S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభజనతో తెలంగాణకు ఆస్తులు, ఎపికి అప్పులు!

కడప: రాష్ట్ర విభజన ఫలితంగా తెలంగాణకు ఆస్తులు, ఎపికి అప్పులు మిగిలాయని, అయినప్పటికీ కష్టాలను ఎదుర్కొని అభివృద్ధి పథంలో పయనించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇక్కడ బుధవారం సాయంత్రం మహాసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ, విభజన వల్ల జరిగిన నష్టాలను మననం చేసుకుంటూ ముందుకు సాగాలన్న ఉద్దేశంతోనే వారం రోజుల పాటు ప్రభుత్వం నవ నిర్మాణ దీక్షను, చివరి రోజున మహాసంకల్ప సభను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటే ఎపికి ఎదురులేదన్నారు. కాగా, ఒక అసమర్థుడు అసెంబ్లీలో విపక్ష నేతగా ఉండడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు.

దీక్షల పేరుతో ముద్రగడ బెదిరింపులు!

విజయవాడ: చీటికీ మాటికీ నిరాహార దీక్షలు చేస్తూ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం బెదిరింపు రాజకీయాలకు దిగుతున్నారని ఎపి మంత్రి నారాయణ విమర్శించారు. ఎవరి కోసం దీక్షలు చేస్తున్నారో ముద్రగడ ప్రకటించాలన్నారు. రౌడీషీటర్లను, నేరస్థులను పోలీసులు చట్టప్రకారం అరెస్టు చేస్తుంటే ముద్రగడకు ఎందుకు అభ్యంతరమని ప్రశ్నించారు. కాపుల సంక్షేమం కోసమైతే ఆయన దీక్షలు చేయాల్సిన పనిలేదని నారాయణ అన్నారు.

కడపలో మహాసంకల్ప సభ ప్రారంభం

కడప: ఎపి ప్రభుత్వం చేపట్టిన నవ నిర్మాణ దీక్ష ముగింపు సందర్భంగా బుధవారం సాయంత్రం కడప మున్సిపల్ మైదానంలో మహాసంకల్ప సభ ప్రారంభమైంది. మధ్యాహ్నానికి వర్షం తెరిపి ఇవ్వడంతో సభ సజావుగానే మొదలైంది. ఎపి సిఎం చంద్రబాబు, టిడిపి యువనేత నారా లోకేష్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు సభకు హాజరయ్యారు. వైకాపా అధినేత జగన్ సొంత జిల్లా అయిన కడపలో మహాసంకల్ప సభను నిర్వహించాలని చంద్రబాబు వ్యూహాత్మకంగానే నిర్ణయించడంతో అధికార యంత్రాంగం విస్తృత సన్నాహాలు చేసింది.

స్వేచ్ఛాయుత వాతావరణంలో జిల్లాల విభజన

హైదరాబాద్: ఒత్తిళ్లకు దూరంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో జిల్లాల పునర్విభజన జరగాలని సిఎం కెసిఆర్ అన్నారు. ఇక్కడ బుధవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొత్త మండలాలు, జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు మేలు జరగాలన్నారు. కొత్త జిల్లాలు అభివృద్ధి కేంద్రాలుగా ఉండాలన్నారు. ప్రజల మనోభావాలు, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని, అవసరమైతే గ్రామసభలు నిర్వహించి జిల్లాల ఏర్పాటుపై సరైన నివేదికలు ఇవ్వాలన్నారు. అన్ని స్థాయిల్లో అవినీతిని అరికట్టేందుకు కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు.

ప్రశ్నించేవారిపై ఎదురుదాడి తగదు:లక్ష్మణ్

హైదరాబాద్: ప్రజాసమస్యలపై ప్రశ్నించిన జెఎసి చైర్మన్ కోదండరామ్‌పై తెరాస మంత్రులు, నేతలు మూకుమ్మడిగా ఎదురుదాడి చేయడం తగదని టి.బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. సమాధానాలు చెప్పే ధైర్యం లేకే తెరాస నేతలు ఇలా ప్రతిదాడికి దిగుతున్నారన్నారు. ప్రశ్నించే అధికారం ఎవరికైనా ఉందని, తెరాస సర్కారు మాత్రం నిరంకుశ ధోరణిలో ప్రవర్తిస్తోందన్నారు. ఫిరాయింపులకు వేదికగా తెలంగాణ సచివాలయం మారిందన్నారు.

రైల్వేలో ‘జనని సేవ’ ప్రారంభం

దిల్లీ: బాలింతలు, శిశువులకు ఆహారాన్ని అందించేందుకు ‘జనని సేవ’ కార్యక్రమాన్ని రైల్వేమంత్రి సురేష్ ప్రభు బుధవారం ప్రారంభించారు. వేడినీళ్లు, పాలుతో పాటు బాలింతలు, శిశువులకు అవసరమయ్యే వివిధ ఆహార పదార్థాలను 25 రైల్వేస్టేషన్లలో అందుబాటులో ఉంచుతున్నామని ఆయన తెలిపారు. 5 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు ఆహారాన్ని అందించేందుకు ప్రత్యేక మెనూ రూపొందించామన్నారు.

ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ: ముగ్గురు మృతి

నిజామాబాద్: నవీపేట మండలం ఫకీరాబాద్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని, ఆటోలో వీరు బాసర వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

ఏపీలో మెగా లెదర్‌ క్లస్టర్‌

దిల్లీ: నెల్లూరు జిల్లా కోట మండలంలో మెగా లెదర్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం సంతకం చేశారు. రూ.128 కోట్ల వ్యయంతో కనీసం 20వేల మందికి ఉపాధి కల్పించేలా ఈ క్లస్టర్‌ ఏర్పాటు చేయనున్నారు.

జింబాబ్వేకు బయల్దేరిన ధోనీ సేన

ముంబయి : మహేంద్రసింగ్‌ ధోని సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు ముంబయి నుంచి జింబాబ్వేకు బుధవారం బయల్దేరి వెళ్లింది. ఈ నెల 11న ప్రారంభం కానున్న సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌లో జరుగుతాయి. జింబాబ్వేతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లను ధోనీ సేన ఆడనుంది.

మావోయిస్టుల డంప్ స్వాధీనం

కాకినాడ: రామవరం సమీపంలోని జాజిగెడ్డ అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతూ మావోయిస్టులకు చెందిన డంప్‌ను గుర్తించారు. డంప్‌లో నుంచి భారీగా ఆయుధాలను వారు స్వాధీనం చేసుకున్నారు.

Pages