S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థిపై మానసిక శాస్త్ర ప్రభావం

హైదరాబాద్‌లో నివాసం ఏర్పాటుచేసుకున్న తరువాత చాలాసార్లు సైకాలజిస్టు బి.వి.పట్ట్భారామ్‌తో మీటింగులలో కలిశాం. మీటింగ్‌లలో ఆయనతో కలిసి ఉండటంవల్ల కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఏర్పడింది. తరగతి గదిలో అడుగు పెట్టకముందే మానసిక శాస్త్రానికి సంబంధించిన అవగాహన ఉంటే ఉపాధ్యాయులు విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పాఠాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది.

- చుక్కా రామయ్య

కాలం మాన్పని గాయం ఇది

మనదేశానికి ఆఫ్ఘానిస్తాన్‌తో ఉన్న సంబంధ బాంధవ్యాలు ‘‘కాలానికి కట్టుబడనివి’’ అని ప్రధానమంత్రి జూన్ నెల నాలుగవ తేదీన వ్యాఖ్యానించడం చరిత్రకు అనుగుణమైన అంశం. అఫ్ఘానిస్తాన్ ఒకప్పుడు భారతదేశంలో భాగమన్న వాస్తవం నరేంద్ర మోదీ వ్యాఖ్య ను విన్నవారికి స్ఫురించడం సహజం. భౌగోళికమైన అనుబంధం సాంస్కృతికమైన అనుబంధం ముడివడి ఉండడం జనసముదాయం లేదా జనసముదాయాలు ఒకే జాతిగా వికసించడానికి ప్రాతిపదిక. మనదేశానికీ అనేక ఇరుగుపొరుగు దేశాలకు మధ్య అనేక లక్షల ఏళ్లపాటు సమాన జాతీయత వికసించడం ఎవ్వరూ నిరాకరించలేని చారిత్రక వాస్తవం. ఈ జాతీయత కాలానికి కట్టుబడనిది.

- హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 9951038352

నరేంద్రుని ప్రభావముద్ర

రెండేళ్ల కాలవ్యవధిలో మన ప్రధాని నరేంద్రమోదీ అమెరికాకు నాలుగుసార్లు ద్వైపాక్షిక అధికార యాత్ర జరపడం ఉభయదేశాల మధ్య పెరుగుతున్న మైత్రికి ప్రబల నిదర్శనం. ప్రధానమంత్రి పదవీ బాధ్యతను స్వీకరించిన తరువాత 2014, సెప్టెంబర్‌లోమోదీ మొదటిసారి అమెరికాకు వెళ్లివచ్చారు. ఇప్పుడు, జూన్ ఏడవ దేదీన నాలుగవసారి అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో అధ్యక్షుడు ఒబామాను నాలుగవసారి కలుసుకున్నారు. గతంలో ‘‘నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించే’’ విధానాన్ని అవలంబించిన అమెరికా ప్రస్తుతం చిత్తశుద్ధితో మనపట్ల మైత్రిని పాటిస్తోందన్న విశ్వాసం నరేంద్ర మోదీ ప్రస్తుత పర్యటనకు నేపథ్యం.

అంతా కలిసి పనిచేస్తే మహా సంకల్ప సిద్ధి

పెడన, జూన్ 8: తెలుగుదేశం ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో బుధవారం ‘మహా సంకల్పం’ పేరుతో ద్వితీయ వార్షికోత్సవాన్ని స్థానిక దేవాంగ కల్యాణ మంటపంలో నిర్వహించారు. నియోజకవర్గంలోని గూడూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలతో పాటు పెడన పట్టణానికి చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొనగా ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల ప్రత్యేకాధికారి సునీల్ రాజ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కడప నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.

జల వనరుల శాఖకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 8: రెండేళ్ల జలవనరుల శాఖకు రూ.14,214.42 కోట్ల నిధులను కేటాయించి ఖర్చు చేయడం రాష్ట్రంలో సాగు, మంచినీటి రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తేటతెల్లం చేస్తోందని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం మంత్రి కార్యాలయంలో రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని పెద్దఎత్తున సందర్శకులు మంత్రికి అభినందనలు తెలియజేయడానికి కార్యాలయానికి విచ్చేశారు.

అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణానికి శ్రమిస్తున్న చంద్రబాబు

అవనిగడ్డ, జూన్ 8: రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలు అధిగమిస్తూనే అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్థానిక తాలుకా కార్యాలయం ఆవరణలో బుధవారం రాత్రి మహా సంకల్ప దీక్ష నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు రాగానే రాజధాని నిర్మాణంపై సిఎం దృష్టి సారించారన్నారు. ఈమేరకు ప్రపంచ దేశాలు పర్యటించి అత్యద్భుతమైన రాజధాని నిర్మాణానికి సంకల్పం చేశారన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో 46వేల 300 మంది రైతులకు రూ.136కోట్ల మేర రుణాలు మాఫీ చేశామని ఈసందర్భంగా ఆయన చెప్పారు.

చంద్రబాబుపై చీటింగ్ కేసు నమోదు చేయాలి

మైలవరం, జూన్ 8: ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యంకాని హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించి ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై 420 (చీటింగ్) కేసు నమోదు చేయాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటై బుధవారం నాటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రమేష్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. తొలుత స్థానిక బోసుబొమ్మ సెంటరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రమేష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి విస్మరించారన్నారు.

బాబుకు బాసటగా నిలవండి

మైలవరం, జూన్ 8: ఎన్ని ఒడిదుడుకులు, అడ్డంకులు ఎదురైనా, రాష్ట్రం 16వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నప్పటికీ నవ్యాంధ్ర నిర్మాణానికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పానికి అందరూ బాసటగా నిలవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక మార్కెట్ యార్డులో మైలవరం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన మహా సంకల్ప దీక్ష కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయటానికి చంద్రబాబు కంకణం కట్టుకుని పని చేస్తున్నారని ఉమ చెప్పారు.

సంకల్ప బలంతో ముందడుగు

మచిలీపట్నం, జూన్ 8: నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి సంకల్ప బలంతో ముందుకు సాగుదామని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. నవ నిర్మాణ దీక్ష వారోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో బందరు నియోజకవర్గ స్థాయి మహా సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. బందరు పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణతో పాటు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొని గత రెండేళ్ళ ప్రభుత్వ పాలనను వివరించారు. విభజన నేపథ్యంలో నెలకొన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను సైతం లెక్కచేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించారన్నారు.

చిన్నారుల ప్రాణాలతో చెలగాటం!

మచిలీపట్నం, జూన్ 8: అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే నాసిరకం కందిపప్పుతో సంబంధిత అధికారులు చిన్నారుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. పురుగులతో కూడిన కందిపప్పుతో పప్పుకూర, సాంబారు వండి వడ్డిస్తున్నారు. ఇవి చిన్నారుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. గత ఏడు నెలలుగా నాసిరకం కందిపప్పునే అంగన్‌వాడీ కేంద్రాల్లో వినియోగిస్తున్నా పట్టించుకున్న వారే కరవయ్యారు. స్మార్ట్ విలేజ్ పేరిట అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, రేషన్ దుకాణాలు, పిహెచ్‌సిలు, హెల్త్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించాల్సిన ప్రత్యేకాధికారులు అక్కడున్న లోపాలను గుర్తించలేక పోతున్నారు.

Pages