S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాయిహాయిగా..

బాగుంది --అఆ

తారాగణం:
నితిన్, సమంత, అనుపమ
పరమేశ్వరన్, నరేష్, నదియ,
రావు రమేష్, అనన్య, ఈశ్వరీరావు.
సంగీతం:
మిక్కీ జె మేయర్
కెమెరా:
నటరాజన్ సుబ్రమణ్యం
నిర్మాత:
ఎస్ రాధాకృష్ణ
దర్శకత్వం:
త్రివిక్రమ్
**

-త్రివేది

కాకి బంగారం

బాగోలేదు-- శ్రీమతి బంగారం

తారాగణం:
రిషి, రాజీవ్ కనకాల, రీచాసిన్హా, శీతల్, వేణుమాధవ్,
హేమ తదితరులు.
సంగీతం: సిద్ధబాపు.
కెమెరా: బాబు
నిర్మాతలు:
చెన్న శ్రీనివాస్,
కొత్త సత్యనారాయణరెడ్డి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
వినయ్‌బాబు.
**

-తిలక్

అమీ.. తుమీ..

అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చిన బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్సన్‌కు ఇప్పుడు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ‘మదరాసు పట్టణం’తో పరిచయమైన ఆమె ఇటీవలే విడుదలై ‘ఐ’ చిత్రంతో మంచి గుర్తింపు పొందింది. తెలుగులోనూ నటించాలన్న ఆమె కలలు ఒక్కసారిగా ఫలించే అవకాశాలొచ్చాయ. ‘ఎవడు’ చిత్రంలో నటించాక అనేక అవకాశాలు వచ్చినా, దర్శకుడికి ఇచ్చిన మాట ప్రకారం ఆ అవకాశాలను వినియోగించుకోలేకపోయింది. ప్రస్తుతం అమీ జాక్సన్, రజనీకాంత్ -శంకర్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ‘రోబో-2’ చిత్రంలో నటిస్తోంది. ప్రభాస్ బాహుబలి చూశాక ఆయనతో నటించాలన్న కోరికను బైటపెట్టిన అమీకి ఆ అదృష్టం కూడా తలుపు తట్టింది.

ఏదీ విలువల సౌశీల్యం?

చిత్ర రంగంలో తరచూ వినిపించే ప్రశ్న ఇది. మరీ ముఖ్యంగా -తెలుగు పరిశ్రమలో వినిపించి తీరాల్సిన ప్రశ్న కూడా. ఈమధ్య మధురగీతాల మహాసామ్రాజ్ఞి తెలుగు పాటల ఎలమావి పి సుశీల గిన్నిస్ రికార్డు అందుకున్నారు. అందరూ సంతోషించేదే. అలాంటి గొప్ప గాయనితో సంగీత దర్శకుడు కీరవాణి ఒక్క పాట కూడా పాడించలేదు. ఎందుకు? అన్నది వేయి వరహాల ప్రశ్న. స్వర మాంత్రికురాలు ఎస్ జానకితోనూ కీరవాణి ఒక్కపాటా పాడించలేదెందుకని?. పాడక పోవడానికి వారివైపు కారణాలుండొచ్చు. సమయం, ఆరోగ్యం, ఓపిక, పారితోషికంలాంటి సమస్యలూ ఉండొచ్చు. కానీ అడిగిన దాఖలా లేదు కనుక -‘ఆ తరాన్ని మనం గౌరవించే దాఖలాలు’ లేనట్టే కదా!

-దినకర్

తప్పేంటి?

హీరోలేనా సిక్స్ ప్యాక్ చేసేది.. మేమూ చేస్తామంటూ ప్రయత్నాలు మొదలెట్టిందట దీపికా పదుకొనె. హాలీవుడ్‌లో చిత్రాలు చేస్తున్న దీపికకు అక్కడికి వెళ్ళాకే ఇలాంటి ఆలోచనలు వచ్చాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే జీరో సైజ్‌తో ఆకట్టుకునే దీపిక, ప్రస్తుతం సిక్స్‌ప్యాక్ కోసం కసరత్తులు చేస్తోందట. హాలీవుడ్‌లో హీరోయిన్లు హీరోలతో సమానంగా ఫైట్లు గట్రా చేసి అదరగొట్టేస్తుంటారు. ఇప్పుడు తాను కూడా అక్కడ నటిస్తోంది కనుక వారిలాగే ఫైట్లు చేయాలంటే సిక్స్ ప్యాక్ చేయడం తప్పనిసరని నిర్ణయం తీసుకుందని సమాచారం. ప్రస్తుతం ఆమె సిక్స్‌ప్యాక్ కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

నాకు నచ్చిన చిత్రం--మాయాబజార్

1957లో విడుదలై మరపురాని చిత్రంగా నిలిచి 2010లో బ్లాక్ అండ్ వైట్ నుండి కలరైజు అయి ఘన విజయం సాధించిన ఏకైక చిత్రం మాయాబజార్. కెవి రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఏఎన్నార్, సావిత్రి, సంధ్య, ఋష్యేంద్రమణి, గుమ్మడి, సిఎస్‌ఆర్, మిక్కిలినేని, నాగభూషణం, అల్లు రామలింగయ్య, వివి సుబ్బయ్య, మాధవపెద్ది, ఛాయాదేవి, ఆర్ నాగేశ్వరరావు, సూర్యకాంతం, రమణారెడ్డి, రేలంగి మొదలైన అతిరథ మహానటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు ధరించారు. తన రచనా బలంతో పింగళి నాగేంద్ర అద్భుతమైన కథను సృష్టిస్తే, మార్కస్ బార్ట్లే తన సినిమాటోగ్రఫీతో మాయచేసి చూపించిన చిత్రమిది.

-పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం

అదీ.. అంకితభావం --శరత్కాలం

మహానటుడు నందమూరి తారక రామారావు గురించి ఏ ముచ్చట చెప్పుకున్నా -అది ఆసక్తికరంగానే ఉంటుంది. ఆయన కదలికలు, అలవాట్లు, ఆలోచనలు, ప్రతిభా పాటవాలు, చరిత్ర సృష్టించిన వైనం, అవసాన దశలో ఎదుర్కొన్న ఇబ్బందులు.. అన్నీ తెలుసుకోదగ్గ అంశాలుగానే అనిపిస్తాయి. తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన రావడం ఒక ఆసక్తికరమైన సన్నివేశం అయితే, చరిత్ర సృష్టించి నిష్క్రమించడమూ ఎమోషన్ పండించిన సన్నివేశమే అనుకోవాలి. తెలుగు సినిమా పరిశ్రమ రొమ్ము విరిచి చెప్పుకోగలిగే ఎంతోమంది గొప్ప కళాకారుల్లో ఎన్టీఆర్‌ది ప్రత్యేక స్థాయి అని చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహించక్కర్లేదు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717

తప్పదు మరి!

‘ఎస్‌ఎంఎస్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రెజీనా ఆ తరువాత ‘రొటీన్ లవ్‌స్టోరీ’, ‘కొత్తజంట’, ‘రారాకృష్ణయ్య’ వంటి చిత్రాల్లో నటించింది. సందీప్
కిషన్‌తో రారాకృష్ణయ్యలో అందాలు ఆరబోసి, లిప్ లాక్ సన్నివేశాలతో అందరి మనసు దోచుకుంది. ఆ తరువాత ‘పవర్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘సౌఖ్యం’, ‘శౌర్య’ వంటి చిత్రాల్లో
నటించింది. అయితే వరుసపెట్టి ఫ్లాప్‌లు రావడంతో అవకాశాలు కరువయ్యాయి. దీంతో మళ్లీ

Pages