S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్యారమ్ చాంప్స్ అనిల్‌కుమార్, సునీత

చాంద్రాయణగుట్ట, జూన్ 8: ఎన్‌టిపిసి 46వ సీనియర్ అంతర్ జిల్లా క్యారమ్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ టైటిల్‌ను హైదరాబాద్ ఎజిఓఆర్‌సికి చెందిన వి.అనిల్‌కుమార్, డిఎల్‌ఆర్‌ఎల్‌కు చెందిన బి.సునీత గెల్చుకున్నారు. రామగుండంలోని జ్యోతిక రిక్రియేషన్ క్లబ్‌లో జరుగుతున్న ఈ చాంపియన్‌షిప్ పురుషుల విభాగం సింగిల్స్ ఫైనల్లో అనిల్‌కుమార్ 25-0, 25-0 స్కోరు తేడాతో ప్రత్యర్థి హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌జాహీర్‌పై గెలుపొంది టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

చేపల కోసం పోటాపోటీ - ఆకాశాన్ని అంటిన ధరలతో లూటీ

ఇబ్రహీంపట్నం, జూన్ 8: మృగశిరకార్తె రాకతో స్థానికంగా చేపల విక్రయాలు జోరందుకున్నాయి. వేసవికాలం ముగుస్తుందనగా వాతావరణంలో మార్పులకు అనుగుణంగా రోగాల బారిన పడకుండా చేపలను భుజించడం ఆనవాయితీగా వస్తోంది. బుధవారం మృగశిర కార్తెతో నియోజకవర్గ కేంద్రంలో చేపల విక్రయాలు జోరుగా సాగాయి. సాధారణంగా కిలో రూ. 100 నుండి 120 వరకు పలికే చేపల ధరలు మృగశిర కార్తె రాకతో రెట్టింపు ధరలకు విక్రయాలు జరిపారు.

వ్యాపార సంస్థలు చెత్తబుట్టలను పెట్టుకోవాలి

హైదరాబాద్, జూన్ 8: నగరంలోని అన్ని రకాల వ్యాపార సంస్థలు సొంతగా చెత్తబుట్టలను ఏర్పాటు చేసుకోవాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి సూచించారు. బుధవారం ఉదయం ఆయన నగరంలోని అమీర్‌పేట, సత్యం ధియేటర్, యూసుఫ్‌గూడ, రెహ్మాత్‌నగర్ పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం ఆరు గంటలకు సత్యం ధియేటర్ వద్ద పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలిస్తుండగా స్థానిక దుకాణందార్లు చెత్తను రోడ్డుపై వేయటాన్ని గమనించారు. ప్రతి షాపు యజమానికి కూడా రోడ్డుపై చెత్త వేయకుండా షాపులోనే ప్రత్యేకంగా చెత్త బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు

తాండూరు, జూన్ 8: తెలంగాణ రైతాంగ ఆకాంక్షలను అనుగుణంగా రెండేళ్ల పాలనను పూర్తి చేశామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మిషన్ భగీరథతో ఏడాదిలోపు ఇంటింటికీ తాగునీరు అందుతుందని, మిషన్ కాకతీయతో చెరువుల జలకళ సంతరించుకుంటుందని చెప్పారు. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం నిర్వహించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ సుజలాం సుఫలాం నినాదంతో తెలంగాణను సస్యశ్యామలం చేయడమే సంకల్పమని అన్నారు. మిషన్ కాకతీయకు రెండు విడతలుగా ఆరువేల కోట్ల కేటాయించామని పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో తాగుసాగు నీరు అందించే బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు.

భార్య గొంతు కోసి హత్య

సికింద్రాబాద్, జూన్ 8: కట్టుకున్న భార్యను అతికిరాతకంగా హత్యచేసి పారిపోయిన సంఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోజరిగింది. ధించిన వివరాలు ఈ విదంగా ఉన్నాయి..మెట్టుగూడ ప్రాంతానికి చెందిన లక్ష్మీ (21)కి కడప జిల్లాకు చెందిన వెంకటేశ్‌తో గత సంవత్సరం క్రితం వివాహం జరిగింది. వీరు లాలాపేట్ నఫీజ్‌గార్డెన్ వెనుకబాగంలో నివాసం ఉంటున్నారు. వెంకటేశ్ మద్యానికి బానిసగా మారి తరచూ భార్యతో గొడవపడుతుండేవారు. మంగళవారం రాత్రి భార్యాభర్తలు గొడవపడటంతో వెంకటేశ్ తన భార్య లక్ష్మీని గొంతుకోసి హత్యచేసి ఇంటికి తాళం వేసి పారిపోయాడు.

జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు: కోదండరామ్

సికింద్రాబాద్, జూన్ 8: తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా జెఎసి పనిచేస్తుందని జెఎసి చైర్మెన్ ప్రొఫెసర్. కోదండరామ్ పేర్కొన్నారు. బుధవారం ఓయులో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించామని ఇందులో పలు నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. ముఖ్యంగా అనేక విమర్శలు వచ్చినప్పుడు జెఎసికి అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. తాము ప్రజల పక్షాన ప్రజాసమస్యలపైనే మాట్లాడుతున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఫలితాలు అందరికీ దక్కాలని ప్రొ.జయశంకర్ పదేపదే చెప్పేవారని కోదండరామ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

చేప ప్రసాదం పంపిణీ షురూ

హైదరాబాద్, చార్మినార్, జూన్ 8: మృగశిరకార్తెను పురస్కరించుకుని ఆస్తమా రోగులకు బత్తిని సోదరులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభమైంది. ఉదయం బత్తిని కుటుంబీకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రసాదం పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిధిగా హజరు కాగా, ఉదయం వేళల్లోనే మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ కూడా వచ్చి ప్రసాదం స్వీకరించారు. ప్రారంభం సమయంలో ఒక్కసారిగా బ్యారికేడ్లలోని జనం ముందుకు తోసుకుంటూ రావటంతో స్వల్ప తోపులాట జరిగింది.

సకాలంలో విత్తనాలు, ఎరువులు

హైదరాబాద్, జూన్ 8: ఖరీఫ్ పంట కోసం రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందజేయాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతామమహేందర్‌రెడ్డి వ్యవసాయ శాఖ జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్‌లో స్థాయిసంఘం-3 వైస్‌చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈసంవత్సరం వర్షపాతం ఎక్కువ ఉన్నందున రైతులు పంటలు పండించుకోవడానికి సబ్సిడీ ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మండలంలో వ్యవసాయ అధికారుల ద్వారా అందజేయాలని చెప్పారు. రైతులకు ట్రాక్టర్లు, పనిముట్లు అందజేసేటప్పుడు కమిటీలో ప్రజాప్రతినిధులకు తెలియజేసి అర్హులైన వారికి అందేల చూడాలని అన్నారు.

9-6-2016

Pages