S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

13న వైకాపా మేధోమథనం

హైదరాబాద్, జూన్ 8: అనంతపురం జిల్లాలో నిర్వహించిన రైతు భరోసా యాత్రకు వచ్చిన విశేష స్పందనతో కదం తొక్కుతున్న వైకాపా శ్రేణులకు మార్గనిర్దేశనం చేసేందుకు, వచ్చే మూడేళ్ల పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించాలని వైకాపా అధ్యక్షుడు జగన్ నిర్ణయించారు. ఈ నెల 13వ తేదీన విజయవాడలో మేధోమథనం పేరిట విస్తృత స్థాయి సదస్సును నిర్వహించాలని ఆయన పార్టీ రాజకీయ సలహా కమిటీని ఆదేశించారు.

దీక్షపై కలవని దారులు

హైదరాబాద్, జూన్ 8: తుని ఘటనలో అమాయకులయిన వారిపై కేసులు ఎత్తివేయకపోతే గురువారం నుంచి ఆమరణ దీక్ష చేపడతానని కాపునాడు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన అల్టిమేటమ్‌పై కాపు సామాజికవర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో దీక్షకు మద్దతివ్వకపోతే స్థానికంగా తమ మనుగడ ఏమిటన్న దానిపై కాపు వర్గానికి చెందిన మంత్రులు, టిడిపి ఎమ్మెల్యేలు సందిగ్ధంలో పడ్డారు. ముద్రగడ దీక్ష నేపథ్యంలో అటు పోలీసులు కాపులపై కనే్నసి, వారి కదలికలను గమనిస్తున్నారు.

ఏం ఒరగబెట్టారని రెండేళ్ల పండుగ?

హైదరాబాద్, జూన్ 8: ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను ఎన్నింటిని నెరవేర్చారని, రెండేళ్ల పాలనను పండుగగా చేసుకుంటున్న రాష్ట్రప్రభుత్వం తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైకాపా డిమాండ్ చేసింది. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ రుణాలను మాఫీ చేశారా అని ప్రశ్నించారు. టిడిపి అధికారంలోకి వచ్చేసరికి రూ. 87612 కోట్లు ఉన్న వ్యవసాయ రుణాలు మర్చిపోయి గత రెండేళ్లలో పట్టుమని 9 వేల కోట్ల రుణాలను కూడా తీర్చలేదన్నారు.

సాగునీటి సంఘాలపై నివేదిక ఇవ్వండి

హైదరాబాద్, జూన్ 8: ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తమ పద్ధతుల్లో సాగునీటి సంఘాలను నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, కర్నాటక, ఒడిశాలో ప్రతి వంద హెక్టార్లకు ఒక సాగునీటి సంఘం ఉందని, అదే ఆంధ్రాలో 1600 హెక్టార్లకు ఒక సాగునీటి సంఘం ఉందని ఏపి ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వైకాపాకు చెందిన ఎమ్మెల్యే కోన రఘుపతి సాగునీటి సంఘాలకు రాష్ట్రప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది.

ఫలించనున్న దశాబ్దాల కల

మహబూబ్‌నగర్, జూన్ 8: మహబూబ్‌నగర్ జిల్లా రైతుల దశాబ్దాల కల త్వరలోనే నెరవేరనుంది. జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా జొన్నలబోగుడ, గుడిపల్లిగట్టు ఎత్తిపోతల పథకాలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. పనులు చివరి దశల్లో ఉండడంతో జూలై నెలాఖరు నాటికి రెండు లిఫ్టులను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఖరీఫ్‌లోనే 1.50 లక్షల ఎకరాలకు కృష్ణాజలాల ద్వారా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

పాలమూరు ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయండి

హైదరాబాద్, జూన్ 8 : మహబూబ్‌నగర్ జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం, బీమీ లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పనులను రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఆయన సమీక్షించారు. జూలై 31 వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో 4,50,000 ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉందన్నారు. ఈ కారణంగానే పనులు కొనసాగుతున్న లిఫ్ట్‌లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వివిధ పనులు చివరి దశలో ఉన్న ప్రాజెక్టుల పరిధిలో భూమి కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుకండి

హైదరాబాద్, జూన్ 8 : తెలంగాణలో పరిశ్రమలతో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి మంత్రి కె. తారకరామారావు కోరారు. వివిధ కంపెనీల్లో ఉన్నతస్థాయిలో పనిచేస్తున్న 40 మంది సక్సెస్‌ఫుల్ తెలంగాణ ఎన్నారైలతో బుధవారం ఆయన సిలికాన్ వ్యాలీలోని ఒక తెలంగాణ ఎన్నారై కంపెనీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ ఎన్‌ఆర్‌ఐలను ఆయన కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో తెలంగాణ ఎన్నారైలను భాగస్వాములను చేయాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. తమ ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం, టిహబ్, ఐటి పాలసీల గురించి మంత్రి వవరించారు.

విభజన దిశగా పోలీస్ కమిషనరేట్

హైదరాబాద్, జూన్ 8: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను రెండుగా విభజించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్‌ను రెండు జోన్లుగా విభజించే ప్రక్రియ వేగవంతమైంది. కొత్తగా ఏర్పాటయ్యే జోన్లలో సరిహద్దు జిల్లాలనూ చేర్చేందుకు కసరత్తు జరుగుతోంది. సైబరాబాద్‌ను వెస్ట్‌జోన్, ఉప్పల్ కేంద్రంగా ఈస్ట్‌జోన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ప్రభుత్వానికి తగు ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తోంది. విస్తరిస్తున్న నగరం, ఐటి కారిడార్, పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాల నేపథ్యంలో శాంతిభద్రతల పర్యవేక్షణ కీలకంగా మారింది.

ఎన్నికల హామీలు గాలికొదిలేశారు

అనంతపురం/కడప/కర్నూలు, జూన్ 8: ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో వైకాపా నాయకులు కేసులు నమోదుచేశారు. అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కేసులు నమోదయ్యాయి. అనంతలో జరిగిన జరిగిన రైతు భరోసాయాత్రలో జగన్ సిఎంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో జగన్‌పై టిడిపి శ్రేణులు కేసులు పెట్టాయి. దీనికి ప్రతిగా వైకాపా నాయకులు బుధవారం సిఎంపై కేసులు రెండు సెక్షన్లు, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఫిర్యాదు చేశారు.

చట్టాన్ని ధిక్కరిస్తే చర్యలు తప్పవు

అమలాపురం, జూన్ 8:చట్టాన్ని ధిక్కరించినవారిపై చర్యలు తప్పవని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముద్రగడ తీరుపై చినరాజప్ప నిప్పులు చెరిగారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తున్నారని, ఇతర బీసీలకు నష్టం లేకుండా చట్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందోని ఆయన అన్నారు. కాపులు, కాపు యువత అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. రిజర్వేషన్లపై మంజునాథ్ కమిషన్, కాపు కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు కేటాయించామన్నారు.

Pages