S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్రోహశక్తులకు ముద్రగడ అండ: మంత్రి గంటా

కడప: కాపుగర్జన సందర్భంగా తుని వద్ద జరిగిన విధ్వంసకాండలో పాల్గొన్న విద్రోహశక్తులకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అండగా నిలుస్తున్నారని ఎపి మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ఆరోపించారు. విధ్వంసకాండకు బాధ్యులెవరో ముద్రగడ బహిర్గతం చేయాలన్నారు. అరెస్టులను అడ్డుకోవడం ద్వారా తన ఉనికిని కాపాడుకోవాలని తాపత్రయ పడడం సరికాదన్నారు. రౌడీషీటర్లు, నేరస్థులనే పోలీసులు అరెస్టు చేస్తుండగా, వారిని విడిచిపెట్టకుంటే ఆమరణ దీక్ష చేస్తానని ఆయన అనడం విడ్డూరంగా ఉందని గంటా విమర్శించారు.

నేడు కడపలో మహాసంకల్ప సభ

కడప: ఎపి సర్కారు చేపట్టిన నవ నిర్మాణ దీక్ష ముగింపు సందర్భంగా కడపలో బుధవారం సాయంత్రం జరిగే మహాసంకల్ప సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడి మున్సిపల్ మైదానంలో ప్రధాన వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకూ జరిగే సభలో సిఎం చంద్రబాబు, టిడిపి యువనేత లోకేష్, ఎపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు, పలువురు మంత్రులు, ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్, డిజిపి జెవి రాముడు తదితరులు పాల్గొంటారు. విఐపిలు వస్తున్నందున కడప ఎయిర్‌పోర్టుతో పాటు మున్సిపల్ మైదానంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఇండోనేషియాలో భూ ప్రకంపనలు

జకార్తా: ఇండోనేషియా ఉత్తర ప్రాంతంలోని మలుక్ ప్రావిన్స్‌లో బుధవారం ఉదయం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇంతవరకూ సమాచారం లేదు. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 6.4గా నమోదైందని, ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు తెలిపారు.

చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం

హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిన సోదరులచే చేప ప్రసాదం పంపిణీ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. చేప ప్రసాదం తీసుకునేందుకు ఎపి, తెలంగాణ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆస్తమా రోగులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రద్దీని నివారించేందుకు 32 కౌంటర్లను ఏర్పాటు చేసి ముందుగా టోకెన్లు ఇస్తున్నారు. సుమారు 1,500 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎగ్జిబిషన్ మైదానం వైపు ఈరోజు, రేపు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కోస్తాంధ్ర సమీపంలో ఉపరితల ఆవర్తనం

హైదరాబాద్‌: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇవాళ లేదా రేపు కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో నైరుతి వేగంగా విస్తరించే అవకాశముందని భావిస్తున్నారు

తిరుమల ఘాట్‌రోడ్డులో ప్రమాదం

తిరుమల: తిరుమల మొదటి ఘాట్‌రోడ్డు చివరి మలుపు వద్ద బుధవారం ఉదయం భక్తులు ప్రయాణిస్తున్న టెంపో పిట్టగోడను ఢీకొట్టింది. కర్ణాటకకు చెందిన నలుగురు చిన్నారులతో సహా 10 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

చేపమందు పంపిణీకి మూడంచెల బందోబస్తు

హైదరాబాద్, జూన్ 7: హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే చేప మందు పంపిణీ సందర్భంగా మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సెంట్రల్ జోన్ డిసిపి కమలాసన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేప మందుకోసం పలు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి భద్రత కల్పించే విధంగా తగు చర్యలు తీసుకున్నామని, 1200 మంది సిబ్బందితో గట్టి భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. బత్తిని సోదరుల ఆధ్వర్యంలో సుమారు నాలుగు లక్షల మందికి చేప మందు వేయనున్నారని, రెండు రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారని చెప్పారు.

రాష్ట్భ్రావృద్ధిలో రాజీలేదు

విశాఖపట్నం, జూన్ 7: అప్పు చేసైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. కష్టాలను ఎదుర్కొంటూ బాధ్యతలను మరవకుండా రాష్ట్భ్రావృద్ధికి దృఢసంకల్పంతో పనిచేస్తున్నామన్నారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలోని వైవిఆర్ మూర్తి ఆడిటోరియంలో మంగళవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు 49 వేల కోట్ల రూపాయలను సంక్షేమానికి కేటాయించామని గుర్తు చేశారు. ఆదాయం తక్కువ, సంక్షేమానికి, ఇతర అవసరాలకు ఖర్చులు ఎక్కువ ఉన్నా సంక్షేమానికి ప్రాధా న్యం ఇస్తున్నామన్నారు.

సీమలో వజ్రాల వేట

ఆదోని, జూన్ 7: వర్షాలు కురుస్తుండడంతో సీమలో వజ్రాల వేట ప్రారంభమైంది. వజ్రం దొరికితే తమ ఆదృష్టమే మారిపోతుందని జనం పొలాల వెంట పరుగులు తీస్తున్నారు. రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లా ఆదోని డివిజన్‌లోని జొన్నగిరి, తుగ్గలి, రాతన పెరవలి గ్రామాల్లో వజ్రాల వేట ముమ్మరమైంది. సూదూర ప్రాంతాల నుంచి కుటుంబాలకు కుటుంబాలు వలస వచ్చి ఇక్కడే మకాం వేసి వజ్రాల కోసం కళ్లు చాటంత చేసుకుని మరీ వెతుకుతున్నాయి. రోజు వర్షం కురుస్తుండడంతో ఏ పొలంలో చూసిన గుంపులుగుంపులుగా వజ్రల కోసం తిరిగే మహిళలు, పిల్లలు కనిపిస్తున్నారు. ఈ గ్రామాల్లో వజ్రాలవేట ప్రతినిత్యం కొనసాగుతోంది.

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు

విజయవాడ , జూన్ 7: వెనకబడిన వర్గాల వారికి రాజకీయ నాయకత్వం అప్ప చెప్తానని, అగ్ర వర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ కల్పించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నవ నిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు విజయాలు, రానున్న కాలానికి సన్నాహాలు, భవిష్యత్ కార్యాచరణపై అధికారులు, ప్రభుత్వం సాధించిన ప్రగతి భవిష్యత్ ప్రణాళికపై కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ అన్ని కులాల్లో పేదవారిని ఆదుకుంటామని, పేదలు లేని సమాజమే తమ లక్ష్యమన్నారు.

Pages