S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వటపత్రశాయి

ఒకనాడు మార్కండేయ మహర్షి నారాయణమూర్తినుద్దేశించి ‘‘దేవా నీవు మాయాస్వరూపుడవు. నీ మాయను కళ్ళారా చూచుటకు వేడుక పడుతున్నాను. నన్ను కృతార్థుడను చేయుము’’ అనగా పరమాత్ముడు అట్లేకానిమ్ము అని పలుకుచూ బదరికాశ్రమమునకు తరలివెళ్ళెను. శ్రీ మార్కండేయుడప్పటినుండి భగవంతుని మాయను దర్శించుట ఏనాడో కదా అని వ్యాకుల మనస్కుడాయెను.

-పట్టిసపు శేషగిరిరావు

హరివంశం 154

ఇక నా విస్మయానికి అవధి లేకపోయింది. నేను బ్రహ్మదేవుడి దగ్గరకు పోయి ప్రణమిల్లి, దోసిలొగ్గి ‘పితామహా! అతిధన్యతమ దేవుడివి నీవు. నీకు సాటి ఎవరూ లేరు. లేరు. దేవ దైత్య నర తిర్యక్కులను సృష్టించేవాడివి నీవే. బ్రహ్మాండం నీ సృజన సామర్థ్యం, శక్తిని వేనోళ్ళ చాటుతున్నది. నిమేష మాత్రంలో ఈ జగత్తులన్నిటినీ సృష్టిస్తావు! నీవు ప్రథమ దేవతవు, ప్రప్రథమ పూజార్హుడవు కాబట్టే కదా సురాసుర ముని ఋషి తపస్విగణం నిన్ను ఆరాధించటం అన్నాను.

-అక్కిరాజు రమాపతిరావు

యమహాపురి- 63

‘‘మీ అత్తయ్య విషం కలిపిన ప్రసాదమిచ్చి మీ అన్నయ్యని తినమంది. తిన్నాడా- లేదు. అది వేరెవరికో పెట్టాడు. అలాగే మీ అత్తయ్య మీ అమ్మకి క్యాన్సరొచ్చిందంది. వస్తుందా- అదీ వేరెవరికో వెళ్లిపోతుందిలే- భయపడకు’’ అన్నాడు శ్రీకర్.
‘‘అలా ఎలా జరుగుతుంది? మీరు నన్ను మరీ చిన్న పిల్లాడనుకుని మాట్లాడుతున్నారు’’ అన్నాడు గోపాల్ ఆశగా, బాధగా.
‘‘నువ్వు చిన్నవాడివైనా, పెద్దవాడివైనా- జరిగింది మాత్రం అదే. మీ అమ్మగారికి కాన్సర్ లేదు. ఉన్నట్లు మీ అత్తయ్య అబద్ధం చెప్పింది. కారణం నీకు తెలిసిందే- మీ అన్నయ్యని భయపెట్టి బులిపించి ఎలాగో అలా శివగిరికి పంపి ఆ ప్రసాదాన్ని అతడిచేత తినిపించడం’’ అన్నాడు శ్రీకర్.

వసుంధర

నేర్చుకుందాం

క. ‘ఇక్కమలాక్షి శకుంతల
యెక్కడియది? దీని అన్న మెవ్విధ మని త
మ్మొక్క ముని నాథుఁ డడిగిన
నిక్కాశ్యపు లర్థి ఁజెప్పి రేను వినంగన్

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము

రెండు రాష్ట్రాలు.. రెండేళ్ల పాలన

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి రెండేళ్లు, కొత్త రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం, మరోపక్క అవశేష ఆంధ్రప్రదేశ్ విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్నాయి. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కూడా రెండేళ్లు పూర్తి చేసుకుంది. రెండు రాష్ట్రాల్లో కరవు, రైతాంగ సమస్యలు, మహిళా సమస్యలు, విద్యారంగ సమస్యలు, రిక్రూట్‌మెంట్‌లు ప్రభుత్వాలను ఉక్కిరిబిక్కిరి చేయగా, ఇటు తెలంగాణకు విద్యుత్ సమస్య, సాగునీరు-తాగునీటి సమస్యలు పట్టి పీడించాయి. ఆంధ్రాకు వరదలు తుపాన్లు, హుదుద్, గోదావరి పుష్కరాల తొక్కిసలాట తదితర సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. మరోపక్క కేంద్రం వద్ద ఇరు రాష్ట్రాల సమస్యల పంచాయితీలకు లెక్కే లేదు.

అబద్ధాలు చెప్తున్న బాబు

రెండేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనా రంగంలో పూర్తిగా విఫలమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయింది. అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ కప్పిపుచ్చుకునేందుకే నవనిర్మాణ దీక్ష పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిమ్మిక్కులు చేస్తూ ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలకులు ప్రజలకు నమ్మకం, ధైర్యం, స్థైర్యం కల్పించవలసింది పోయి రాష్ట్ర విభజన, చీలిక, కష్టనష్టాలు, అన్యాయం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల్లో గందరగోళం, ఆందోళన సృష్టిస్తున్నారు. విభజనతో ఏర్పడే మంచిచెడు ప్రజలకు తెలిసిందే.

- బొత్స సత్యనారాయణ, వైకాపా సీనియర్ నేత

ఇది స్వర్ణయుగం

కేంద్రంలో బిజెపి, ఏపిలో తెలుగుదేశం ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తూనే అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాం. విభజన తర్వాత తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటూనే సమగ్రాభివృద్ధికి తోడ్పాటునందిస్తోంది. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంది. ఇక రాష్ట్రంలో అభివృద్ధి పథకాలకు కేంద్రం చేయూత ఎప్పుడూ ఉండనే ఉంటుంది. నవ్యాంధ్రకు కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతలు అన్నీ ఇన్నీ కావు. పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద ఇళ్ల కేటాయింపులో పెద్ద పీట వేయడమే దీనికి నిదర్శనం.

- కంభంపాటి హరిబాబు బిజెపి ఏపి అధ్యక్షుడు విశాఖ ఎంపి

దేశంలోనే ఓ చరిత్ర

తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా పాలన సాగిస్తోంది. తెలంగాణ ఏర్పడితే అంతా చీకటే అంటూ పలికిన రాజకీయ నాయకుల జీవితాలు చీకటిమయం అయ్యాయి కానీ తెలంగాణ మాత్రం వెలుగుల్లో ఉంది. ఎండాకాలం వచ్చిందంటే విద్యుత్ కోతతో అల్లకల్లోలంగా మారేది. పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చేవాళ్లు. అలాంటిది టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యుత్ కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతోంది. 38వేల కోట్ల రూపాయల వరకు సంక్షేమ రంగానికి వ్యయం చేస్తున్న ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

- పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ

ఏమున్నది గర్వకారణం?

సమైక్యాంధ్రలో అనాదిగా తెలంగాణ అన్యాయానికి, వివక్షకు గురవుతున్నదన్న భావనతో ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. దీంతో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అప్పటి యుపిఎ ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయంచింది. కానీ రెండేళ్ళ టిఆర్‌ఎస్ పాలన అంతా ఆగమ్యగోచరంగా ఉంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియంతృత్వ పోకడతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరగడం లేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయంగా బలపడేందుకు దృష్టి సారిస్తున్నారే తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి సమయం కేటాయించడం లేదు.

- టి. జీవన్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఇద్దరు సిఎంలూ విఫలమే

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి రెండేళ్లయింది. పార్లమెంటు సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు కల్లలయ్యాయి. ఆరువందలకుపైగా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అన్ని రంగాల్లోనూ విఫలమయ్యారు. తెలంగాణలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా మాటలకే పరిమితమైంది. ధనిక రాష్టమ్రంటూ ప్రకటనలేకాని వాస్తవంలో అభివృద్ధి మందగించింది. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు రాజధాని తరలింపుపై స్పష్టత లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణాలు చేపట్టి ఉండే బాగుండేది. కాని ఏడాదిన్నర సమయం వృథా చేశారు. ఈ రోజు భవన నిర్మాణాలు పూర్తికాకుండానే ఉద్యోగులు వచ్చేయమని హుకుం జారీ చేస్తున్నారు.

- విశే్వశ్వరరెడ్డి వైకాపా శాసనసభాపక్ష ఉపనేత

Pages