S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళను తాకిన రుతుపవనాలు..

తిరువనంతపురం: వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగానే నైరుతి రుతుపవనాలు బుధవారం కేరళ తీరాన్ని తాకాయి. దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించిన రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, నాలుగైదు రోజుల్లో ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ముద్రగడ తీరుతో కాపులకే నష్టం : చినరాజప్ప

అమలాపురం: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఖరితో కాపు కులస్థులకు అన్యాయం జరిగే పరిస్థితి నెలకొందని డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప బుధవారం ఇక్కడ మీడియాతో చెప్పారు. వైకాపా అధినేత జగన్, ముద్రగడ కలిసి ఈ నాటకం ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. తుని విధ్వంసకాండకు సంబంధించి ఎవరినీ విడిచిపెట్టేది లేదని నిందితులందర్నీ పోలీసులు అరెస్టు చేసి కేసులు పెడతారని అన్నారు. అరెస్టులకు నిరసనగా ముద్రగడ దీక్షలు చేసినా ప్రభుత్వం భయపడే ప్రసక్తే లేదన్నారు. ముద్రగడ ఆమరణ దీక్ష చేస్తే దానికి ప్రభుత్వం బాధ్యత వహించదన్నారు.

కేరళను తాకిన రుతుపవనాలు

తిరువనంతపురం: వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగానే నైరుతి రుతుపవనాలు బుధవారం కేరళ తీరాన్ని తాకాయి. దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించిన రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, నాలుగైదు రోజుల్లో ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

మూడోరోజూ లాయర్ల ఆందోళన

వరంగల్: ఉమ్మడి హైకోర్టును విభజించాలని, స్థానికత ఆధారంగా న్యాయమూర్తులు, న్యాయాధికారులను బదిలీ చేయాలని కోరుతూ న్యాయవాదులు ప్రారంభించిన ఆందోళన బుధవారం మూడోరోజుకు చేరింది. ఇక్కడి హన్మకొండ కోర్టు ప్రాంగణంలో లాయర్లు భారీగా హాజరై నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి ఎపికి చెందిన జడ్జీలను వెనక్కి పంపాలని కోరారు.

నడకదారి భక్తులకు ప్రాధాన్యం

తిరుపతి: తిరుమలకు నడకదారిన వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని టిటిడి సభ్యుడిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన అరికెల నర్సారెడ్డి తెలిపారు. టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు ఆయన చేత ప్రమాణం చేయించారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత నర్సారెడ్డి మీడియాతో మాట్లాడారు. నిజమాబాద్ జిల్లాకు చెందిన ఆయనను టిటిడి సభ్యుడిగా ఎపి సర్కారు ఇటీవల నియమించింది.

తండ్రిని చంపిన తనయుడు..!

ఒంగోలు: కుటుంబ కలహాల పర్యవసానంగా ఓ తండ్రి ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ప్రకాశం జిల్లాలో బుధవారం వెలుగు చూసింది. కొత్తపట్నం మండలం అల్లూరులో కన్నతండ్రినే రోకలిబండతో మోదీ కుమారుడు హత్య చేశాడు. సమాచారం అందడంతో పోలీసులు అల్లూరు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

నీట మునిగిన మహాసంకల్ప సభ మైదానం

కడప: కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఇక్కడి మున్సిపల్ మైదానంలో ఈరోజు సాయంత్రం ఎపి ప్రభుత్వం నిర్వహించే మహాసంకల్ప సభకు అధికారులు విస్తృత సన్నాహాలు చేయగా, సభా ప్రాంగణంలోకి వర్షపునీరు చేరింది. పొద్దుటూరు, పులివెందులలోనూ లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

కేరళలో సోనియాగాంధీపై కేసు

తిరువనంతపురం: తమకు చెల్లించాల్సిన డబ్బును ఎగవేసినందుకు హెదర్ కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కంపెనీ మేనేజింగ్ పార్టనర్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసినట్టు సమాచారం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌కు కేరళలో కొత్తకష్టాలు ప్రారంభమయ్యాయి.

ముద్రగడను ఆడిస్తున్న జగన్!

ఏలూరు: కాపుఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం వైకాపా అధినేత జగన్ చేతిలో కీలుబొమ్మలా మారి, ఆయన చెప్పినట్లు ఆడుతున్నారని టిడిపి ఎమ్మెల్యే రామానాయుడు ఆరోపించారు. జగన్ ప్రాపకం కోసం ముద్రగడ వంటి సీనియర్ నాయకుడు పరితపించడం వింతగా ఉందన్నారు. తుని విధ్వంసకాండకు సంబంధించి రౌడీషీటర్లను, నేరస్థులను పోలీసులు అరెస్టు చేస్తుంటే ముద్రగడ ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. అరాచక శక్తులకు ఆశ్రయం ఇస్తే ఉద్యమాలు తప్పుదారి పడతాయన్నారు.

జిల్లాల విభజనపై రాజీవ్ శర్మ సమీక్ష

హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి బుధవారం ఉదయం సచివాలయంలో కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమీక్ష ప్రారంభించారు. జిల్లాల పునర్విభజనపై కలెక్టర్ల నుంచి నివేదికలను తీసుకుంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఇదే విషయమై కలెక్టర్ల సమావేశంలో సిఎం కెసిఆర్ సమీక్షిస్తారు. రాబోయే దసరా నాటికి కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల ఏర్పాటును పూర్తి చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Pages