౌన్సిలర్లకు గాయాలు అయ్యాయి. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని ఆప్‌ సభ్యులు ఆరోపించారు. బీజేపీ సభ్యులే తమను ముందు కొట్టారని ఆరోపించారు.

కూలిన రష్యా యుద్ధ విమానం

మాస్కో: యుద్ధ విమానం మాస్కో సమీపంలో గురువారం కుప్పకూలడంతో పైలట్‌ మరణించాడని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కూలిన సమయంలో అందులో ఆయుధాలు ఏమీ లేవని, కూలిన చోట ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

ఆరిజోనా అడవుల్లో మంటలు

ఆరిజోనా : అమెరికాలోని ఆరిజోనా అడవుల్లో గురువారం కార్చిచ్చు చెలరేగింది. సమీప ప్రాంతంలో వందల మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2013లోనూ ఇదే ప్రాంతంలో మంటలు చెలరేగడంతో 19 మంది మరణించారు.

ముద్రగడ పద్మనాభం అరెస్టు

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి అరెస్టు చేసిన వారిని తక్షణం విడిచి పెట్టాలని డిమాండ్ చేస్తూ కిర్లంపూడిలోని తన ఇంట్లో ఆమరణ దీక్షకు దిగిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను గురువారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆయనను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు ముద్రగడ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని రాజమండ్రికి తరలించారు. ఆ తర్వాత ముద్రగడ ఇంట్లోకి ప్రవేశించి ఆయనను అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ముద్రగడ అరెస్టు తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తూర్పు గోదావరి జిల్లాలో అప్రమత్తమయ్యారు.

కెసిఆర్ క్షమాపణలు చెప్పాలి: హరగోపాల్

హైదరాబాద్: ప్రభుత్వ పాలనలో లోపాలను ఎత్తిచూపినందుకు తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరామ్‌పై తెరాస మంత్రులు మూకుమ్మడిగా దాడి చేయడం సరికాదని పౌరహక్కుల సంఘం నేత హరగోపాల్ అన్నారు. మంత్రులు ఇష్టారాజ్యంగా మాట్లాడినందుకు సిఎం కెసిఆర్ క్షమాపణలు చెప్పాలన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. కోదండరామ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు.

ఎపిలో రుతురాగం ప్రారంభం

విశాఖ: ఎపిలో నైరుతి రుతుపవనాలు గురువారం ప్రవేశించాయి. దీంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, అనంతపురం, కడప జిల్లాల్లో పాక్షికంగా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పూర్తి స్థాయిలో రుతుపవనాలు ప్రవేశించాయి. రెండు రోజుల్లో మిగతా జిల్లాల్లోనూ ఇవి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఎపిలో 22న రెండో విడత రుణమాఫీ

విజయవాడ: ఎపిలో రైతులకు రెండో విడత రుణమాఫీ కింద 3,500 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని సిఎం చంద్రబాబు గురువారం ఇక్కడ జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ప్రకటించారు. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రుణమాఫీ మొత్తాలను జమ చేస్తారు. నగదును ఖాతాల్లోనే ఉంచితే పది శాతం వడ్డీ చెల్లిస్తామన్నారు.

బోనాల పండుగకు విస్తృత సన్నాహాలు

హైదరాబాద్: జంట నగరాల్లో జరిగే బోనాల పండుగకు విస్తృత ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం సచివాలయంలో జరిగిన సమావేశంలో బోనాలకు సన్నాహాలపై సమీక్షించారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దనరెడ్డి పాల్గొన్నారు.

Pages