S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుటుంబ పాలన సాగుతోంది

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలో తెలంగాణలోకుటుంబ పాలన సాగుతున్నది. మంత్రులూ ప్రేక్షకులే. ఎవరికీ అధికారాలు లేవు. మొత్తం వ్యవస్థను కెసిఆర్ తన గుప్పిట్లో పెట్టుకుని పాలన సాగిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ ఇలా వివిధ కీలకమైన శాఖలన్నింటినీ తమ ఆధీనంలో పెట్టుకుని పాలన చేస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, తనయుడు కె. తారక రామారావు కలిసి అధికారులను శాసిస్తున్నారు. కుటుంబానిదే పెత్తనం. రాజ్యాంగాన్ని, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం, అపహాస్యం చేశారు. మెజారిటీ ఉన్న టిఆర్‌ఎస్‌ను కూల్చివేసే సత్తా విపక్షాలైన కాంగ్రెస్, బిజెపి, టిడిపిలకు లేదు. అయినా విపక్షాల అంటే ఎందుకో కెసిఆర్‌కు భయం.

- డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి, బిజెపి నాయకుడు

ఇదేనా పరిపాలన?

తెలంగాణ ప్రజల్లో నేటికీ సెంటిమెంట్ బలంగా ఉంది. దాంతో టిఆర్‌ఎస్ గత రెండేళ్లలో జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తోంది. అంతేకాని ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలన అద్భుతంగా ఉందన్న భ్రమలు ప్రజల్లో లేవు. కెసిఆర్ ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వ ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విపక్షాలను పరిగణనలోకి తీసుకోకపోవడం, ఉద్యమాలను అణచివేయడం బాహాటంగా కనిపిస్తున్న అంశాలు. ప్రజలకు కెసిఆర్ ఇచ్చిన వాగ్దానాల్లో దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, ఐదు లక్షల ఇళ్లను బలహీన వర్గాలకోసం నిర్మించాల్సి ఉంది. పేదలకు అవసరమైన రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాకపోవడం గమనార్హం.

- చెరుపల్లి సీతారాములు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు.

ప్రకటనలే తప్ప ఆచరణ లేదు

తెలుగు రాష్ట్రాల్లో రెండేళ్ల పాలన ప్రకటనలకే పరితమైంది. మిగులు రాష్ట్రంగా తెలంగాణ రైతులకు, ప్రజలకు ఇచ్చిన హామీలు 90 శాతం నెరవేర్చామని చెబుతోంది. కానీ హామీల అమలును పరిశీలిస్తే 35 శాతం కూడా నెరవేర్చలేదు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి ఏర్పాటుకే సమయమంతా సరిపెట్టుకుంటోంది. హామీలు అమలు పరుస్తున్నామంటూ, కొత్త పథకాలు సత్ఫలితాలిస్తున్నాయంటూ ప్రచారానికే పరిమితమవుతున్నారు. టిడిపి ప్రభుత్వం ఇచ్చిన హామీలు 75 శాతం నెరవేర్చామంటున్న పాలకులు కనీసం ఏడు శాతం కూడా అమలు చేయలేదు. తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. లక్షలాది ఎకరాలకు నీరందిస్తామని చెప్పుకొస్తున్న పాలకులు - అసలు వర్షాలేవి..

-జగన్‌మోహన్ మెట్ల లోక్‌సత్తా, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్

బాబుపై రగులుతున్న అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలనపై సాధారణ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది. 2014 సాధారణ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు టిడిపి అధినేత చంద్రబాబు అనేక హామీలిచ్చారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని, నిరుద్యోగులకు భృతితోపాటు అనేక పథకాలు, కార్యక్రమాలు చేపడతానంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయారు. పేదల భూములను, ప్రభుత్వ భూములను పెద్దపెద్ద కంపెనీలకు, కార్పొరేట్ సంస్థలకు వేలాది ఎకరాల పందేరం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చాలంటే లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. కేంద్రం నుండి అవసరమైన సాయం అందడం లేదు.

- కె. రామకృష్ణ కార్యదర్శి, సిపిఐ ఆంధ్రప్రదేశ్

అండాపై అద్భుతం

గుడ్డు పెంకులపై అద్భుతాలను సృష్టిస్తున్నాడు ఈ యువకుడు. గుడ్డుఆరోగ్యానికే కాదు అందమైన ఆకృతులను తయారుచేయవచ్చు అని నిరూపిస్తున్నాడు. గుడ్డును వాడిన తరువాత పెంకులను పడేస్తుంటాం. కాని శంషుద్దీన్ షేక్ మాత్రం పదిలంగా దాచి అందమైన ఆకృతులతో మళ్లీ ప్రాణం పోస్తున్నాడు. గుడ్డుపై చేస్తున్న ఆర్ట్‌తో ఈ బెంగుళూరు యువకుడు ప్రపంచ రికార్డులు సృష్టించాడు. ఇప్పటివరకు పదిహేను ప్రదర్శనలు నిర్వహించాడు. మూడేళ్ల క్రితం హాబీగా నేర్చుకున్న ఈ కళ ఇపుడు అతన్ని ఉన్నత శిఖరాలకు చేర్చటమే కాదు పర్యావరణ అభిమానిగా మార్చివేసింది. ఇంటర్నెట్‌లో చూసి ఆసక్తిగా నేర్చుకున్న కళను అంతే సహనంతో ఆకృతులను మలుస్తున్నాడు.

శంషుద్దీన్ షేక్

పోలీస్ గవర్నర్ ఆర్డర్!

పాండుచ్చేరి కూడా ఢిల్లీలాగే కేంద్ర పాలిత ప్రాం తం. మాజీ పోలీసు అధికారిణి కిరణ్ బేడీని అక్కడికి గవర్నర్‌గా పంపించారు కదా- సోమవారం కొత్త ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఈలోగానే శ్రీమతి కిరణ్ బేడీ రాష్ట్రంలో వి.ఐ.పిల మోటా రు కార్లకు స్పెషల్ సైరన్‌లు ఉం డరాదని బ్యాన్ చేస్తూ ఆర్డర్ వేసింది. వి.ఐ.పిల కార్లకు వున్న ప్రత్యేక సదుపాయాలను ఆమె రద్దు చేసింది. వారేవా! గవర్నర్‌గారూ!!

-వీరాజి

ఓ వందమంది కావాలిట!

జాన్ మహమ్మద్ ఖిల్జీ పాకిస్తాన్‌లోని క్వెట్టా వాసి. వృత్తికి మెడికల్ టెక్నీషియన్ గానీ వైద్యం ప్రాక్టీసు పెట్టుకున్నాడు. అతనికి యిప్పుడు నలభై మూడు సంవత్సరాల వయసు. కానీ ముప్ఫయి అయిదుమంది సంతానం వున్నారు. ముగ్గురు భార్యలూ కలిపి ఖిల్జీకి ఇరవై ఒక్క మంది కూతుళ్ళనూ, పధ్నాలుగుమంది కొడుకుల్నీ కని యిచ్చారు. వాళ్లందరినీ అతను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. పోయిన నెలలో రెండు, మూడు భార్యలకి చెరో అమ్మారుూ పుట్టారు.

పులులకు విముక్తి!

బౌద్ధ సన్యాసులు నడిపే ‘పులుగుడి’లో వందకుపైగా పెద్ద పులులు, వాటి సంతానం బ్రతుకు వెళ్లదీస్తున్నాయి. బౌద్ధ సన్యాసులు దీన్ని ‘సంరక్షణాలయం’గా చెబుతున్నా- యిది కేవలం ‘అక్రమ వ్యాపార నిలయం’. టూరిస్టుల దగ్గరనుంచి పులులతో ఆటలకు, సెల్ఫీలకు విపరీతంగా పైసలు గుంజుతున్నారు.

పేదల ఆశాజ్యోతి.. ప్రతిభా కృష్ణయ్య!

డబ్బు సంపాదన మనకి మాత్రమే సంతోషాన్నిస్తుంది. ఇతరులకు సాయపడడం, అవసరమైనవారికి తోడునీడగా ఉండడం అనేది అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషాన్ని ఒక్కసారి అనుభవించినవారికే అందులోని మజా తెలుస్తుందని అంటోంది బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రతిభా కృష్ణయ్య.

- బాబు

పనసతో సొగసు...

మనకు లభించే పండ్లు చాలామటుకు తినటానికి రుచికరంగా వుంటాయి. అలాగే ఆరోగ్యానికి మంచి ఔషధాలుగా ఉపయోగపడతాయి. వాటిలో పనస కూడా ఒకటి. జుట్టు రాలిపోవడం, తల దురద వంటి వాటి నివారణకు పనస గింజలు చక్కగా పనిచేస్తాయి. ఈ గింజలను ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుని, ఆ తరువాత ఒకటిన్నర చెంచా పనస గింజల పొడి, ఒక చెంచా పెసరపొడి, నువ్వుల నూనె కలిపి తలకు రాసుకుని పది నిముషాల తరువాత శీకాయతోగానీ, షాంపూతోగాని కడుక్కోవాలి. దీనివల్ల దురదలు, జుట్టు రాలడం తగ్గుతుంది. పనస తొనను మెత్తగా మిక్సీలో రుబ్బి ఆ ముద్దను కళ్ళపైన రాసుకుంటే కళ్ళకు మంచి మెరుపు వస్తుంది.

- మనస్విని

Pages