S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహకార సంఘాలు బలోపేతం చేస్తా

కరీంనగర్, జూన్ 7: ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో సహకార బ్యాంకులను బలోపేతం చేస్తున్నట్లు టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు తెలిపారు. మంగళవారం సాయంత్రం కెడిసిసి బ్యాంక్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక సహకార బ్యాంకుల్లో కంప్యూటరీకరణ చేసి, ఇటు రైతులకు, అటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. గత ఏడాది ఖరీఫ్‌కు రూ.480 కోట్లు, రబీకి రూ.320 కోట్లు, ఎల్‌టికి రూ.50 కోట్లు, ఎస్‌హెచ్‌జి రూ.55 కోట్లు, బంగారు రుణాలు రూ.100 కోట్లు, ఇతర లోన్‌లు రూ.50 కోట్ల చొప్పున రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ఎటిఎంలు ధ్వంసం

పాపన్నపేట, జూన్ 7: పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ బస్టాండ్ సమీపంలో ఉన్న టాటా ఇండిక్యాష్ ఎటిఎంలను దుండుగులు ధ్వంసం చేసి రూ.16 వేల 700 నగదును దోచుకెళ్లారు. సోమవారం రాత్రి కొత్తపల్లిలోని ఎటిఎంలోకి దొంగలు చొరబడి టాటా ఇండిక్యాష్‌కు చెందిన రెండు ఎటిఎంలను గడ్డపారలతో ధ్వంసం చేశారు. ఎటిఎం మిషన్ పైభాగంలో ఒక మిషన్‌లో రూ.14 వేలు, మరొక మిషన్‌లో రూ.2 వేల 700 నగదును దోచుకెళ్లారు. ఎటిఎం లోపలి లాకర్ రాకపోవడంతో దుండగులు వెనుదిరిగారు. ఎటిఎంల లోపలి లాకర్ తెరుచుకుంటే ఐదు లక్షలకుపైగా ఉన్న నగదు అపహరణకు గురై ఉండేవని బ్యాంక్ అధికారులు పేర్కొంటున్నారు.

కోటి ఎకరాలకు సాగునీరు పేరిట రూ.కోట్లాది నిధులు వృథా

తొగుట, జూన్ 7: కోటి ఎకరాలకు సాగునీరు అందించే పేరుతో ప్రాజెక్టులకు కోట్ల రూపాయలు ప్రభుత్వం వృధా చేస్తుందని, ఇప్పటికే రాష్ట్రంలో 70లక్షల ఎకరాలు సాగులో ఉండగా మరో 30లక్షల ఎకరాలకు చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో ప్రజలను ముంపునకు గురి చేయడం దారుణమని బిజెపి జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు విమర్శించారు. మంగళవారం మండలంలోని ఏటిగడ్డకిష్టాపూర్, వేములఘాట్ గ్రామాల్లో మల్లన్నసాగర్‌కు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షలకు సంఘీభావం తెలిపి మాట్లాడారు.

ఉద్యోగాల్లో సిద్దిపేటను ముందు వరుసలో నిలుపుతా

సిద్దిపేట, జూన్ 7: ఉద్యమంలో ముందున్న సిద్దపేటను ఉద్యోగాల్లో సైతం ముందువరుసలో నిలపడమే తన లక్ష్యమని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో గ్రూప్-2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ మెటీరియల్‌ను పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా సిద్దిపేట ప్రాంత అభ్యర్థులకు నిష్ణాతులైన ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అభ్యర్థులకు ఉచితంగా భోజన వసతి, అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. ఇటీవల కానిస్టేబుల్ ఉచిత శిక్షణలో సిద్దిపేట నుంచి 275మంది రిటర్న్‌టెస్టులో క్వాలిఫై అయ్యారని, వారికి ఫిజికల్ టెస్టులో సైతం శిక్షణ ఇచ్చామన్నారు.

రెండేళ్ల పాలనలో చేసింది శూన్యం

వెల్దుర్తి, జూన్ 7: టిఆర్‌ఎస్ రెండెల్లపాలనలో ప్రచారాలు, ఆర్భాటాలే తప్ప ప్రజలకు చేసేంది ఏమిలేదని మాజీ మంత్రి, ప్రస్తుత డిసిసి జిల్లా అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని శ్రీ బ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలో వెల్దుర్తి మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన సందర్భంగా అమె మాట్లాడారు. కేజీ టు పీజీ అని నేటికి అచరణలో లేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే విద్యార్థులకు లబ్ధి చేకూరిందని, ఫీజు రీయంబర్స్‌మెంట్ వల్లే అనేకమంది విద్యార్థులు పైచదువులు చదివారని నేడు అదే విద్యార్థులు అనేక మంది మధ్యలోనే చదువుకు దూరమయ్యారని అమె విమర్శించారు.

సిఎం దత్తత గ్రామాల్లో పేదలకు స్థానికంగానే ఉపాధి

జగదేవ్‌పూర్, జూన్ 7:సిఎం దత్తత గ్రామాలలోని పేదలకు గ్రామంలోనే ఉపాధి కల్పించేందుకు సిఎం ఆదేశించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటరాంరెడ్డి తెలిపారు. మంగళవారం ఎర్రవల్లిలో ఎర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమిలేని పేదలను గుర్తించి వారికి ఉపాది కోసం వంద శాతం సబ్సిడీపై టాక్ట్రర్లను ఆందచేయనున్నట్లు చెప్పారు.ఒ ప్రముఖ కంపెనీ టాక్టర్లను సరపరా చేసెందుకు సిద్దంగా ఉందని త్వరలోనే సిఎం కెసిఆర్ చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు జెసి వెంకటరాంరెడ్డి పెర్కొన్నారు. గడా హన్మంతరావు,జడ్పీటీసి రామచంద్రం, సర్పంచ్ భాగ్యబాల్‌రాజు, ఎంపిటీసి భాగ్యమ్మ,విడీసీ అధ్యక్షులు కిష్టారెడ్డి పాల్గొన్నారు.

పర్యావరణ రక్షణతోనే ఆరోగ్యకర సమాజం

గజ్వేల్, జూన్ 7 : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుండగా, మొక్కల పెంపకంతోనే ఆరోగ్యకర సమాజ నిర్మాణం సాధ్యపడుతుందని హరితహారం రాష్ట్ర ఒఎస్‌డి, సిఎం కార్యాలయ కార్యదర్శి ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. మంగళవారం గజ్వేల్‌లోని ఔషద మొక్కల పార్కును పరిశీలించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కల పెంపకానికి ప్రణాళికలు రూపొందించి సిద్ధం చేస్తుండగా, పండ్లమొక్కలతోపాటూ ఔషద, టేకు, నీడనిచ్చే చెట్లకు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు.

శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి

సంగారెడ్డి టౌన్, జూన్ 7: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లీం సోదరులు శాంతియుతంగా పండగను జరుపుకోవాలని సంగారెడ్డి డిఎస్పీ టి.తిరుపతన్న సూచించారు.మంగళవారం స్థానిక టిఎన్జీవోస్ భవన్‌లో శాంతి కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు మత సామరస్యంతో పండుగను జరుపుకోవాలన్నారు. ముస్లీం సోదరులు ఉపవాసంతో ఉంటారు కాబట్టి ఎక్కడా కూడా బాగోద్వేగాలకు గురికావద్దన్నారు. అనుమానస్పద వ్యక్తులు కనిపించినా, ఎమైన సంఘటనలు చోటు చేసుకున్నా వెంటనే సమాచారం అందించాలని సూచించారు. పరస్పరం సహకరించుకుంటూ ప్రశాంతంగా పండగను జరుపుకోవాలన్నారు.

సెకండ్ ఎఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి

సంగారెడ్డి టౌన్, జూన్ 7: రెండవ ఎఎన్‌ఎంల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 9నుండి తలపెట్టిన రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.మల్లేశం, కె.రాజయ్యలు పిలుపునిచ్చారు. ఎఎన్‌ఎంల రెగ్యులరైజ్ చేయాలని, 10వ పిఆర్‌సి ప్రకారం వేతనాలు చెల్లించాలని, డిఎ, హెచ్‌ఆర్‌ఎ ఇతర అలవెన్స్‌లు వర్తింపజేయాలని కోరారు.

యువతుల మృతదేహాల గుర్తింపు

జగదేవ్‌పూర్,జూన్ 7:మండల పరిధిలోని కొండపోచమ్మ ఆలయం వద్ద అనుమానస్పదంగా మృతి చెందిన యువతుల ఆచూకీ లభించినట్లు ఎస్‌ఐ వీరన్న తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన మంజుల (20) శిరీష (22) మంగళవారం గుర్తించినట్లు తెలిపారు. మీడియాలో వచ్చిన వార్తల అధారంగా వారి తల్లిదడ్రులు స్థానిక పోలీసు స్టేషన్‌కు వచ్చినట్లు చెప్పారు. ఏప్రిల్ 3న ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా వచ్చినట్లుగా వారి తల్లిదడ్రులు తెలిపినట్లు ఆయన తెలిపారు. కాగా ప్రేమ వ్యవహరమే వీరి ఆత్మహత్యకు దారి తీసినట్లుగా వారు అనుమానం వ్యక్తం చెసినట్లు తెలిపారు.

Pages