S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరోగ్యానికి ఆల్‌బుకరా

పెద్ద రేగుపండు వలే నిగనిగలాడుతూ కనిపించే ఆల్‌బుకరా పండు సీజన్‌లో మాత్రమే లభిస్తుంది. దీన్ని ప్లమ్ అంటారు. ప్లమ్‌కేక్‌లో ఈ పండు వాడతారు. ఎండిన ఆల్‌బుకరా పండు డ్రైఫ్రూట్‌గా వాడతారు. తాజా పళ్ళు ఎరుపు రంగులో ఉండి, రుచిగా ఉంటాయి. డ్రైఫ్రూట్ గోధుమ రంగులో వుంటుంది. దీనిలోపలి గింజ బాదంను పోలి వుంటుంది. ఈ పండ్లలో పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఎ, బి6, సి, కెలు, స్వల్పంగా కొవ్వు, పీచు పదార్థం, కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం, భాస్వరం, పోలెట్స్ లాంటివి లభిస్తాయి. ఆల్‌బుకరా పండ్లు ఆరోగ్యానికే కాక ఔషధపరంగా కూడా ఉపయోగిస్తాయి.

- కె.నిర్మల

నేను.. శైలజ దర్శకుడితో.. నితిన్

హీరో నితిన్ తాజాగా నటించిన ‘అ ఆ’ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తన కెరీర్‌పై బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన అ ఆతో మరింత ఉత్సాహం తెచ్చుకున్న నితిన్, తదుపరి చిత్రానికి కూడా సన్నాహాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘నేను శైలజ’ దర్శకుడు కిషోర్ తిరుమల కథకు ఓకె చెప్పాడని టాలీవుడ్ సమాచారం. కిషోర్ తిరుమలతో సినిమా చేయనున్నట్లు కొద్దికాలం క్రితమే నితిన్ ప్రకటించిన నేపథ్యంలో తాజాగా అన్నీ కుదరడంతో ఈ చిత్రం సెట్స్‌పైకి తీసుకెళ్ళేందుకు సిద్ధమయ్యాడు. నితిన్ సొంత స్వంత శ్రేష్ఠమూవీస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నారు.

తెలుగు తెరపై పంజాబీ భామ

పరాయి భాషా కథానాయికలకు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలిగిపోవాలని కోరిక వుండడం సహజమే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు భామలు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు. ఇప్పుడు మరో పంజాబీ భామ టాలీవుడ్‌కి పరిచయం కానుంది. ‘అందాల రాక్షసి’ కథానాయకుడు నవీన్ చంద్ర, సంజీవ్‌కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘బుర్రకథ’ చిత్రంలో కథానాయికగా రోనికా సింగ్‌ను ఎంపిక చేశారు. చండీగఢ్ నుండి వచ్చిన రోనికా సింగ్ అక్కడ కొన్ని పంజాబీ చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. రమ్తజోగి చిత్రంలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది.

నరేష్ సరసన కృతిక

కొంత గ్యాప్ తీసుకున్న తరువాత అల్లరి నరేష్ ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా మారనున్నాడు. దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డితో భారీ చిత్రాన్ని, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌తో ఓ చిన్న సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రంలో ‘వినవయ్యా రామయ్యా’ కథానాయికగా నటించిన కృతికా జయకుమార్‌ని ఎంపిక చేశారు. కృతికా జయకుమార్ ‘దృశ్యం’ చిత్రంలో వెంకటేష్ కూతురిగా నటించిన సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్‌లో వైవిధ్యంగా రూపొందుతున్న ఈ సినిమా కోసం ‘మా ఇంట్లో వుంది దెయ్యం నాకెందుకు భయం’ అన్న టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. త్వరలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

నవ్వుల విందుతో ఎంత పని చేసావే

ఓవర్సీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘ఎంతపని చేశావే శిరీషా’. శివరామకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పట్లూరి బాలకృష్ణ, రామ్‌ప్రసాద్ పోతుకానూరి, శ్రీకాంత్ కానల నిర్మాతలు. మహత్ రాఘవేంద్ర కథానాయకుడు. పునర్నవి భూపాలం కథానాయిక. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో బుధవారం ఉదయం జరిగింది. బ్యానర్ లోగోను తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పి.రాంమోహన్ విడుదల చేశారు. టైటిల్ లోగోను అనిల్ సుంకర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ అనిల్ సుంకర తీసిన ఈ సినిమా హిట్ కావాలని కోరుకున్నారు.

శాతకర్ణి హీరోయిన్ శ్రీయ

నందమూరి బాలకృష్ణ 100 చిత్రంగా తెరకెక్కుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ చిత్రంలో శాతకర్ణి భార్య వాసిష్ఠ పాత్రకు హీరోయిన్ శ్రీయను ఎంపిక చేశారు. తొలుత నయనతారను తీసుకోవాలని భావించినా, ఆమె డేట్స్ కుదరకపోవడంతో దర్శకుడు క్రిష్ శ్రీయను ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలో జరిగే మూడోషెడ్యూల్‌లో శ్రీయ షూటింగ్‌లో పాల్గొననుంది. శ్రీయ గతంలో బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో వున్న బాలకృష్ణ, ఈనెల 10న తన పుట్టినరోజు వేడుకను అభిమానులతో జరుపుకోనున్నారు.

అందరికీ నచ్చే ప్రేమకథ

ఐ వింక్ ప్రొడక్షన్స్‌లో డైరెక్టర్ వినోద్ లింగాల తెరకెక్కించిన అందమైన ప్రేమకథా చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’ వెండితెర మీదకు రావడానికి సిద్ధమైంది. సాయిరోనక్, అతిది సింగ్, ఐశ్వర్య.కె, నోయల్ నేని, నవీన్ నేని ప్రధాన తారాగణంగా నటించారు. ఈనెలో 17న విడుదల కానున్న ఈ సినిమా గురించి దర్శకుడు బుధవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ‘మంచి ప్రేమకథా చిత్రాలకు ఎప్పుడూ సిల్వర్ స్క్రీన్‌మీద ఆదరణ ఉంటుంది. తాజాగా మా ‘గుప్పెడంత ప్రేమ’ కూడా అలాంటి ఉత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. ఈనెల 17న మా సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నాం.

- యు

రెడీ... యాక్షన్

చిరంజీవి 150వ చిత్రం తమిళ ‘కత్తి’ రీమేక్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 15నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో అనుష్కను కథానాయికగా అనుకున్న తరువాత పాటల చిత్రీకరణతో షూటింగ్ మొదలుపెట్టాలని చిరంజీవి, వి.వి.వినాయక్ భావించారు. కానీ ఇప్పుడు మరలా హీరోయిన్ ఎంపిక మొదటికి వచ్చేసరికి ఈ సినిమా షూటింగ్‌ను మొదట యాక్షన్ సీన్లతో ప్రారంభించి, ఆలోపు హీరోయిన్‌ని ఖరారు చేయాలని భావిస్తున్నారు. అయితే వీరి చూపు బాలీవుడ్ సుందరి దీపికా పదుకొనెపై పడింది. ఈ విషయం ఖరారు కావాల్సి వుంది.

జమున, కైకాలకు 12న ‘మా’ సన్మానం

‘పరిశ్రమలో సీనియర్ నటులను గౌరవించుకోవడం సంప్రదాయం. అది బాధ్యత కూడా. ఎక్కువకాలం సినీ పరిశ్రమకు సేవలు అందించిన సీనియర్‌లను ఎంపిక చేసి దశలవారీగా వారిని సత్కరించుకునేందుకు ఎజిఎమ్ మీటింగ్‌లను వేదికగా చేస్తున్నామని’ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాటి మేటి కథానాయిక జమున ఎంతో అనుభవమున్న సీనియర్ నటీమణి అని, ఎక్కువకాలం పరిశ్రమలో కథానాయికగా కొనసాగారని, నాటి తరంలో టాప్ హీరోయిన్‌గా వెలిగిన ఆమె, ఎన్టీఆర్, ఎఎన్నార్‌లవంటి స్టార్లకు సమకాలికులుగా గౌరవాన్ని పొందారని ఆయన తెలిపారు.

కథకన్నా కాంబినేషన్లకే ప్రాధాన్యం -నిర్మాత చంటి అడ్డాల

‘ఇప్పుడు నిర్మాతగా ఎన్ని కథలు విన్నా లాభం లేకుండా ఉంది. కాంబినేషన్లు సెట్ చేసుకున్న తరువాతే సినిమా చేయడం ఉత్తమం’ అని అంటున్నారు ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల. ‘ఆరోప్రాణం’ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన ఈయన ‘యముడికి మొగుడు (అల్లరి నరేష్)’, ‘అడవిరాముడు (ప్రభాస్)’ వంటి సినిమాల నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘ఐనా ఇష్టం నువ్వు’. నవీన్ విజయ్‌కృష్ణ, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా చంటి అడ్డాల చెప్పిన విశేషాలు..

-శ్రీ

Pages