S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుని విధ్వంసాన్ని ఆ కోణంలో చూడొద్దు..

రాజమండ్రి: కాపుగర్జన సందర్భంగా ఇటీవల తుని వద్ద జరిగిన విధ్వంసకాండను నేరంగా చూడరాదని, అది జనసమూహం చేసిన చర్య అని కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ ఉద్యమానికి జనం మద్దతు ఉందన్నారు. వైకాపాను లక్ష్యంగా చేసుకుని తుని విధ్వంసకాండలో అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. కాపు కులానికి చెందిన రాష్ట్ర మంత్రి నారాయణ తన విద్యాసంస్థల్లో కాపు విద్యార్థులకు ఎలాంటి రాయితీలిస్తున్నారో ప్రకటించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.

బెనారస్ వర్సిటీలో విద్యార్థుల ఘర్షణ

లక్నో: యుపిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల మధ్య బుధవారం ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వామపక్ష విద్యార్థి సంఘాలు వర్సిటీలో ఏర్పాటుచేసిన సభకు జెఎన్‌యు (దిల్లీ) నుంచి విద్యార్థి సంఘ నేత షీలా రషీద్‌ను ఆహ్వానించడంపై ఎబివిపి కార్యకర్తలు అడ్డుతగిలారు. దీంతో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ ఏర్పడి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు వెంటనే కలుగజేసుకుని కొంతమందిని అరెస్టు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.

ప్రతి నియోజకవర్గానికీ ప్రగతి ప్రణాళిక

విజయవాడ: ప్రతి నియోజకవర్గానికీ నిర్దిష్టమైన అభివృద్ధి ప్రణాళికను రూపొందించి వార్షిక లక్ష్యాలను సాధించాలని ఎపి సిఎం చంద్రబాబు ఆదేశించారు. మహాసంకల్పం సందర్భంగా ఆయన బుధవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గత రెండేళ్ల కాలంలో పాలనను గాడిలోపెట్టి ఆర్థిక పురోగతిని సాధించామని, అన్ని గ్రామాలకూ విద్యుత్ సౌకర్యం అందించామని, ఏడాదిలోగా ప్రతి ఇంటికీ వంటగ్యాస్ కనెక్షన్ ఇస్తామన్నారు. ప్రతి ఇంటికీ తాగునీరు, ప్రతి పొలానికీ సాగునీరు అనే సిద్ధాంతం ప్రకారం ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

విశాఖలో పెనుగాలులతో భారీ వర్షం

విశాఖ: నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. పట్ట్భా గార్డెన్స్ ఏరియాలో గోడకూలి ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. పెనుగాలుల ధాటికి మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి.

టి.జెఎసిని బలోపేతం చేస్తాం:కోదండ

హైదరాబాద్: ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడేందుకు టి.జెఎసిని మరింత బలోపేతం చేస్తామని ఆ సంస్థ చైర్మన్ కోదండరామ్ బుధవారం ప్రకటించారు. జెఎసి సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ రంగాల్లో ఎన్నో సమస్యలు ప్రజలను వేధిస్తున్నట్టు తెలిపారు. వర్సిటీల్లో పాలన, ప్రైవేటు విద్యాసంస్థల్లో పోలీసుల తనిఖీలు, కరవు పరిస్థితులు, భూ నిర్వాసితుల బాధలు, బలవంతపు భూ సేకరణ, సింగరేణి బొగ్గుగనుల్లో ఓపెన్ కాస్టింగ్.. ఇలా అనేక సమస్యలతో తెలంగాణ ప్రజలు సతమతమవుతున్నారని ఆయన వివరించారు. జెఎసి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు, పాదయాత్రలు, ర్యాలీలు, సభలు జరిపి జనంలోకి వెళ్తామన్నారు.

కంటైనర్ దగ్ధం: ఒకరి మృతి

చిత్తూరు: కార్ల లోడుతో వెళుతున్న ఓ కంటైనర్ వాహనం కరంటు తీగలు తగిలి మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. యాదమరి మండలం ఇరువారం బైపాస్ రోడ్డులో బుధవారం ఈ ఘటన జరిగింది. మంటల్లో చిక్కుకుని ఒకరు మరణించగా మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

ఎపి సిఎంపై కడప ఎంపీ ఫిర్యాదు

కడప: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను దారుణంగా మోసగించారంటూ ఎపి సిఎం చంద్రబాబుపై కడప వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు ఇక్కడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని ఆయన ఆ ఫిర్యాదులో కోరారు.

తెలంగాణ వచ్చాక తెరాస ఎందుకు..?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెరాస ఎందుకని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ పార్టీ నేతలు ఏం సమాధానం చెబుతారని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. ఆయన బుధవారం ఇక్కడ మాట్లాడుతూ, జెఎసి చైర్మన్ కోదండరామ్ అడిగే ప్రశ్నలకు బదులివ్వడానికి బదులు ఆయనపై తెలంగాణ మంత్రులు మూకుమ్మడిగా దాడి చేయడం సరికాదన్నారు. ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేనివాళ్లు కూడా కోదండపై విమర్శలు చేయడం అర్థరహితమన్నారు. తెరాస నేతలకు, మంత్రులకు నిజాయితీ ఉంటే కోదండ అడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వాలన్నారు.

ప్రజల సంక్షేమమే ప్రధాన ఎజెండా: కోదండరామ్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేయాలన్నదే జెఎసి ప్రధాన ఎజెండా అని ఆ సంస్థ అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. తాను నలుగురికీ చెప్పగలిగే స్థితిలో ఉన్నానని, ఎవరి చేతో చెప్పించుకునే స్థితిలో లేనని ఆయన బుధవారం ఇక్కడ జెఎసి సమావేశంలో అన్నారు. విమర్శలను పట్టించుకోకుండా పనిచేస్తానని, జెఎసి వెనుక ఉన్నది ప్రజలేనని అన్నారు.

గార్డెన్‌ స్ట్రీట్‌కు మహ్మద్‌ అలీ పేరు

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ నగరం మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌ స్ట్రీట్‌కు ప్రపంచ బాక్సింగ్‌ దిగ్గజం మహ్మద్‌ అలీగా నామకరణం చేశారు. మూడు దశాబ్దాల పాటు పార్కిన్‌సన్‌ వ్యాధితో పోరాడిన అలీ 74 ఏళ్ల వయసులో ఈ నెల 3న కన్నుమూసిన సంగతి తెలిసిందే. అలీ అభిమానులు పెద్ద సంఖ్యలో మాడిసన్‌ స్క్వేర్‌కు చేరుకుని ఆయన పేరుతో ఉన్న ‘మహ్మద్‌ అలీ వే’ స్ట్రీట్‌ సైన్‌ బోర్డును ఏర్పాటు చేశారు. అలీ మృతికి తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ నివాళులర్పించారు.

Pages