S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు నచ్చిన పాట--ప్రేమించి పెళ్ళిచేసుకో..

1966లో విడుదలైన అన్నపూర్ణావారి ఆత్మగౌరవం సినిమాలోని ఈపాట నేటి తరాన్నీ అలరించేదే. ‘ప్రేమ’ అనే పదం యువతకు గిలిగింతలు కలిగించేది. అది ఫలిస్తే సంతోషం, వికటిస్తే విషాదం.
కాలేజీలో జరుగుతున్న పోటీలో ‘ప్రేమ వివాహాలను’ సమర్ధిస్తూ సినారె రాసిన ఈ గీతం ఇటు పెద్దలకు అటు యువతరానికి హెచ్చరికగా ఉంటుంది.
ప్రేమించి పెళ్లి చేసుకో/ నీ మనసంతా హాయనింపుకో
వరుని వలపేమిటో/ వధువు తలపేమిటో/ తెలుసుకోలేక పెళ్లిళ్లు జరిపించినా/ తెలిసి కట్నాలకై బ్రతుకు బలిచేసినా/ కథకు మిగిలేది ఎడమోము.. పెడమోమే

-సుసర్ల సర్వేశ్వరశాస్ర్తీ, విశాఖపట్నం

ముద్రగడ వైఖరితో కాపులకే నష్టం: బోండా

విజయవాడ: కాపుఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయ కోణంలో పనిచేస్తూ అభివృద్ధిని అడ్డుకునేలా వ్యవహరిస్తున్నారని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోపించారు. ముద్రగడ చర్యలతో కాపులకే నష్టం జరుగుతుందన్నారు. కాపులకు రిజర్వేషన్ల విషయమై ప్రభుత్వం నియమించిన జస్టిస్ మంజునాథ కమిషన్‌ను ముద్రగడ ఇంతవరకూ ఎందుకు కలవలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు వల్లే కాపుల సంక్షేమం సాధ్యపడుతుందన్నారు.

అమరావతికి వెళ్లేందుకు సిద్ధం: బొప్పరాజు

విజయవాడ: ఈనెల 27 నుంచి అమరావతిలో విధులు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎపి రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు సోమవారం తెలిపారు. కొద్దిమంది ఉద్యోగులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఉద్యోగులందరికీ ఆపాదించరాదన్నారు. కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు తగిన వసతి చూపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఈ విషయమై సహకరించేలా కృష్ణా, గుంటూరు కలెక్టర్లకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన సిఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

దీర్ఘకాలం సెలవుపెట్టే వైద్యులను తొలగించండి

విజయవాడ: పేద ప్రజలకు సేవ చేయడానికి బదులు దీర్ఘకాలంగా సెలవులో ఉంటున్న ప్రభుత్వ వైద్యులను వెంటనే సర్వీస్ నుంచి తొలగించాలని ఎపి సిఎం చంద్రబాబు ఆదేశించారు. ఈనెల 8న జరిగే ‘మహాసంకల్పం’ సందర్భంగా ఆయన పలు శాఖల అధికారులతో సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని శాఖలకు లక్ష్యాలను నిర్దేశించామని, ప్రజల ఆకాంక్షల మేరకు అధికారులు పనిచేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల సంక్షేమాన్ని ఆశించి ప్రభుత్వం చేపట్టే పథకాలను విజయవంతం చేస్తేనే పాలనకు సార్ధకత ఉంటుందన్నారు.

మనోరమకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు

పాట్నా: సంపూర్ణ మద్య నిషేధ చట్టాన్ని ఉల్లంఘించినందుకు కొన్నాళ్లుగా జైలులో ఉంటున్న జెడియు ఎమ్మెల్సీ మనోరమా దేవికి పాట్నా హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. గయలోని జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చేందుకు రెండుసార్లు నిరాకరించడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. మనోరమ కుమారుడు రాకీ యాదవ్ గయలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ యువకుడిని రివాల్వర్‌తో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. రాకీ యాదవ్ కోసం గాలిస్తుండగా మనోరమ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇదివరకే ప్రకటించారు.

ఉమాభారతితో హరీష్ బృందం భేటీ

దిల్లీ: తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం సోమవారం ఇక్కడ కేంద్ర జలవనరుల శాఖామంత్రి ఉమాభారతిని కలిసింది. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు, ఎపి సర్కారు అభ్యంతరాలు, కృష్ణా రివర్ బోర్డు పనితీరుపై హరీష్ తన వాదనలను మంత్రికి వినిపించారని సమాచారం. కృష్ణా రివర్ బోర్డు కార్యదర్శి గుప్తా ఎపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నందున ఆయనను పదవి నుంచి తప్పించాలని హరీష్ కేంద్రమంత్రిని కోరినట్లు తెలిసింది. తెలంగాణలో చేపట్టిన నీటి పథకాలపై సమగ్ర నివేదికను ఆయన ఉమాభారతికి అందజేశారు.

విభజన చట్టంలో హామీలన్నీ నెరవేర్చాం..

ఒంగోలు: విభజన చట్టంలో ఎపికి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని, ప్రత్యేకహోదా అనే అంశం ఆ చట్టంలో లేనేలేదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సోమవారం ఇక్కడ తెలిపారు. ఎపి ప్రగతికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తోందని, ఇప్పటికే పలు ఇరిగేషన్ ప్రాజెక్టులను, విద్యాసంస్థలను మంజూరు చేశామని అన్నారు. అవినీతి రహిత పాలన అందించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని ఆయన వివరించారు.

నీటిని తరలిస్తున్నా నోరు మెదపని మంత్రులు!

హైదరాబాద్: అనంతపురం ప్రాంతానికి చెందాల్సిన నీటి వనరులను పొరుగు రాష్ట్రాల వారు తరలించుకుపోతున్నా జిల్లాకు చెందిన మంత్రులు నోరు విప్పడం లేదని కాంగ్రెస్ నాయకుడు శైలజానాథ్ విమర్శించారు. ఎంతసేపూ కాంగ్రెస్‌ను నిందించడం తప్ప టిడిపి మంత్రులు చేస్తున్నదేమిటని ఆయన ప్రశ్నించారు. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ ఓ కొత్త రాజకీయ విషసంస్కృతికి టిడిపి, వైకాపా నేతలు తెరలేపారని ఆయన అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్ప ఈ విమర్శల వల్ల ఒరిగేదేమీలేదన్నారు.

కోదండరామ్ కాంగ్రెస్ ఏజెంట్: ఎంపీ సుమన్

హైదరాబాద్: గత రెండేళ్ల కాలంలో కెసిఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, చేతకాకుంటే ఆయన అధికారంలో నుంచి తప్పుకోవాలంటూ తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చేసిన వ్యాఖ్యలపై తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు నిప్పులు చెరుగుతున్నారు. కోదండరామ్ కాంగ్రెస్ ఏజెంట్ అని తెరాస ఎంపీ బాల్క సుమన్ ఆరోపించగా, జెఎసి ఉనికి కోల్పోయిందని గనుక కోదండరామ్ దేనికి చైర్మన్‌గా ఉన్నారో ప్రజలకు చెప్పాలని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రపంచమంతా కెసిఆర్‌ను మెచ్చుకుంటుండగా ఏమీ జరగడం లేదని కోదండరామ్ అనడంలో అర్థం లేదని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటుకు సమీక్ష

హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తన చర్యలను వేగవంతం చేసింది. ఈ నెల 7,8 తేదీల్లో జరిగే కలెక్టర్ల సదస్సులో ఈ విషయమై చర్చించేందుకు కసరత్తు జరుగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను విశే్లషిస్తూ తగిన నివేదికలతో హాజరు కావాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

Pages