S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళకళలాడుతున్న జములమ్మ రిజర్వాయర్

గద్వాల, జూన్ 7: గత రెండు నెలలుగా గద్వాల పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన జములమ్మ రిజర్వాయర్‌లో నీరు లేకపోవడంతో ప్రజలు తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయంపై పలుసార్లు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, ఎమ్మెల్యే డికె అరుణ ఇరిగేషన్ అధికారులతో పాటు కలెక్టర్, నీటిపారుదలశాఖ మంత్రికి వివరించారు. పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు జూరాల నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు స్పందించిన జూరాల అధికారులు జములమ్మ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశారు. అదేవిధంగా గత రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షంతో జములమ్మ రిజర్వాయర్ నీటితో కళకళలాడుతోంది.

జూలై 31 నాటికి 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు

పెద్దకొత్తపల్లి, జూన్ 7: ఖరీఫ్ జూలై 31నాటికి లిప్టు-1, లిప్టు-2, లిప్టు -3ల ద్వారా 4లక్షల 50వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం జొన్నలబోగుడ రిజర్వాయర్ లిప్టు-2 పనులను పంపుహౌస్, సర్జిపుల్, విద్యుత్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించి పనుల శాతంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి పగలు అధికారులు పని చేయించి అనుకున్న నాటికి పనులు పూర్తి చేయడానికి కృషి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

విత్తన కంపెనీ సీజ్

భూత్పూర్, జూన్ 7: మండలంలోని విత్తన ఉత్పత్తి కంపెనీల్లో వ్యవసాయాధికారులు తనిఖీ నిర్వహించారు. మండలంలోని అమిస్తాపూర్ ఉన్న వసంతా సీడ్స్,డాక్టర్ సీడ్, భూత్పూర్‌లోని గోపీకృష్ణ, సికాప్ సీడ్స్ కంపెనీల్లో మంగళవారం తనీఖీ నిర్వహించారు. గోపికృష్ణ సీడ్స్ విత్తన ఉత్పత్తి కంపెనీలో ఏప్రీల్ 22న స్ధానిక వ్యవసాధికారి భ్యూలా తనిఖీ నిర్వహించగా సూపర్‌సీడ్స్ పేరుతో విత్తనాలు ప్రాసెసింగ్ చేస్తున్నట్లు గుర్తించగా, సరైన డాక్యుమెంట్లు చూపించకపోవడంతో 230 క్వింటాళ్ల విత్తనాలను డాక్యుమెంట్లు చూపించే వరకు తరలించరాదని ఆదేశించారు.

ప్రతిపక్షాలను నిందిచడమే ప్రభుత్వ పనా?

వెల్దండ, జూన్ 7: చేసిన తప్పులను ఎత్తిచూపుతున్న ప్రతిపక్షాలను నిందించడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని టిడిపి జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు అన్నారు. వెల్దండ మండలం బండోనిపల్లిలో మృతి చెందిన టిడిపి గ్రామకమిటీ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బక్కని మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలకు సైతం ప్రతిపక్షాలు, గత పాలకులు, ఆంధ్రపాలకులే కారణమంటూ ప్రభుత్వం దుష్ప్రచారం చేయడం ఎంతమాత్రం తగదన్నారు. టిడిపి ప్రభుత్వహయంలో పనిచేసిన ప్రస్తుత మంత్రులు ఆనాడు ఎందుకు ఆంధ్రపార్టీలో ఉన్నారని ప్రశ్నించారు.

హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి

బిజినేపల్లి, జూన్ 7: హరిత హారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని పంచాయతీ రాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మండలంలోని పాలెంలో ఉపాధి హామీ పథకంలో పెంచిన నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత సంవత్సరం వర్షాలు లేని కారణంగా హరితహారంలో ఆశించిన ఫలితాలు సాధించలేదని, ఈ సారి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్నదని ఈ సారి హరితహారం ఆశాజనకంగా ఉంటుందని అన్నారు.

ప్రైవేట్ పాఠశాల వద్దు... ప్రభుత్వ పాఠశాలే ముద్దు

మక్తల్, జూన్ 7: మక్తల్ మండల పరిధిలోని పంచలింగాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.్భంరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలోని ఇంటింటికి వెళ్లి బడిఈడు కలిగిన పిల్లలందరినీ బడిలో చేర్పించాలనీ సంబంధిత తల్లిదండ్రులను కోరారు. ప్రైవేట్ పాఠశాల వద్దు... ప్రభుత్వ పాఠశాలలే ముద్దు, పిల్లలు బడికి.. పెద్దలు పనికి, సర్కారి చదువు... చక్కని చదువు నినాదాలతో ఉపాధ్యాయులు, పాఠశాల కమిటి సభ్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలసి ర్యాలీగా వెళ్లి ఇంటింటికి తిరిగారు. తమ పిల్లలను మన గ్రామంలోని పాఠశాలలో చేర్పించాలని కోరారు.

హరితహారాన్ని యజ్ఞంలా చేపట్టాలి

మహబూబ్‌నగర్, జూన్ 7: యజ్ఞంలా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లోని రెవెన్యూ మీటింగ్ హల్‌లో హరితహారంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో దాదాపు ఐదుకోట్ల మొక్కలు నాటి రాష్ట్రంలోనే హరితహారం కార్యక్రమంలో ప్రథమస్థానంలో నిలవాలని సూచించారు. ప్రతి ఒక్కరు భాద్యతాయుతంగా సమాజంలో తన వంతుగా మొక్కలు నాటాలనే దృక్పథంతో ముందుకు వచ్చి ఈ మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

భారీ వర్షం

మహబూబ్‌నగర్, జూన్ 7: జిల్లాలో భారీ వర్షాలే కురుస్తున్నాయి. ప్రతినిత్యం వివిద మండలాల్లో కురుస్తున్న వర్షాలు రైతాంగంలో ఖరీఫ్ ఆశలను చిగురింపజేశాయి. మంగళవారం తెల్లవారుజామున జిల్లాలోని దాదాపు 30 మండలాల్లో ఓ మోస్తారు నుండి భారీ వర్షం కురిసింది. వనపర్తి నియోజకవర్గంలోని గోపాల్‌పేట మండలంలో ఏకంగా వరణుడు కరుణించడంతో 11సెం.మీ భారీ వర్షం కురిసింది. దింతో మండలంలోని చెరువులు, కుంటల్లోకి పెద్ద ఎత్తున వర్షపునీరు వచ్చి చేరింది. చెక్ డ్యాంలు, వాలుకట్టలు పొంగిపోర్లుతున్నాయి. ఎటుచూసిన రోడ్ల వెంట ఉన్నటువంటి గుంతల్లో వర్షపునీరు చేరింది.

శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం స్ఫూర్తిదాయకం

మహబూబ్‌నగర్, జూన్ 7: శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం పోలీసుకు అపారమైన శక్తిని, సూర్ఫిర్తిని ఇస్తుందని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. మంగళవారం ట్రాఫిక్ పోలీసులకు మహబూబ్‌నగర్ ఆంధ్రాబ్యాంక్ వారి ఆధ్వర్యంలో పెట్రోలింగ్ మోటర్‌సైకిళ్లను ఉదారంగా ఇవ్వడంతో ఎస్పీ వాటిని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎస్పీ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలు శాంతికాముకులేకాక పోలీసులకు ఎంతో సహకారధోరణితో మసులుకుంటున్నారని అన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా పోలీసు చేసే కృషిని సమాజం గుర్తించి ఆదరించడం వలసన పోలీసు సిబ్బంది తమ కష్టాన్ని మరిచిపోతారని ఆమె పెర్కొన్నారు.

పథకాలు పేదలకు అందించాలి

కల్వకుర్తి, జూన్ 7: ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో పేదలకు అందించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. మంగళవారం రఘుపతిపేట గ్రామంలో నిర్వహించిన పల్లె వికాసం కార్యక్రమానికి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా రఘుపతిపేట గ్రామంలో పలు వీధులు తిరిగి గ్రామ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మండల పరిధిలోని రఘుపతిపేట గ్రామంలోని రేషన్‌షాపును ఎమ్మెల్యే అకస్మీకంగా తనిఖీ చేశారు.

Pages